రుధిర సౌధం
14 వ తేది తరువాయి భాగం
మే ఐ కం ఇన్ సర్? అంది రచన ...ఏదో పనిలో మునిగిఉన్న మహా బలేశ్వర్ తలెత్తి చూసి .. కం మై చైల్డ్ ... నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను .
అన్నాడు .
తలుపు వేసి వచ్చి బలేశ్వర్ ఎదురు గ ఉన్న చైర్ లో కూర్చుంది రచన .
ప్రయాణానికి సిద్ధం ఐనట్టేనా ? కళ్ళద్దాలు సవరించుకుంటూ అడిగాడతను .
ఉ ... అని అమ్మ ని ఎంతో కస్టపడి ఒప్పించాను...స్వామీజీ వెళ్ళమని చెప్పారన గానే అమ్మ అయిష్టం గానైన ఒప్పుకుంది అంది రచన .
నన్నైతే తిట్టుకోలేదు కదా ... అన్నాడు బలేశ్వర్ .
లేదు సర్ ... నా డ్యూటీ అని చెప్పాను ... నవ్వుతు అంది రచన .
రచన స్వామీజీ తో ఈ విషయం డిస్కస్ చేశావా? అడిగాడతను కంగారు గా.
కంగారు పడకండి... నేనుగా ఆయన తో ఎం చెప్పలేదు ... అలా అని ఆయన కి ఏమి తెలియదని చెప్పను ... ఆయన సర్వాంతర్యామి ... అన్ని తెలుస్తాయి ... అంది రచన ..
ఇంత చదువుకున్నావు... ఇలాంటి స్వామీజీలని ఎలా నమ్ముతావు రచనా ? అడిగాతను ఆశ్చర్యం గా .
ఈమధ్య స్వామీజీలను న్యూస్ లో చూసి చూసి ఇలాంటి అనుమానం కలగటం లో ఆశ్చర్యం ఏముంది స ర్. కానీ రమణ మహర్షి అటువంటి వారు కాదు ఆయన జీవన శైలి నిజం గా నిరాడంబరమైనది .. అంతేకాదు నాచిన్నప్పటి నుండి ఆయన్ని చూస్తున్నాను .. వెదురు పాకల్లో జీవనం .. ఎదురుగా ఉన్న చిన్న స్థలం లో ఆశ్రమానికి అవసరమయే కురాగాయాలని పండిస్తారు .. మాంసాహారం ముట్టరు . ఎప్పుడు దేవి ఉపాసన లోనే ఉంటారు .. మా కుటుంబం విషయం లో ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజాలే అయ్యయి.. నాన్న గారు ఆయన్ని ఎంతగానో నమ్మేవారు .. ఆ నమ్మకం నాకూ ఉంది అంది రచన .
హు .. ఇంటరెస్టింగ్ .. నువ్వీ టాస్క్ పూర్తీ చేసుకుని వస్తే నేను తప్పనిసరిగా మీ స్వామీజీ ని కలుస్తాను ..
అన్నాడు బలేశ్వర్ .
ఐతే మీరు సిద్ధం గ ఉండండి .. విజయం నాదే అంది రచన స్థిరం గా
ఆ నమ్మకం తోనే నీకి పని అప్పజెప్పాను ... వివరాలన్నీ ఈఫైల్ లో ఉన్నాయి .. గుర్తుంచుకో రచనా .. నువ్వు వెళ్ళే ప్రాంతం లో ఫోన్ సిగ్నల్స్ కూ డా ఉండవు. పూర్తిగా పల్లె ప్రాంతం ... నువ్వు నన్ను కాంటాక్ట్ చేయాలన్న 40km ప్రయాణించి రావలసి ఉంటుంది .. అక్కడ మాత్రమే సిగ్నల్స్ ఉంటాయి .. అంతే కాదు ప్రతిక్షణం ప్రమాదం వెంటే ఉన్దొచ్చు. నీకిచ్చిన కిట్ లో లైసెన్స్ ఉన్న గన్ ఉంది .. పెన్ కెమెరా,కీ చిన్ కెమెరా కిట్ లో ఉంటాయి.. నువ్వు అక్కడికి చేరుకొని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నీకు సహాయం గా ఇంకో వ్యక్తి ని పంపిస్తాను .. ఓకే?అన్నాడు బలేశ్వర్
సరే సర్ ... నేను ఇక స్టార్ట్ అవుతాను . అని లేచింది రచన .
సీ రచనా ... దేశం లోనే పేరున్న ditective ఏజెన్సీ మనది .. మనం ఎం చేసినా అది సెన్సేషన్ సృష్టించాలి ..
ఇది నీ మీద ఎంతో నమ్మకం తో ఈ డీల్ తీసుకున్నాను .. నిజాల్ని బయటపెట్టాలి నువ్వు .. అన్నాడు బలేశ్వర్ .
మీ నమ్మకాన్ని నిలబెడతాను .. ఈ సమరం లో మనదే విజయం సర్ .. అంది రచన.
గుడ్ . .. ఆల్ ది బెస్ట్ రచనా అన్నాడు బలేశ్వర్ .
thank you sir ... అని బయటికి కదిలింది రచన
************************************
(ఇంకా ఉంది )
No comments:
Post a comment