Powered By Blogger

Tuesday, 26 November 2013

రుధిర సౌధం11

                                                               రుధిర సౌధం 
                                  (26వ తేది తరువాయి భాగం )   

యశ్వంత్ .. నువ్వు కావాలని చెప్పిన వస్తువులన్నీ సిద్ధం గా ఉన్నాయి .. మాతో పాటు .. . చెప్పాడు శివ . 
గుడ్ శివా .. రేపే మనం ఆ రావణ పురానికి బయల్దేరుతున్నాం .. ఆ ఊరిలో ఉండటానికి వసతి ఏమి లేక పోవొచ్చు .. కాబట్టి టెంట్స్ వేసుకోవాలి .. అవీ సిద్ధం గా ఉన్నాయా .. ?అడిగాడు యశ్వంత్ . 
అవన్నీ మనకి అలవాటేగా .. .. అన్ని సిద్ధం . అన్నాడు శివ . 
శివా .. మనం వెళ్ళే చోటు ప్రమాదకరమైనది .. మీరు అన్నింటికీ సిద్ధం గానే ఉన్నారా ? సాలోచన గా అన్నాడు యశ్వంత్ .. 
యశ్వంత్ .. మనం కలిసి ఎన్నో కేసు లు చూసాము ..కా ని ... ఈరోజెందుకో నీ స్వరం కొత్తగా విన బడుతుంది .. 
భయం మన దరిదాపుల్లోకి ఏనాడు రాలేదు .. మరి ఇప్పుడు ఎందుకీ ఆలోచన ? వింతగా ఆ ప్రస్నేమిటి ? చిరునవ్వు తో అడిగాడు శివ . 
శివా .. నిజమే .. మనం ఎన్నో కేసు లు చూసాము . కానీ ఇది వాటి అన్నింటి కన్నా కాస్త విభిన్న మైనది .. ఈ కేసు గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను .. గత 50 ఏళ్ళు గా ఆ మహల్ లో హత్యలు జరుగుతున్నాయి .. అదీ ప్రతి హత్యా .. అమావాస్య రోజు నే జరుగుతున్నాయి .. రీసెంట్ గా జరిగిన హత్యలు అన్ని పోలీస్ ఆఫీసర్స్ వె .. అదీ ఆ హత్య ల కోసం పరిశోదించడానికి వెళ్ళిన వారివే .. అంతే కాదు .. పోలీసులు చేతులెత్తేశారు .. ఈ హత్య లన్ని దెయ్యాలు చేస్తున్నాయని ఓ కథనం .. ఊరిలో వాళ్ళు అదే చెబుతున్నారట . 
అన్నాడు యశ్వంత్ . 

అవునా .. నిజం గ ఇంటరెస్టింగ్ గా ఉంది .. అన్నాడు శివ .. 
అవును .. ఇప్పుడు రచన అక్కడే ఉంది .. నాకు కంగారు గా ఉంది .. అన్నాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. రచన  తెలివయింది .. అంత తేలిగ్గా ప్రమాదం లో పడదు .. నువ్వు టెన్స్ కాకు అన్నాడు శివ 
సరే .. బలేశ్వర్ గారికి మార్నింగ్ ఫోన్  చేసి స్టార్ట్ అవుదాం .. వెళ్లి నిద్రపో శివా .. అన్నాడు యశ్వంత్ . 
సరే .. నువ్వు త్వరగా నిద్రపో .. అని అక్కడినుంచి వెళ్ళిపోయాడు శివ . 
యశ్వంత్ నీలాకాశం  వైపు చూసాడు .. చంద్రుడు దాదాపు తరిగిపోయాడు .. ఓ గాడ్ .. మే బి  2రోజుల్లోనే అమావాస్య ఉందనుకుంటాను ..   అంటే అమావాస్య కి ముందే మేమక్కడికి చేరుకోవాలి .. లేదంటే ... లేదంటే .. జరగరానిదేదయినా రచన కి జరిగితే నన్ను నేను క్షమించుకోలేను .. తల పట్టుకున్నాడు .. యశ్వంత్ 

ఒక్కసారి తను ఢిల్లీ  వెళ్ళిన ముందు రోజు జరిగిన సంఘటన అతని మదిలో మెదిలింది .. 

ఆరోజు .. 
ఏదో తీవ్రం గా ఆలోచిస్తూ కనబడింది రచన .. 
ఎంతో  అందం గా ఉన్న తన వదనం లో ఏదో అప్రసన్నత.. ఆందోళన .. 

ఏమిటిలా .. డల్ గా ఉంది .. అనికొని ..  రచనా .. గుడ్ మార్నింగ్ .. అని దగ్గరకి వెళ్ళాడు యశ్వంత్ . 
అతని మాట వినిపించిన తరవాత .. తలెత్తి చూసింది రచన .. నువ్వా అంది అనాసక్తం గా 
నన్ను చూడగానే మొహం అలా పెట్టకపోతే కాస్త నవ్వుతు పలకరించోచ్చు కదా .. అని టకాలున ఆమె చేతిలో ఉన్న ఫైల్ తీసుకున్నాడు యశ్వంత్ . 
ఏయ్ .. ఏంటిది ? బలవంతం గా తీసుకు0టున్నావు? ఐనా  నా దగ్గర ఎందుకింత చనువు ప్రదర్సిస్తావు ?నాకిలాంటివి నచ్చవు యశ్వంత్.. సీరియస్ గా అతని మొహానికి చేతిని చూపిస్తూ అంది రచన . 
అమ్మా తల్లీ .. నీ మాటలు వింటే నేనేదో నిన్ను ఏడిపిస్తున్నా ననుకుంటారు .. ఐన నేను నీ చిన్ననాటి స్నేహితుడ్ని .. కాని నువ్వేమో నన్ను శత్రువు లా చూస్తున్నావు ... ఎందుకని ?అన్నాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. స్నేహితుడిలా ఉన్నావా నువ్వు ? ఐ లవ్ యూ అంటూ కొత్త అల్లరి మొదలుపెట్టావు .. అందుకే నీకు దూరం గా ఉంటున్నది ..  నన్నిలా ఉండనీ.. ముందా ఫైల్ ఇవ్వు .. అని అతడి చేతిలో ఉన్న ఫైల్ తీసుకోడానికి ప్రయత్నించింది .. రచన 

ఆమె కి అందకుండా ఆ ఫైల్ పెట్టి .. ఆ ఫైల్ వంక  చూసాడు యశ్వంత్ .. 
ఈ ఫైల్ నీ చేతిలో ఉందేంటి ? అడిగాడు ఆశ్చర్యం గా యశ్వంత్ .. 
ఏం .. ఉంటె తప్పేంటి ? ఈ కేసు నేన్ను అటెండ్ అవుదామనుకుంటున్నాను .. బలేశ్వర్ తో మాట్లాడాలి ఇంకా .. అంది రచన . 
రచనా .. నీకేమయినా పిచ్చా ? ఈ కేసు కోసం మర్చిపో .. ఇంకా చాల కేసు లు ఉన్నాయి నువ్వు అటెండ్ కావడానికి .. అయినా ఈ కేసు విషయం లో అందరు భయపడుతున్నారు .. నువ్వు ఎందుకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు ?ఆమె మొహానికి దగ్గరగా తన మొహాన్ని పెట్టి అడిగాడు యశ్వంత్ . 
యశ్వంత్ .. నువ్వు ఇక్కడ నా కొలీగ్ వి మాత్రమే .. ఎక్కువ  రియాక్ట్ అవ్వకు .. అంతే  కాదు నేనే కేసు తీసుకోవాలో నువ్వు చెప్పక్కరలేదు ..? ఆవేశం గా అంది రచన . 
ఎందుకంత కోపం రచనా  ?? నీ మంచి కోసమే చెబుతున్నాను .. ఆ కేసు వద్దు .. ఇంకేదన్నా చూడు .. నేను ఓ కేసు పని మీద ఢిల్లీ వెళ్తున్నాను .. వచ్చాక వివరం గా చెప్తాను నీకు ఎందుకు వద్దంటు న్నానో .. ప్లీజ్ .. రెండు చేతులు జోడించి అన్నాడు యశ్వంత్ . 
ఆమె ఏం మాట్లాడలేదు .. 
గుడ్.. స్వీట్ గర్ల్ .. అని చిరునవ్వు తో వెళ్ళిపోయాడు యశ్వంత్ .. 

"ఆరోజు రచన నా మాట వింటుంది అనుకున్నాను .. కాని నేను వచ్చేలోపే వెళ్ళిపోయింది .. రచనా .. నువ్వు నా ప్రేయసి కాకముందు .. నాకు చిన్ననాటి స్నేహితురాలివి .. ఎందుకని నా మాట గౌరవించలేదు  ... అయినా నేను నీకేం కానివ్వను .. రచనా .. వస్తున్నాను .. నీకు రక్షణ ఇవ్వటానికే కాదు .. ఆ మహల్ అంతు తేల్చడానికి కూడా . "
అనుకున్నాడు మనసులో యశ్వంత్ 

(ఇంకా ఉంది )
No comments: