Powered By Blogger

Sunday, 27 November 2022

కరోనా కథలు

 
హలో .. హలో .. వినిపిస్తుందా .. రేవతి హాస్పిటల్ యేనా .. కంగారుగా అడిగింది అర్చన . 

హా .. రేవతి హాస్పిటల్ .. చెప్పండి .. అంది అవతలివైపు స్త్రీ కంఠం నీరసం గా . 

మా మావగారికి ఊపిరి ఆడటం లేదు కొంచెం అంబులెన్సు పంపిస్తారా .. అడిగింది ఆశగా . 

మేడం .. పరిస్థితి తెలుసు కదండీ .. ఇప్పుడు వీలు కాదు . హాస్పిటల్ లో బెడ్స్ కూడా లేవు .. మీరింకో హాస్పిటల్ కి ఫోన్ చేయండి . .. అందామె 

అది కాదండీ .. అని అర్చన అనేలోపే ఫోన్ పెట్టేసిన శబ్దం .. 

నిరాశగా ఫోన్ వైపు చూసి ..తన వంకే చూస్తున్న అత్తగారికేసి చూసి .. తల అడ్డంగా ఊపింది . 

దేవుడా .. ఏమిటీ పరీక్ష .. కళ్ళ నిండా నీళ్లతో సోఫాలో కూలబడి పోయింది పార్వతి . 

ఏ హాస్పిటల్ కి కాల్ చేసిన ఇదే రెస్పాన్స్ ... ఇప్పుడేం చేయాలి ? అని ఆలోచిస్తూ .. తాను అత్తగారి ఎదురుగా కూర్చుని ... 

అత్తయ్యా .... మీరు కంగారు పడకండి .. నేను ఏదో ఒకటి చేస్తాను .. అని మళ్ళి ఫోన్ పట్టుకుంది 
అర్చన . 

అమ్మా ..అర్చనా .. అసలే పరిస్థితులు బాగులేవు ,,ఈ మాయదారి రోగం తో జనాలు చచ్చిపోతున్నారు అంటే వినకుండా బయటకి వెళ్లారు .. సేవ చేయలేకపోతున్నాం .. కళ్లారా ఆయన బాధ చూడలేకున్నాం .. ఏమిటమ్మా ఈ నరకం .. కన్నీళ్లతో అంది పార్వతి . 

అర్చన కి తెలుసు .. వయసు రీత్యా అతడి పరిస్థితి కూడా చెప్పలేము . ఇంట్లో రెండేళ్ల బాబు ఉన్నాడు .. ఆమె భర్త శ్రీధర్ విదేశాల్లో ఉన్నాడు . విమాన రాకపోకలు కూడా ఆపేయటం తో అతగాడు ఇండియా కి రావటమూ అయ్యేపని కాదు ... అర్చన కూడా ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి . 
ప్రస్తుతం ఇంట్లోంచి పనిచేసుకునే వెసులుబాటు ఉన్నా .. 

మావగారికి కోవిడ్ సోకటంతో వాళ్ళింట్లో తీవ్రమైన ఒత్తిడి కి లోనైంది . తమని తాము కాపాడుకుంటూ అతడిని చూసుకోవాల్సిన బాధ్యత . ఇంకోపక్క భర్త మీద బెంగ గా ఉంది . 

ఇంకే హాస్పిటల్ కి కాల్ చేద్దామా అని గూగుల్ లో చెక్ చేస్తున్న ఆమె కి .. ఈలోపు తన కొలీగ్ వీరేంద్ర నుండి ఫోన్ వచ్చింది . 

వెంటనే లిఫ్ట్ చేసి .. వీరేంద్ర .. అంది అర్చన . 

అర్చన .. ఎలా ఉన్నారు మీ అంకుల్ ? అన్నాడు వీరేంద్ర . 

పరిస్థితి బాగులేదు .. ఎవరైనా అంబులెన్సు పంపిస్తే వెంటనే హాస్పిటల్ లో చేరుద్దామంటే 

ఎక్కడ అవకాశమే లేదంటున్నారు ... అంది జీరబోతున్న గొంతు తో . 

ఇమేజ్ హాస్పిటల్ కి కాల్ చేశాను అర్చన .. కానీ ఒకరోజు కి లక్ష రూపాయలు ఖర్చు కావొచ్చు . 
అయినప్పటికీ నమ్మకం లేదు .. 
ఏం చేద్దామంటావ్ ? ఏదో ఒక నిర్ణయం తీసుకుని చెప్పు అన్నాడు వీరేంద్ర . 

శ్రీధర్ ని అడగాలి .. నేను నీకు ఫోన్ చేస్తాను అంది మెల్లిగా . 
సరే .. అని పెట్టేసాడు వీరేంద్ర . 

అర్చనా ... ఏమైనా దారి దొరికిందా అమ్మ .. ఆశగా అడిగింది పార్వతి . 

ఒక్క నిమిషం అత్తయ్యా .. అని శ్రీధర్ కి కాల్ చేసింది అర్చన . 
అటువైపు శ్రీధర్ .. జీరబోతున్న గొంతుతో అర్చనా .. అన్నాడు . 

ఏవండీ .... అంది గాద్గదిక స్వరం తో .. 
నాన్నగారు ..  అని ఆగిపోయాడు శ్రీధర్ .. 
మీ గొంతు ఏంటి అలా ఉంది .. మీరు బావున్నారు కదా అంది భయంగా .. 
హా .. బాగానే ఉన్నాను .. ముందక్కడి విషయం చెప్పు అన్నాడు శ్రీధర్ . 
మీరు ఇక్కడికి రావటానికి ప్రయత్నించండి .. ఎందుకో నాకు ధైర్యం సరిపోవట్లేదు అంది అర్చన . 
ప్రయత్నిస్తున్నాను అర్చనా ... ఎంబసి కి మెయిల్ చేశాను . చూద్దాం ఏమవుతుందో .. 
నాన్నగారి పరిస్థితి విషమించిందా ఏంటి ? వణుకుతున్న కంఠం తో అన్నాడు శ్రీధర్ . 

త్వరగా ఏదో స్టెప్ తీసుకోవాలి ... ఇమేజ్ హాస్పిటల్ వాళ్ళు చేర్చుకుంటారుట ... కానీ .. అని ఆగిపోయింది అర్చన . 

మన ప్రయత్నం మనం చేద్దాం అర్చన .. చేర్పించు .. మందులే లేని వ్యాధి ని వారెలా నయం చేస్తారు .. అంతా భగవంతుని దయ .. అన్నాడు శ్రీధర్ . 

సరేనండీ .. ఇప్పుడే ఫోన్ చేస్తాను . అంది అర్చన . 

అర్చనా .. మీరు టెస్ట్ చేసుకున్నారు కదా .. అమ్మ .. నువ్వు .. బాబు .. ఒకసారి చేసుకుంటే మంచిది .. అన్నాడు శ్రీధర్ . 

అలాగేనండి అంది అర్చన .. 
నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను .. ఉంటాను అని పెట్టేసాడు శ్రీధర్ . 
వెంటనే ఇమేజ్ హాస్పిటల్ కి కాల్ చేసింది అర్చన ... ఒక గంట తరువాత అంబులెన్స్ వచ్చింది 
గ్రహాంతరవాసుల్లా హాస్పిటల్ సిబ్బంది వచ్చి అర్చన మావగారిని తీసుకుపోయారు 

                                  *****************************************

మరుసటిరోజు ఉదయాన్నే తన కార్ లో అత్తగారిని , కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్లి తనతో పాటూ వారికీ టెస్ట్స్ చూపించింది . 
పార్వతి ఉదాసీనంగా ఉంది తిరుగు ప్రయాణంలో . 
ఆమెని కదిలించే ధైర్యం లేక అర్చన కూడా మౌనం గానే ఉంది . 
బాబు నిద్రపోతున్నాడు . 
వాళ్ళుండే ఏరియా కి దగ్గర్లోకి వచ్చేసరికి .. అర్చనా .. ఇంట్లో సరుకులు అయిపోయాయమ్మా .. 
అంది కార్ విండో లోంచి సూపర్ మార్కెట్ చూస్తూ . 

అందరు సూపర్ మార్కెట్ ముందు వరుసగా  దూరం దూరం గా మాస్క్ లతో నిలబడి ఉన్నారు . 

డ్రైవ్ చేస్తూనే వారి వైపు చూస్తూ .. చాలా పెద్ద క్యూ నే ఉంది అత్తయ్య . నేను ఆన్లైన్ లో తెప్పిస్తాను

అని సరాసరి తన అపార్ట్మెంట్ వైపు పొనిచ్చింది అర్చన . 

అపార్ట్మెంట్ ముందర ఓ అంబులెన్స్ ఆగివుంది .. ఎవరో చనిపోయి నట్టున్నారు .. తీసుకువెళ్తున్నారు .. ఎవరా అని చూసింది కార్ పార్కింగ్ వైపు డ్రైవ్ చేస్తూనే . 

తమ ఎదురు ఫ్లాట్ శ్రావ్య ఏడుస్తూ కనపడింది ఆమె కి . 

కార్ దిగి అత్తయ్యా .. బాబు ని తీసుకుని మీరు పైకి వెళ్ళండి అని ఫ్లాట్ కీస్ ఆమె కిచ్చి .. మాస్క్ సరి చేసుకుంటూ శ్రావ్య వైపు నడిచింది అర్చన . 

అర్చన ని చేస్తూ ఏడుపు దిగమింగుకుని .. అర్చనా .. మావారు .. అంటూ భోరుమంది . 

అయ్యో .. అని ఎప్పుడు జరిగింది శ్రావ్య అంది అర్చన . 

2గం ముందే ప్రాణం పోయింది .. ఊపిరి ఆడలేదు .. నా కళ్ళముందే .. ఆమెకి మాట రాలేదు . 

దగ్గరికి తీసుకుని ఓదార్చలేని దుస్థితి .. సాటి మనిషి కి సాయంగా ఉండలేని స్థితి .. కంటికి కనబడని ఓ జీవి ఆత్మీయుల్ని తీసుకుపోతుంటే .. ఏమి చేయలేక .. 

శ్రావ్యా ... ఏం చెప్పాలో తెలియడం లేదు .. యు బి  సేఫ్ .. అంది గొంతు పెగుల్చుకుంటూ అర్చన . 
అంత్యక్రియలు చేయటానికి కూడా ఎవరూ లేరు అర్చన .. ఆయన్ని అనాథలా పంపించేసాను . 

మావాళ్లు రావటానికి కూడా పరిస్థితులు అనుకూలించని ఈ పరిస్థితులు ఏమిటో ,, 

ఇలాంటి రోజులు వస్తాయని ఊహించలేదు అర్చనా .. అంది శ్రావ్య . 

అవును .. ఎక్కడ వారు అక్కడే .. నిర్మానుష్యంగా వీధులు .. రోడ్లు .. బయటికి రావాలంటే ఓ యుద్ధ 
సన్నాహం .. ఎప్పుడు ఎవరికీ ఏమవుతుందో అన్న భయం .. 
రేపు రిజల్ట్ వచ్చేవరకు ఇంకో టెన్షన్ .. 

శ్రావ్య .. అలానే మోకాళ్ళ పై కూలబడి ఏడుస్తుంది .. 

ఆమెని మనసారా ఓదార్చలేని నిస్సహాయ స్థితి లో అక్కడ్నించి లిఫ్ట్ వైపు కదిలింది అర్చన .. 

ఇంకా ఉంది 

Saturday, 26 November 2022

సుధాభరితం


సుప్రభాత రాగాలు పాడే హేమంతం 
సుస్వరాల గీతాలాపనతో విహంగ సంగీతం .
సువాసనలతోకూడి  వీచే మలయమారుతం ..
సుగంధాలు విరజిమ్ముతూ పూసే పారిజాతం 
సుమనోహరం తలలూపుతున్న వరిచేల కమతం ..
సులేపనాల మర్దనాలు భువికి చేసే  తుషారమే సొంతం . 
సుపరిచితాలు లేలేత కిరణాలు మేనుకే సమ్మతం 
సుదూరతీరాన సూరీడి ఏకాంతం..
సురాసురలోకానా వినవచ్చే ఆద్యంతం 
సువర్ణ వర్ణాన  ఆ భానుని చూసే సూర్య కాంతం  .
సుకుమారి అవని పలికే మనసారా స్వాగతం .
సుదినమే నేడు అంటూ పలికే మాటే సుధాభరితం


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

ప్రతిరోజు సుప్రభాతమే..


ప్రతిరోజు సుప్రభాతమే..
ప్రతి పలుకు చైత్రగీతమే ..
ప్రతి మనసు నవనీతమే .
ప్రతి ఆశ మౌనరాగమే..
ప్రతి శ్వాస వాయులీనమే 
ప్రతి తలపు వెతికే హృదయమే 
ప్రతీ మలుపు జీవన గమనమే
ప్రతి పిలుపు జీవిత మధురిమే
ప్రతి గాధ అనురాగ ప్రభందమే
ప్రతి క్షణం నిలిచే స్మృతిపథమే
ప్రతి నిన్న మారే ఙ్నాపకమే
ప్రతి రేపు ఊరించే స్వప్నమే
ప్రతినేడు కమ్మని ఓ నిజమే
ప్రతి మనిషి బ్రతుకున సత్యమిదే

Tuesday, 13 June 2017

ఆవేదనలోస్వార్ధపు ఛిచ్చు బిగిసిన ఉఛ్చ్చు ..
మనసుని కలచిందే ... 
అపార్థపు నిప్పు .. ముడివేసిన ముప్పు 
గుండె ని కాల్చిందే .. 

ఎందుకో తెలియని ఆవేదనా .. ఎవరికి వినబడదు ఆలాపనా .
ఏమిటో చెప్పని ఆక్షేపణా .. ఎన్నడూ కోరని ఆరాధనా .. 
మధురస భావన తెలియని హృదయం నాదని అనుకోనా .. 
మమతాన్వేషణ లో మునిగిన సమయం ఇది అవునా .. 

గాయాలను మాన్పె మందు ప్రేమ ని తెలిసున్నా .. 
ఆ ప్రేమని వెతికే పని లో గాయం గెలిచేనా .. 
ద్వేషపు జ్వాలలో మనసులు కాలి మలినం అవుతున్నా .. 
అనురాగపు వంతెన నింగి నేలని కలిపే తీరేనా ..
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Monday, 27 March 2017

శ్రీకారం ....


శ్రీకారం .... 


ఒక మంచి పనికి శ్రీకారం . అవును ... మనలో చాలా మందికి పది మందికీ సహాయం చేయాలనీ ,

మనలోను దానగుణం ఉందనీ చాటాలని పిస్తుంది . కానీ ఆర్ధిక స్థోమత కారణం గానో లేదా  ఏ 

దారిలో సహాయం చేయాలో అవగాహన లేకపోవడం వల్లనో ఆ అవకాశం మనకి కలిగి ఉండక 

పోయుండ వచ్చుఁ .. 


మీరూ ఆ కోవకి చెందిన వారా ? అయితే ఇక్కడ ఉంది ఒక అవకాశం . 

ఈరోజుల్లో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది .. ఇదో సామాన్య మైన 

విషయమే ఇప్పుడు . 100 రూపాయల నుంచి  వేల రూపాయల్లో ఆన్లైన్  షాపింగ్ యథేఛ్చా గా 

సాగుతుంది . 

ఐటమ్ బుక్ చేసిన రోజునే డెలివరీ ఇవ్వడం కూడా సాధారణ మైపోయింది . 

ఇకపోతే మన కాన్సెప్ట్ కి వచ్చ్చేద్దాం . 

శ్రీకారా . కామ్(www.sreekara.com) .. ఈ వెబ్సైట్ లో మనకి తెలిసిన ప్రఖ్యాత ఆన్లైన్ షాపింగ్ సైట్స్ అన్ని చేతులు

కలిపాయి . మరి కొన్ని జాయిన్ కానున్నాయి . ప్రతి ఆన్లైన్ వెబ్ సైట్ ని యుఆర్ఎల్ ని 

గుర్తుంచుకునే అవసరం లేదు. 

శ్రీకారా లో ఒక్క క్లిక్ తో ఆన్లైన్ షాపింగ్ ప్రపంచాన్ని చుట్టేయండి .  ఎన్నో ఆఫర్స్ మిమ్మల్ని 

ఉక్కిరిబిక్కిరి చేస్తాయి . coupons కూడా మీకు అదనపు ఆకర్షణ . శ్రీకార లో షాపింగ్ చేయండి 

 కమిషన్ రూపం లో వచ్ఛే ఆ కొంత మొత్తం  పేదలకి  సహాయమవుతుంది . 

నారచన లో ఉన్న ఫ్లిఫ్కార్ట్ , అమెజాన్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా కూడా మీకు పేదలకి 

సహాయం చేసే అవకాశం కల్పించ బడింది . 

మరి మేము శ్రీకారం చుట్టిన ఈ మంచి పనికి మీ అందరి సహకారం , ఆశీర్వాదం 

ఉంటుందని ఆశిస్తున్నాం . 

మొగ్గ దశ లో ఉన్న శ్రీకార ... రోజు కి రోజు రూపు దిద్దుకుంటూ నే ఉంటుంది . 


మీ అందరి సలహాలు కూడా మాకు ఆమోద యోగ్యమే ... మరి శ్రీకారా లో షాపింగ్ 

చేస్తారు కదూ ..... 

                                                                                                     రాధిక ఆండ్ర         keep visiting www.sreekara.com for more exciting offers as well as naarachana.com

        https://www.facebook.com/naarachana
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Thursday, 3 November 2016

పెద్దరికం

వర్షం పడి  బురద గా ఉంది రోడ్ అంతా ..

ఒక పెద్ద మనిషి పంచె పైకి లాక్కుంటూ విసుక్కుంటూ నడుస్తున్నాడు ..

ఇంతలో రోడ్ పై  ఒక గుంట బురద నీటితో నిండి ఉందేమో పెద్దాయన చూసుకోలేదు .. అంతే

కాలుజారి జర్రున జారి పడ్డాడు ..

పక్కనే వెళ్తున్న ఒక వ్యక్తి .. అయ్యో పడి పోయారా .. అంటూ చెయ్యి అందివ్వ బోయాడు ..

పెద్దాయన చెయ్యి అందిస్తున్న అతడిని నఖ శిఖ పర్యంతం చూసి .. ఇతడా ? తక్కువ కులం

వాడు .. అని మెల్లిగా గొణుక్కొని .. ఆ పక్కగానే వెళ్తున్న గుడి పూజారి శర్మ గారిని చూసి ..

ఏమయ్యా శర్మా ? ఇలా వఛ్చి నన్ను కొంచెం లేపవయ్యా .. అన్నాడు.

చెయ్యి అందించేందుకు ప్రయత్నించిన వ్యక్తి కి విషయం అర్థమైంది .. కానీ అతడు చిన్న

బుచ్చుకోకుండా పెద్దాయన వైపు చిరునవ్వు తో చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

శర్మగారు పెద్దాయన ని లేపడం , పెద్దాయన అక్కడి నుండి వెళ్లిపోవడం జరిగి పోయాయి .

కొన్నాళ్ల తరువాత .....

పెద్దాయన కి ఒక చిన్న ఏక్సిడెంట్ .. రక్తం పోయింది .. రక్తం సమయానికి ఎక్కించాలంటే

అరుదైన వర్గపు రక్త మాయే .. పెద్దాయన కుటుంబం బెంబేలు పడిపోయింది.

ఇంతలో నర్స్ వఛ్చి చెప్పింది . దాత దొరికాడు సుమీ .. పెద్దాయన ప్రమాదం నుంచి బయట

పడ్డాడు . ఇంటికి చేరాడు సంపూర్ణ ఆరోగ్యం తో .

పెద్దాయన పూర్తి గ కోలుకున్నాక పెద్దాయన భార్య ఒక నాడు అంది. మీ ప్రాణాలని కాపాడిన

డాక్టర్ గారికి కృతజఞతలు చెప్పి వద్దామండి  అని. పెద్దాయన సరే అన్నాడు ..

ఇద్దరు డాక్టర్ ని కలిసేందుకు వెళ్లారు . డాక్టర్ ఒక వ్యక్తి తో మాట్లాడుతూ కనపడ్డాడు.

పెద్దాయన ని చూసి డాక్టర్ లోపలి ఆహ్వానించాడు . డాక్టర్ తో మాట్లాడుతున్న వ్యక్తి పెద్దాయన

ని చిరునవ్వు తో చూసి మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది ? అన్నాడు .

పెద్దాయన అతడి ని చూసి  ఇతడా ? ఆ కులం తక్కువ వాడే కదూ .. అనుకుంటూ .. అతని

పలకరింపు ని లక్ష్య పెట్టక డాక్టర్ ని చూసి ..

మీరు మా ప్రాణం కాపాడారు .. మీకు కృతజఞతలు చెప్దామని వచ్చాం .. అన్నాడు పెద్దాయన .

అయ్యో .. మా డ్యూటీ మేము చేసాం . నిజానికి కృతజఞతలు చెప్పాల్సింది ఈయన కె నండి .

ఆరోజు మీకు రక్తం ఇచ్చింది ఈయనే .. సమయానికి ఈయన రక్తం ఇవ్వకుంటే ఈ పల్లె లో

బొటాబొటి వైద్య సదుపాయాలున్న ఈ చోట మిమ్మల్ని కాపాడటం మాకు సాధ్య మయ్యేది కాదు .

అన్నాడు డాక్టర్ .

పెద్దాయన విస్తు బోయాడు . నోట మాట రాలేదు ఆయనకి .

ఆ వ్యక్తి లేచి పెద్దాయన తో .. అవునండి .. మీ రక్త వర్గం నా రక్త వర్గం ఒక్కటే .. కానీ కులాలు వేరు

. నేను కులానికి తక్కువ వాడిని .. గుణానికి కాదు . అని డాక్టర్ గారి దగ్గర సెలవు పుచ్చు కొని

వెళ్ళిపోయాడు .


పెద్దాయన కళ్ళు నీళ్లతో నిండి పోయాయి .. అవి పశ్చాత్పాపం తోనా అవమానం తోనా ..

ఆ భగవంతుడికే తెలియాలి .

                                             

                                     

దూరమయిన బంధంమిణుగురుల వెలుతురులా .. గోదారి ఒడ్డున మసక వెన్నెల .. 

నునువెచ్చ్చని గ్రీష్మపు తాకిడి .. నుదుట పట్టిన చెమట తడి . 

నడి మధ్య అలల తో తెరచాప .. చిరుగాలికి నా పైట రెపరెపా . 

వెచ్చ్చని ఇసుక తిన్నెల పై నా బొటన వేలు సంభాషణ .. 

మబ్బుల్లోకి చంద్రుడు .. మరి రా డే  నా ఇంద్రుడు .. ?

మౌనం గా గోదారి తో మాట్లాడుతున్నా .. కళ్ళ వెంబడి వరదలైన గోదారిని 

ఏ దారిన పంపాలని అడుగుతున్నా .. 

ప్రతి ఏడు ఇదే చోటు .. ప్రతి సారి ఇదే నేను .. మరి ఈసారి ఆ ప్రతి సారి కాలేదే . 

ముక్కలైన హృదయాన్ని ఏరుకునే మనసు లేదు .. 

సెలవిచ్చ్చిన సంతోషాన్ని కోరుకునే వయసు కాదు . 

జ్ఞాపకాలే ఆలంబన గా సాగుతున్న జీవితాన్ని .. మాయమైన నీ చిరునవ్వుని 

గోదావరి గల గల ల  సవ్వడి లో వెతుకు తున్నా .. 

పిల్ల గాలుల పల్లకి లో నీ ఊసుల దొంతరలు నాదాకా వస్తాయేమో అనుకున్నా .. 

మరి రావని జత కావని ఇక లేవని ఆలోచనే తనువెల్లా  తాకుతుంటే 

నిస్పృహలే తోడుగా నిస్తేజపు అడుగులతో ఈసారికి వెళుతున్నా .. 

మనసు నిక్కడ ఉంచి నేను జీవచఛవ మై  నడిచా .. 

ఈనాడల్లే ప్రతి ఏడు నీ కొరకే మరలి వస్తా ... 

నిను కడుపున దాచుకున్న గోదారిని నిలదీస్తా .. 

ఎందుకు దూరం చేసిందని ...

 తన ఒడ్డున పుట్టిన ప్రేమ కి తానె అసూయ ఎందుకు పడిందని ... ????


మీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Friday, 16 September 2016

మీతో కాసేపు


కాలం కరిగిపోతుంది .. కలం ముందుకి దూసుకు పోతుంది ..

కానీ మనసే ఎక్కడో ఆగిపోయింది ..

ఏదో అలజడి మదిలో ... అంతెరుగని శూన్యాన్ని చూసినట్టు ...

స్పందన లేనట్టు హృదయం ఊరుకోదు ..

చేతన లేనట్టు కలం ఒప్పుకోదు ..

అందుకే అక్షరాలు రంగు నింపుకున్నాయి .. ..

ఎప్పుడో విన్న సంగీత పాఠం గుర్తు చేసుకున్నట్లు గా ..

అలవోక గా ఇలా ముందుకు సాగుతున్నాయి నా వేళ్ళ కదలిక తో ..

అవును .. రచన లో నా ఇష్టం ఉంది .. నా అభిరుచి ఉంది .. నా దరహాసం ఉంది ..

నా విశ్రాంతి ఉంది .. మనఃశాంతి ఉంది ..

అందుకే విరిసే పూవు ని చూసినా ... ఆ పూవు పై ముత్యం లా మురిసే చినుకుని చూసినా

కవిత పొంగుకొస్తుంది .. భావుకత తన్నుకొస్తుంది .

పరిస్థితులు , విశ్రాంతి లేని సమయం , బాధ్యతలు , బంధాలు  కట్టిపడేస్తున్నా ..

ఒక్కసారి  నా " నా రచన " లో విహరించేందుకు కాలం కొన్ని నిముషాలు కానుకిచ్చ్చింది .

ఆపకంటూ నా వేళ్ళు కీబోర్డ్ పై నాట్యాన్ని చేస్తున్నాయి ..

కానీ .. మళ్ళి  కలుద్దాం అంటూ సెలవు తీసుకుంటున్నా ..

నా బ్లాగ్ చదివే వారందరికీ కృతజఞతలు .. త్వరలోనే మళ్లి  నా రచన లో లోతులు చూద్దాం                                                                                             మీ
                                                                                                   రాధికా ఆండ్రమీ అభిప్రాయం మాకు అతి విలువైనది

Tuesday, 26 July 2016

అమ్మ ప్రేమ
అలవోక గా ని ను చూడగా .. చిరునవ్వుతో నన్ను చూస్తావుగా ..

ఆ మోము న వెన్నెలలు జలతారులై జాలువారుగా ...

అచ్చెరువై నేను నిను చూసి మురిసి ముద్దొఛ్చి నేనిన్ను ఒడి చేర్చగా ..

లేలేత చివురాకుల పెదవుల పై జడివానలా నవ్వులే కురియగా ..

ఆ చిన్ని కిట్టయ్య నే కన్న తల్లి యశోద నేనయ్యి మురిసానుగా ..

నా హృదయ ధార లే నీ బొజ్జ నింపగా .. కలువ రేకు కనులే నిదురమ్మ నడిగే ..

ఉయ్యాలలో సేద తీరేటి వేళా .. నా గొంతులో ఎన్ని రాగాల సుడులో ..

నునులేత పాదాలు నేలమ్మ తాకి పలుమారు నిన్నేమో ముద్దాడగా ..

ఆ చిన్ని కళ్ళల్లో కన్నీరు కూడా .. చూడంగ ముచ్చ్చట కాదా ..

నా చిన్ని తండ్రి అని గుండెలకి హత్తుకుంటే ఆ అనుభూతి చెప్పతరమా ..

నా చిన్ని ప్రపంచం లోకి వచ్సిన ముద్దుల కూనా .. నీ అల్లరి ఎంతిష్ట మో

మాటల్లో చెప్పేందుకు భాష చాలక నా కంటి కాటుక తీసి నీకు చుక్క పెట్టా ...

నింగి లోని చందమామే నా ఒడిలో ఉంటె బువ్వ తినిపిస్తూ చంద్రున్నెలా పిలవను?

ఆటబొమ్మే ఈ అమ్మ అయితే ఇంతకన్నా గొప్ప బొమ్మని ఏడ తేగలను ?
మీ అభిప్రాయం మాకు అతి విలువైనది