Powered By Blogger

Wednesday, 20 November 2013

రుధిర సౌధం 5రుధిర సౌధం  
(19 తేది  భాగం  )


50 ఏళ్ళ వ్యక్తి ఠీ వి గా లోపలికి నడచి వచ్చి కూర్చున్నాడు అక్కడ ఉన్న సోఫా లో ..
వెంగమ్మ మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది . తాగి నీళ్ళ గ్లాస్ టీ పయ్ మీద పెట్టాడు .
ఇంతలో అయ్య   గారు.. మీతో ఒక మాట చెప్పాలండి .. అంటూ ముందుకు వచ్చాడు గుమస్తా శంకరం .
ఏమిటన్నట్లు కళ్ళు ఎగరేసి నొసలు చిట్లించి  చూసాదతను ..
అదీ .. అబ్బాయి గారు .. ఇంతకూ ముందే ఎవరో పట్నం అమ్మాయి ని వెంటేసుకు వచ్చారండి .. మెల్లి గ నసిగాడు .
అమ్మాయా ? ఏకం గా ఇంటికే తెచ్చాడా ? గంభీరం గా  పలికింది అతని స్వరం ..
ఎవరో ... ఈ ప్రాంతం అమ్మాయి లా లేదు .. బాగా చదువుకున్న అమ్మాయి లా తోచింది .. అబ్బాయి గారు వివరాలెం చెప్పలేదు . అన్నాడు శంకరం .
రత్నం ... గట్టిగా అరిచాడు.. అతడు
పరుగున వచ్చాడు రత్నరాజు .. నాన్న గారూ .. అంటూ .
ఎవరా అమ్మాయి ? గద్దించాడు అతడు
ఎవరు ? ఓ .. ఆ  అమ్మాయా ? ధాత్రి .. పేపర్ ఆఫీసు లో పనిచేస్తుంది అంట .. రామంత పురం లో కనిపించింది . మన వూరి గురించి రాయటానికి వచ్చిందట .. ఈ వూరు ఎవరొచ్చినా ఆతిధ్యం మనింట్లోనే కదా అని ఇంటి కి తీసుకొచ్చాను నాన్నగారూ .. వినయం గా జవాబు చెప్పాడు రత్నం
పేపర్ అమ్మాయా ? మన వూరి గురించి రాస్తుందా ? ఆశ్చర్యం గా అడిగాడు అతడు ..
అవును నాన్నగారు .. నాతో  చెప్పింది .. అన్నాడు రత్నం ..
వెంగమ్మ .. ఆ అమ్మాయి తో నేను మాట్లాడాలి .. గర్జించింది అతని స్వరం ..
ఏ మూల ఉందో వెంగమ్మ పరుగున రచన గది తలుపు కొట్టింది ..
స్నానం ముగించుకొని ఫ్రెష్ అయిన రచన .. మెల్లిగా తలుపు తీసింది ..
ఎదురుగా ఉన్న వెంగమ్మ ని చూసి .. ఏమిటన్నట్లు చూసింది రచన ..
ఏమి మాట్లాడకుండా .. పక్కకి తప్పుకుని హాల్ వైపు కళ్ళు తిప్పింది వెంగమ్మ ..
ఆమె ఉద్దేశ్యం అర్థమైనట్లు .. హాల్ వైపు చూసింది రచన .. హాల్ లో ఉన్న సోఫా లో కుర్చుని ఉన్న ఓ ముసలాయన .. ఎదురుగా గుమస్తా శంకరం ,రత్నం .
రత్నం హాల్ లోకి రామ్మన్నట్లు గ కనుసైగ చేసాడు ..
బహుసా ఇతడు .. జమిందారు కావొచ్చు .. అనుకుని ముందుకి నడిచి హాల్ లోకి నడిచింది ..
నాన్న గారూ .. ..  ఆ  అమ్మాయి  ధాత్రి .. అన్నాడు రత్నం ..
రచన వైపు చూపు మరల్చాడత ను ..
రచన చిరునవ్వుతో నమస్కరించింది ..  నఖసిఖపర్యంతం అతడు రచన వంక చూసాడు ..
ధాత్రీ .. మా నాన్న గారు ..భూపతిగారు .. చెప్పాడు  రత్నం ..
మీది ఏ ఊరు తల్లీ .. అడిగాడు గంభీరం గ భూపతి ..
ముంబై .. చెప్పింది రచన ..
ఏ పేపర్ లో పనిచేస్తున్నావు ? అనుమానం  గా అడిగాడు ..
తడుముకోకుండా" హిందూ"" అని చెప్పింది రచన .
మా వూరి కోసం పేపర్ లో రాయటానికి ఏముంది ?అని అడిగాడు   నిలదీస్తున్నట్లు గా భూపతి .
ఈ  ఊ రికి పెద్దవారు .. ఏమి లేదని  ఎలా  అంటున్నారు ? ఈ యోడా ఊరిలో ఎటువంటి సదుపాయాలూ లేవు .. రోడ్స్ లేవు .. నీళ్ళు లేవు .. రవాణా సౌకర్యాలు లేవు .. ప్రభుత్వానికి తెలియొద్దా ? అంది రచన .
ఆ విషయాలు అన్ని ప్రభుత్వానికి తెలియనివి కావు .. ఎవరు రాసిన ఈ గ్రామానికి ఏ సదుపాయాలూ రావు .. ఈ గ్రామానికి ఒక పోలీస్ ఆఫీసర్ ,ఒక జర్నలిస్ట్ ..ఇలా ఎవరు వచ్చినా ఒకందుకే వస్తారు .. అది ఆ రాణి మహల్ గురించి .. తెలివి గా సమాధానం చెప్పానని అనుకుంటున్నా వేమొ .. నీ వయసు నా అనుభవమంతా ఉండదు .. అన్నాడు భూపతి .
అతని వైపు చురుగ్గా చూసింది రచన ..
కారణ మేదైనా .. మా  వూరు వచ్చావు .. ఉన్నంత కాలం మా ఇంట్లోనే ఉండొచ్చు .. అని వెంగా .. అని వెంగమ్మ వైపు చూసి ఈ అమ్మాయి కి మే డ  మీది గది ఇవ్వు .. అన్నాడు
ఫర్వాలేదు .. కింది గది బాగానే ఉంది అంది రచన ..
ఆ గది తలుపు కి ఘడియ లేదు .. అన్నాడు కొడుకు వంక కాసింత కన్నెర్ర చేసి చూస్తూ ..
చిన్న గా నవ్వి థాంక్స్ .. అంది రచన
చూడు అమ్మాయి .. ఈ వూరు వచ్చావు బాగానే ఉంది ..  తిరిగి క్షేమం గా వెళ్లాలని దేవుని ప్రార్థించు .. అన్నాడు భూపతి
నేను తిరిగి క్షేమం గానే వెళ్తాను భూపతి గారు    ... అందులో నాకే అనుమానము లేదు స్థిరం గ అని అక్కడ నుంచి కదిలింది రచన
                                                   ****************************
అయ్యా .. పిలిచారా ? అంటూ వచ్చాడు బలిష్టం గా ఉన్న ఓ వ్య్కక్తి భూపతి వద్దకి .. 
బాలయ్య .. గమనించే ఉంటావు ..చిన బాబు ఒకామ్మాయి ని పట్టు కొచ్చాడు కదా .. నువ్వు ఆ అమ్మాయి ని ఓ కంట కనిపెట్టాలి .. గంభీరం గా అన్నాడు భూపతి . 
అలాగే అయ్యా .. అన్నాడు బాలయ్య .. 
నువ్వు ఆ అమ్మాయిని గమనిస్తున్నట్లు ఆ అమ్మాయి కి ఏ మాత్రం అనుమానం రాకూడదు బాలయ్య .. అన్నాడు భూపతి . 
అలాగే నయ్య .. అని  అక్కడి నుంచి నిష్క్రమించాడు బాలయ్య . 
బాలయ్య వెళ్ళాక ..గుమస్తని పిలిచి శంకర్ ... చినబాబు ఓ కంట కనిపెట్టుకుని ఉండు .. ఏ తప్పు జరగ కూడదు 
అన్నాడు భూపతి . 
కష్టమయ్య .. చినబాబు ని చూస్తుంటే పూర్తిగా ఆ పిల్ల మాయ లో ఉన్నట్లు అనిపిస్తున్దయ్యా .. అన్నాడు శంకర్ 
ఆ పిల్ల తెలివైంది .. చాలా తెలివైంది .. తెలియకూడా నివి తెలుస్తాయేమో .. సాలోచన గా అన్నాడు భూపతి . 
తెలుసుకోన్నవాళ్ళు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు కదయ్యా అన్నాడు శంకర్ . 
చిన్నగా తల పంకించాడు భూపతి 

                                                                     ******************
                                                                                                                                     (ఇంకా ఉంది )


No comments: