Powered By Blogger

Friday, 29 November 2013

రుధిర సౌధం 14 (29వ తేది తరువాయి భాగం )


                                                             రుధిర సౌధం 
                                                                                          (29వ తేది తరువాయి భాగం )"వైజయంతి "' ఆ పేరు  ఉచ్చారించాయి రచన పెదవులు అప్రయత్నం గా .
ఆ .. ఆమె పేరు వైజయంతే ..  మా తాత చెప్పేవాడు ఆ కథ .. ఆ మహల్ కి ముగ్గురు యువరాణులు ఉండేవారని . వారి మథ్య తగువులేవో ఉండేవని .. రాజు ఆ ఇద్దరు యువ రాణు లని నరికి చంపెసాడని .. కానీ ఆ యువరాణులు మనసు చావక ఆ మహల్ లోనే దెయ్యాలు గా తిరుగుతున్నారని .. ఏవేవో కథలున్నాయి .. అంది సరస్వతి కళ్ళింత చేసి చెబుతూ ..
చిన్నగా నవ్వి . .. అలాగా ? కథ బావుంది . కాని వారి వల్ల  ఈ గ్రామం అభివృద్ధి చెందకుండా ఉండటం మాత్రం తప్పు , అందుకే ఈ గ్రామం లో ఉన్న సమస్యలు అన్ని తెలుసుకుని పరిష్కరిద్దామని వచ్చాను . మీరేం చెప్పాలనుకున్నా నాతో చెప్పవచ్చు .. అంది రచన .
ఆమె అటు ఇటు తొంగి చూసి .. ఎవరు వినడం లేదని నిర్థారించుకున్నదానిలా .. ఆ దెయ్యం మాటేమో గాని .. ఈ ఊరిలో రాక్షసుడు మాత్రం ఉన్నాడమ్మ .. అంది సరస్వతి .
  వింత గా చూసి రాక్షసుడా ? అంది ఆశ్చర్యం గా రచన .
ఆ .. రాక్షసుడే .. మా బాధలు ఎన్నటికీ తీరవమ్మ .. ఈవూరికి ఏమి రానీయడు .. బాగుపడ నీయడు . జనం తెలివి మీరితే ఆయన గారి పెత్తనం చెల్లదు కదా .. అంది సరస్వతి .
ఎవరా రాక్షసుడు ? భూపతా ? అంది రచన .
అరె మీకెలా తెలిసిన్దమ్మ ? ఈ వురి గురించి ఎవరు వచ్చిన భూపతి వాళ్ళింట్లోనే ఉంచుకుంటాడు .. ఏదో రకం గా లొంగ దీసు కుంటాడు .. ఈ వూరి గురించి నిజాలు బయటికి పోక్క నివ్వడు .. కాసింత కసి గా అంది సరస్వతి .

మరి ఈ వూరి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు ?ఎదురిస్తే భూపతి ఎం చేస్తాడు ?ఆవేశం గా అంది రచన .

భయపడక తప్పదమ్మ .. కొంత మందికి అప్పులున్నాయి .. మరి కొంత మంది భూపతి ని ఎదురించి ఆ మహల్ కాడ శవాలు అయినారు .. వారిలో మా అన్న ఒకడు . .  కళ్ళలో సుళ్ళు తిరుగుతున్న కన్నీటిని అనచుకుంటూ అంది సరస్వతి .
నువ్వీ గ్రామం లో ఉండి పోవటం వల్ల ఎవరికీ నీ గొప్పతనం అర్థం కావటం లేదు గానీ సరస్వతీ .. నీలో మంచి ఫైర్ ఉంది .. అంది  నవ్వుతూ  రచన .
అంటే .. అర్థం కానట్లు అడిగింది సరస్వతి .

అంటే ప్రజల కోసం ఆలోచించే గుణం .. మంచితనం . అంది రచన

సరస్వతి సిగ్గుపడింది ..
నువ్వు నాకు స్నేహితురాలివి అవుతావ? అంది రచన .

నేనా?మీరు చదువుకున్నొల్లు .. అంది సరస్వతి ..

స్నేహానికి అవన్నీ అవసరం లేదు సరస్వతీ .. నాకొక సాయం చేస్తావ?అని అడిగింది రచన

ఇంత పెద్ద మనసు చూపించారు .. నన్ను మీ స్నేహితురాలినన్నారు . . . మీరేం అడిగినా చేస్తాను అంది సరస్వతి .
అలా ఐతే .. ఈ ఊరిలో అందరు నీలాగే నిజాలు చెప్తారా ? అందరూ భూపతి కి వ్యతిరేకం గా చెపితేనే ఆ మాట కి బలం ఉంటుంది .. అంది రచన .

చెబుతారమ్మ .. కొందరు .. మనసు పంచుకుంటే ఈ ఊరిలో ప్రతి ఇంటిలోనూ బాధ ఉన్న దమ్మా .. అంది సరస్వతి
కానీ బాలయ్య .. బాలయ్య అంటే నీకు తెలుసు కదా .. అంది సందేహం గా రచన .

తెలుసమ్మా .. ఆడో పెద్ద వెధవ .. అంది సరస్వతి .

తను నన్ను ఫాలో అవుతున్నాడు సరస్వతీ .. అంది గుమ్మం వంక తొంగి చూస్తూ .. రచన
అంటే మీ ఎనకాలె వస్తుండు కదా .. ఆ భూపతే పంపి ఉంటడు .. నీకు మేమేం చెబుతమో అని ఆది భయ్యం .. అంది సరస్వతి .. అలా అంటూ కిటికీ కొంచెం  తెరచి బయటికి చూసింది .
ఆడు ఈడనే నక్కి ఉన్నాడమ్మ .. ఓ పని చెయ్యి .. ఈ వెనకాల గుమ్మం నుండి పో .. సరాసరి బాపన వీధి కి పోతవు .. అంది సరస్వతి .
చాలా థాంక్స్ సరస్వతి .. నేను నీ ఇంటికి మల్లి వస్తాను .. అని రచన వెళ్ళ బోతుండగా ..
ఇంతకీ నీ పేరు చెప్పలేదమ్మ .. అంది సరస్వతి ..
రచన చిన్నగా నవ్వి ... ధాత్రి .. అని చెప్పి బయటికి నడిచింది .
"ధాత్రి .. ఎంత మంచి పేరో .. కనీసం ఈయమ్మ మూలా నయినా ఈ వూరు బాగు పడితే బాగుండు .. ఎందుకో ఆమెని చూసేసరికి ఎవరో పరాయిది అనిపించలే .. " అనుకొంది సరస్వతి తనలో తానె .
                                         
                                         ********************************
బాలయ్య నుండి మెల్లిగా తప్పించుకొని మెల్లిగా మహల్ వైపు నడిచింది రచన ..
మహల్ దగ్గర పడుతుంటే బాగా పరికించి చూసింది .. నిట్ట నిటారుగా కొండంత రహస్యాన్ని గుండెల్లో మోస్తున్న పెద్ద మనిషి లా కనిపించింది ..
మెల్లిగా గేటు ని ముందుకి తోసింది .. కిర్రుమంటూ తెరుచుకుంది ..
లోపలి కి ప్రవేశించి చుట్టూ చూసింది .. మెల్లిగా సూర్యుడు మహల్ కి వెనుక భాగం నుండి మహల్ నెత్తి మీదకి వస్తున్నాడు ..
మెట్లెక్కి మహల్ ప్రాంగణం లోకి చేరుకుంది రచన ..
మహల్ వెనక నుండి ఎండా రావటం తో ఆ ప్రాంగణం అంటా నీడ గానే ఉంది .. అప్పుడప్పుడూ పైరుల మీద నించి వస్తున్నా పిల్ల గాలి రచన కురులను పలకరిస్తుంది ..
"అద్దాల మంటపం ..  ఎక్కడుంది ? నేను చదివిన ట్లు ఇక్కడ కనబడటం లేదే .. అని ఒక పక్కగా ఉన్న స్తంభాల
ప్రాంగణాన్ని చేరుకుంది .. దానికి ఎదురుగా అలాంటి మండపమే ఇంకొకటి ఉండటం గమనించి అటు నడవబోతు ఓ క్షణం అటువైపు పరికించి చూసింది రచన .. ఆ మండపం నుంచి పొగ రావటాన్ని గమనించింది ..
అక్కడ ఎవరో ఉన్నారు ... అనుకొని వడివడిగా అటు నడిచింది . .. (ఇంకా ఉంది )


No comments: