Powered By Blogger

Friday, 29 November 2013

రుధిర సౌధం 13

                                                              రుధిర సౌధం          
                                                                                    (28వ తేది తరువాయి భాగం )మెల్లిగా వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాయి .. సూర్యుడు తూర్పున పయనం మొదలుపెట్టాడు .. 
రోడ్ కి ఆవల వైపున టెంట్స్ వేసుకుని నిద్రపోయిన యశ్వంత్ బృందం మెల్లిగా  మళ్ళి ప్రయాణానికి సిద్ధమవుతుంది . 
శివా ... గట్టిగా పిలిచాడు యశ్వంత్ .. 
కొంచెం   దూరం లో మూడు రాళ్ళని పొయ్యి లా చేసి టీ కాస్తున్న శివ వెనుదిరిగి చూసాడు .. పక్కనే ఉన్న సత్య అనే అమ్మాయి ని చూసి .. యశ్వంత్ పిలుస్తున్నాడు సత్యా .. దీన్ని కొంచెం చూసుకో .. అని చెప్పి యశ్వంత్ కేసి నడిచాడు . 
శివా .. టైం తక్కువ గా ఉంది . అంతా సిద్ధం గా ఉన్నారా ? బయల్దేరుదాం ..  అన్నాడు యశ్వంత్ .. 
ఉమ్మ్ .. అంతా సిద్ధం కాని .. ఇక్కడ నుంచి ఇంకా ఎంత సమయం పడుతుంది రావణ పురం చేరడానికి ..   అడిగాడు శివ . 
ఇప్పుడు టైం 7 అవుతోంది .. ఇంకా 10 గంటలు ప్రయాణం చేయాలి .. నా అంచనా ప్రకారం .. కానీ ఇంకా త్వరగా వెళ్ళటానికి ప్రయత్నిద్దాం .. మనం చేసే ఆలస్యం .. అక్కడ ఒక ప్రాణానికి ప్రమాదం కాకూడదు .. ఆ మొండి పిల్ల ఎలా ఉందో .. అన్నాడు యశ్వంత్ .. 
ఈలోపు సత్య టీ తీసుకొచ్చింది .. చెరో కప్పూ అందుకొన్నారు .. 
సత్యా .. మురారి ఎక్కడ ?అడిగాడు యశ్వంత్ .. 
బలేశ్వర్ తో ఫోన్ లో మాట్లాడుతున్నాడు .. నిన్న రాత్రి లోపు రచన  బలేశ్వర్ ని కాంటాక్ట్ చేసిందేమో .. అని  తెలుసు కుంటున్నాడు . కానీ రచన కాంటాక్ట్ చేసినట్లు లేదు .. అదిగో వస్తున్నాడు మురారి .. అంది సత్య .. 
ఈలోపు వీరి దగ్గరకి వచ్చాడు మురారి .. 
యశ్వంత్ రచన బలేశ్వర్ కి ఆ వూరు వెళ్ళినప్పటి నుంచీ కాంటాక్ట్ చేయలేదు .. అంటే ఆమె ఏదైనా ప్రమాదం లో లేదు కదా .. అన్నాడు కాస్త ఆందోళన గా మురారి . 
చెప్పలేం మురారి.. కానీ  నీ అనుమానమూ నిజం కావొచ్చు ..  కాకపోనూ వచ్చు .. ఎందుకంటే రావనపురం లో ఫోన్ సిగ్నల్స్ ఉండవు  .. నెట్ కూడా వర్క్ చేయదు .. ఒకవేళ కాంటాక్ట్ చేయాలనుకున్నా .. ఆ వూరి నుంచి సుమారు 70km బయటికి వస్తే ల్యాండ్ లైన్ ఫోన్  ఫెసిలిటి వాడుకోవోచ్చు .. సెల్ ఫోన్ వాడాలంటే ఇంకా దూరం రావాలి .. అన్నాడు యశ్వంత్ . 
అలాంటి పరిస్థితి లో ఐతే రచన సమయాన్ని వృధా చేయదు .. ఏదో ఒకటి తేలాల్సిందే .. అనుకోని ఆ ఊర్లోనే ఉండిపోయుంటుంది .. అన్నాడు శివ . 
కానీ మన కంపెనీ రూల్స్ ప్రకారం .. ఆ వూరు చేరుకోగానే కంపెనీ కి ఇంటిమేట్ చేయాలి .. అంది సత్య . 
అవకాశం లేనప్పుడు రూల్స్ ఎలా పాటిస్తాం .ఽ అది కుదరని పని .. అని యశ్వంత్ ఇక బయల్దెరదామ్ .. అన్నాడు మురారి .. 
అందరు టీ తాగటం ముగించి .. వెహికల్ ఎక్కారు .. 
వారు ఎక్కిన ఇన్నోవా రావనపురం వైపు దూసుకుపోతుంది .. 


వెహికల్ రావణ పురం వైపు దూసుకుపోతున్న యశ్వంత్ మనసులో మాత్రం ఆందోళన  తగ్గటం లేదు .. అతని మనసు ఆలోచనలతో సతమతమవుతూనే ఉంది 
                                                                *****************
ధాత్రీ .. టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి బయల్దేరావు ? గుమ్మం నుండి అడుగు బయటికి తీయబోతున్న రచన రత్నరాజు మాట విని ఆగి వెనక్కి తిరిగి చూసింది .. 
ఆమె వైపే వస్తూ కనిపించాడు రత్నం / 
ఎం చెప్పాలి వీడికి ? అని ఓ క్షణం ఆలోచించి .. రాజు గారూ .. మీరు నాకు ఊరంతా చూపించారు కదా .. నేనెంత బాగా గుర్తుంచుకున్నానో ఈ ఊరిలో వీధులను .. నాకు నేనే పరీక్ష పెట్టుకుంటాను .. నన్నోసారి వెళ్ళనివ్వండి . అంది రచన పెదవులపై నవ్వు పులుముకుంటూ .. 
అంత అవసరం ఏమొచ్చింది ధాత్రీ .. ఉండు నీతో పాటూ నేను వస్తాను .. అన్నాడు రత్నం . 
వద్దు ..కంగారు గా అని .. వద్దు రాజు గారూ .. నేనీరోజు ఇక్కడి ప్రజల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను .. మీరు నా వెంట  ఉంటె వారు నాతొ ఫ్రీ గా మాట్లాడలేరు .. నేనే వెళ్తాను .. అని సందేహం గా చూసింది అతని వంక . 
సరే .. కానీ త్వరగా వచ్య్చేస్తావుగా ..  మురిపెం గా అన్నాడు రత్నం . 
చిరునవ్వుతో తల ఊపింది రచన . 
సరే వెళ్ళు .. అన్నాడు రత్నం .. 


రచన  బంగ్లా దాటి నడవసాగింది .. ఎందుకో ఆమె  ని ఎవరో అనుసరిస్తున్నట్టు అనిపించి ఓరకంట వెనక్కి చూసింది .. బాలయ్య .. ఆమెకి తెలియకుండా అనుసరిస్తున్నాడు . 
ఓహ్ .. వీడా .. ఇప్పుడు వీడినెలా తప్పించుకోవాలి .. అని ఆలోచించి ఒక ఇంటి తలుపు కొట్టింది .. 
ఆ ఇంటామె ఆ తలుపు తెరచి రచన వంక వింత గా చూసింది .. 
నేను పట్నం నుండి వచ్చానమ్మా .. మీ సమస్యలు అవీ తెలుసుకోవటానికి .. అంది మెల్లిగా .. ఓ పక్క బాలయ్య ని గమనిస్తూనే .. 
రండమ్మా .. మీరే కదూ .. బంగ్లా కి వచ్చింది . .. అన్నదామె . 
ఆ .. అంటూ ఆ ఇంట్లోకి నడిచింది రచన . 
ఆమె కూర్చోవడానికి కుర్చీ చూపించి చల్లని మజ్జిగ తెచ్చి ఇచ్చింది . 
కొంచెం తాగి గ్లాస్స్ ఆమె చేతిలో పెట్టింది రచన . 
ఆమె పొయ్యి వెలిగిస్తూ అంది  చెప్పండమ్మా .. ఎం తెలియాలి మీకు ? అని అందామె . 
మీ పేరు ? అని అడిగింది రచన . 
నా పేరు సరస్వతి .. క్షమించండి వంట చేస్తూనే మీక్కావాల్సిన వివరాలు చెపుతాను .. అంది సరస్వతి . 
అలాగే .. ఎందుకని ఈ ఊర్లో అందరు పేదవాళ్ళు గానే ఉండిపోయారు ? ఎవ్వరు ఈ ఊరికి రాలేదా ? మీ కస్టాలు అడిగి తెలుసుకోలేదా ? అడిగింది రచన . 
ఆమె చిన్నగా నవ్వి .. లేదమ్మా .. ఈ వూరు రావాలంటే అందరికి భయం .. దెయ్యాలు చంపేస్తాయని .. వోట్లకి కూడా రారు .. అసలు చాల మటుకు ఈ మూలా ఓ వురున్నదనే తెలవదు చాలామందికి అన్నదామె . 
సరస్వతి... మరి మీకు భయం లేదా ? దెయ్యాలంటే .. అంది సందేహం గా రచన . 
లేదమ్మా .. భయం ఉంటది .. కానీ ఆ మహల్ కాడికి ఎలితే .. ఎల్లకపోతే మాపాలికి మేముంటాం . ఆయమ్మ కూడా అమవాస కి మహల్ కాడికి వేల్లినోడి ప్రాణాలే తీస్తంది . . అంది సరస్వతి . 
ఆయమ్మా ... అంటే ఎవరు ఆమె ? అడిగింది రచన ఉత్సుకత గా . 
వైజయంతి .. అన్నది సరస్వతి 
                                                                                                                         (ఇంకా ఉంది )
No comments: