Powered By Blogger

Thursday, 21 November 2013

రుధిర సౌధం6


                                 రుధిర సౌధం
                                                            (20 వ తేది తరువాయి భాగం )


             
వెంగమ్మ మౌనం గా రచన లగేజ్ ని మేడ మీదికి తీసుకువెళ్ళింది .. రచన నుంచి వెంగమ్మ ప్రతీ పని మౌనం గానే చేస్తుండటం ఆశ్చర్య పరిచింది రచన ని ..
కింది గది వేసి బయటకు వస్తుండగా రత్నరాజు ఎదురుపడ్డాడు .
ధాత్రీ .. నాన్నగారు అలా మాట్లాడినందుకు బాధ పడ్డావ .. అన్నాడు కాస్త  దీనం గా మొహం పెట్టి ..
లేదు .. సూటిగా మాట్లాడేవారు నాకు నచ్చుతారు .. భూపతి గారు నాకు బాగా నచ్చారు .. అంది రచన  చిరునవ్వుతో ..
నిజం గానా .. ? మరి నేనూ ? అన్నాడు రత్నరాజు చిన్న పిల్లాడి లా ..
హ్మ్ .. నువ్వు కూడా .. అంది  రచన .. కాస్త ఇబ్బంది గా .
అవునా .. సరే .. ముందు నీకు పై గది చూపిస్తాను రా .. నీ సామానంతా వెంగమ్మ పెట్టేసింది .. అన్నాడు రత్నరాజు..
 మెట్లు ఎక్కుతూ .. ఈ వెంగమ్మ మూ గదా .. ? అడిగింది రచన .
లేదు .. తను మాట్లాడదు అంతే .. అన్నాడు రత్నరాజు ..
మాట్లాడదా ? అదేంటి ? ఎందుకు ? అంది రచన ..
అదంతే .. ఐన ఇన్ని ప్రశ్నలా ? నేను ఉపిరి తీసుకోవోద్దా ... అని  ఓ గది ముందు ఆగి .. ఇదే ఇక పై నీ గది .. అన్నాడు రత్నరాజు ..
గది తలుపులు తీసి లోపలి వెళ్ళారు ..
వెంగమ్మ  గదంతా చిమ్ముతుంది ..
చిమ్మటం ఐపోతే .. నువ్వింకా వెళ్ళు వెంగమ్మ .. అన్నాడు రత్నరాజు ..
ఆమె అతడిని కాల్చేసేలా చూసి చీపురు పట్టుకుని బయటికి వెళ్లి పోయింది ..
ఆమె చూపు గమనించిన రచన .. ఈ వెంగమ్మ   కూడా వింతగా ప్రవర్తిస్తుందే .. అనుకుని .. క్రీగంట రత్నరాజు ని గమనించింది .. అతడామె ని చూపులతోనే సోదా చేస్తున్నాడు ..
ఏంటో .. వీడి పిచ్చి వదిలించే రోజు దగ్గరలోనే ఉందని పిస్తుంది .. అనుకోని ... గది బావుంది .. విశాలం గా . .అంది అతని చూపుల్ని తప్పించుకోవటానికి .
నీకు నచ్చితే సరే .. . అన్నట్లు ఈ జీన్స్ లో నువ్వు చాల బావున్నావు ధాత్రి .. అన్నాడు రత్నరాజు
అవునా? ఐతే థాంక్స్ .. కాని నా అభి రుచులే నీకు నచ్చక పోవొచ్చు అంది రచన .
అదేంటి? నచ్చుతాయి ... నువ్వు చెప్పి చూడు .. అన్నాడు రత్నం .
నేను చెబితే ..నచ్చక పొఇనా నువ్ నచ్చాయని చెప్పేస్తే .. నేనే తెలుసుకోవాలి .. దేనికైనా కొంచెం సమయం కావాలి కదా .. అంది గారం గా .
ఆమె ని అర్థం చేసుకున్నట్లు గా సరే .. అన్నాడు సిగ్గు పడుతూ రత్నం .
వీడి సిగ్గు మండిపోనూ .. అనుకోని గదంతా కలయ చూసింది ..  తూర్పున ఉన్న కిటికీ వైపు ఆమె ద్రుష్టి నిలిచి పోయింది ..
అన్ని కిటికీలు తెరిచి ఉన్నాయి .. కాని ఈ కిటికీ ఎందుకలా మేకులు కొట్టి మూసేశారు .. అడిగింది ఆ కిటికీ దగ్గర కి వెళ్తూ రచన ..
ఓ .. అదా .. ధాత్రీ .. దాన్ని అలానే ఉండ నీ .. తెరవ టానికి ప్రయత్నించకు .. అన్నాడు రత్నరాజు ..
కిటికీ వైపు నిశితం గా చూ స్తున్నదల్లా ..ఒక్కసా రిగ.. రత్నం వైపు తిరిగి ..ఎన్దుకని అంది రచన ..
ధాత్రి .. ఆ కిటికీ ఓపెన్ చేస్తే ..ఎదురుగా రాణీ మహల్ కనబడుతుంది .. అది అంత మంచిది కాదు .. అన్నాడు రత్నం ..
రాణి మహల్ ... ? ప్రశ్నార్థకం గా చూసింది    రచన .
హా .. నీకు చెప్పకూ డ దనే   అనుకున్నాను .. కానీ చెప్పక తప్పేలా లేదు .. అది   రాజుల కాలం నాటి కోట .. కానీ ఇప్పుడు ఆ కోట లో ఎవరు లేరు .. ఊరిలో అంతా దానికి దెయ్యాల కోట అని పేరు పెట్టారు . అందులో దెయ్యాలున్నాయని నా చిన్నప్పటి నుంచీ వింటున్నాను .. అన్నాడు రత్నం రాజు .
ఓ .. అదా విషయం .. చాల ఆసక్తికరం గాఉం ది .. అని అందుకేనా ? ఇంతకు ముందు మీ  నాన్నగారు కూడా ఆ రాణి మహల్   గురించి మాట్లాడారు  అంది రచన .
హా .. ఆ రాణి మహల్ కోసం ఏదో పరిశోదించాలని వచ్చిన వారంతా మృత్యువాత పడ్డారు .. కొన్నినెలల ముందే ఓ పోలీసాఫీసర్ వచ్చాడు .. చనిపోయాడు .. అదీ అతి భయంకరం గా .. ముఖం లో భయాన్ని ప్రస్ఫుటం గా తెలియజేస్తూ చెప్పాడు రత్నం ..
అంటే దెయ్యం అతనిని చంపిందని నమ్ముతున్నారా ? అతని ముఖ కవలికలని గమనిస్తూ అందామె .
అవును .. నువ్వు అలా ఆ మహల్ కోసమే వచ్చవేమో నని నాన్న గారి అనుమానం .. అన్నాడు రత్నం .
నీకు  లేదా ? అంది రచన .
లేదు ..కొమ్పదీసి నాన్న గారి అనుమానం నిజమా ?  భీతి గా అన్నాడు ..
చిన్నగా నవ్వి .. నన్ను నమ్మిన నువ్వే0 అనుకుంటున్నావో అదే నిజమనుకోవటం మంచిది అంది రచన..
అలా ఐతే ఫర్వాలేదు .. నిశ్చింత గా ఊపిరి పీల్చుకున్నాడు రత్నం .
రాజూ .. నేను మిమ్మల్ని ఇలా పిలవొచ్చు గా .. అంది కాస్త సందేహం గా ..
 నువ్వెలా పిల్చినా పలికేస్తాను ధాత్రి .. అన్నాడు తన్మయం గా రత్నం
 నేనోసారి ఊ రుచూడాలీ .. అంది  రచన
చూపిస్తాను  నువ్వెప్పుడు అంటే అప్పుడే అన్నాడు రత్నం రాజు ..
ఇప్పుడు కాదు సాయంత్రం .. అలా షికారుకి వెళ్దాం .. సరేనా అంది రచన .
ఓ .. నేను రెడీ .. అన్నాడు రత్నం .
థాంక్స్ .. నేనే రెడీ  అయాక చెబుతాను .. ఇప్పుడైతే కాసేపు విశ్రాంతి తీసుకుంటాను ..ప్రయాన బడలిక ఇంకా తీరనే లేదు .. అంది రచన .
సరే సరే .. నేనిక కిందికి వెళతాను .. నువ్వు విశ్రాంతి తీసుకో .. అని రత్నం వెళ్ళగానే తలుపులు మూసి కిటికీ వంక చూసి .. దగ్గరగా నడిచింది .. కిటికీని ఎవరు తెరవ కుండా మేకులు కొట్టి ఉంచారు . ఈ కిటికీ తెరిస్తే రాణి మహల్ కనబడుతుంది .. కిటికీ తెరవాలి ..కాని ఎలా?.. ఇది సమయం కాదు .. ముందు లాప్టాప్ లో మొత్తం నోట్ చేయాలి అని బాగ్ లోంచి లాప్ టాప్ తీసి కొన్ని విషయాల్ని నోట్ చేసింది .. ఆ పని పూర్తయ్యాక మనసులో  "రాణి మహల్ ... నా టాస్క్ .. ఆ రహస్యం ముళ్ళు విప్పటానికి .. వచ్చిన వారంతా చనిపోయారు ..  నిజాలు బయట పడలేదు .. ఈ వూరు రావటమే   ప్రాణా 0 తక మని ఎవ్వరు ఈ వూరు రారు .. చాలా మంది వలస పోయారు .. ప్రభుత్వ సదుపాయాలు లేవు .. బాహ్య ప్రపంచం ఈ ఊరిని దాదాపు మరచిపోయింది .. దీనంతటికి కారణ మైతే .. ఓ ఆత్మా ? కాదు మరేదో ఉంది .. ఆ మరేదో ..ఏంటో కనిపెట్టాలి .. ముందు ఆ రాణి మహల్ ని చూడాలి .. ఆణువణువూ చూడాలి .. దీనంత టికి కారణం దెయ్యమో ..లెక ప్రజల భయమో .. హత్యలు ఎలా జరిగాయి ? ఎందుకు ? ఇందులో ఎవరి హస్తమైనా ఉందా / ఈ ప్రశ్న లన్నింటికి సమాధానాలు వెతకాలి .. అనుకుంటూ మంచం మీద వాలింది .. అలసిన మేను ని నిద్ర ఆవహించింది
                                             ****************************************
సాయంత్రమయ్యేసరికి తలుపులు బాది మరీ టీ తెచ్చి ఇచ్చింది వెంగమ్మ ..
టీ తాగుతూ అక్కడే ఉన్న స్టడీ టేబుల్ మీద కూ ర్చుని టేబుల్ పై మెనూ ని వాల్చి ఫోన్ ఓపెన్ చేసి గిరిజ ఫోటో చూస్తూ అనుకుంది రచన .. అమ్మా .. ఎంత కంగారు పడుతున్నవో నాకోసం .. ఇక్కడ సిగ్నల్స్ లేవు పోనీ నీతో
మాట్లాడదాం అన్నా .. నాకోసం భయపడకమ్మా .. స్వామీజీ నీకు ధైర్యం చెబుతారనే అనుకుంటున్నాను .. నేను ఇక్కడ నా ఆత్మ విశ్వాసానికి పరీక్ష పెట్టుకున్నానమ్మ .. గెలవాలని ఆశీర్వదించు ..

                                                                                                                     (ఇంకా ఉంది )

No comments: