Powered By Blogger

Tuesday, 26 November 2013

రుధిర సౌధం10

                               రుధిర సౌధం 
                                                                                                                (25వ తేది తరువాయి భాగం )

ఏవో ఫైల్స్ తిరగేస్తున్న బలేశ్వర్ తలుపు తట్టిన చప్పుడు విని తలుపు వైపు చూసాడు . 27 ఏళ్ళ యువకుడు అక్కడ నిలబడి ఉండటం చూసి  అతని పెదవులపై మందహాసం విరిసింది .
హే యశ్వంత్ .. .. నువ్వా ..రా .. వచ్చి కూర్చో .. అని ఆత్మీయం గా పిల్చాడు బలేశ్వర్ .
అతను మాత్రం సీరియస్ గా వచ్చి కూర్చున్నాడు .
ఏంటి ? మొహం అ లా పెట్టావు .. ఏమైంది ? అన్నాడు బలేశ్వర్ అతని వంక సీరియస్ గా చూస్తూ .
రచన ని ఎక్కడకి పంపారు మీరు ? కాస్త కోపం గా అడిగాడు యశ్వంత్ .
రాణి మహల్ కేసు ఇన్వెస్టిగేషన్ కి .. అంతే గంభీరం గా అన్నాడు బలేశ్వర్ .
ఆ కేసు ఒకరు సింగల్ గా వెళ్లి చేయాల్సిన కేసు కాదు కదా బలేశ్వర్ గారు .. మరి రచన ని వొంటరి గా ఎలా పంపారు ? ఆవేదన గా అడిగాడు యశ్వంత్ .
యశ్వంత్ .. రచన చాలా శ్రద్ధ చూపించింది ఈ కేసు పైన .. అంతే కాకుండా తను ఒక్కతే దీనిని హేండిల్ చేయగలను అంది .. నాకు తన మీద నమ్మకం ఉంది .. అయినా ఈరోజుల్లో కూడా దెయ్యాలూ ,భూతాలూ ఉన్నాయంటావా ? ఆ మహల్ లో జరిగే హత్యల గురించి  ఇంత వరకు ఏమి తెలియలేదు .. మన కలాంటి కేసు లేగా వస్తాయి .. ఎవరో ఆ మహల్ లో దెయ్యాలు ఉన్నాయని భయాన్ని క్రియేట్  చేసి హ్యాపీ గా హత్యలు చేసుకుపోతున్నాడు .. రచన తెలివైంది .. ఈ కేసు తను ఖచ్చితం గా సాల్వ్ చేయగలదు .. అందుకే తనని పంపాను .. ఆవేశం గా అన్నాడు బలేశ్వర్ ..
నిజమే కావొచ్చు . కాని శత్రువు ని సరిగ్గా అంచనా వేయటం కుడా మనకు ముఖ్యమే కదా .. ఇంతకు  ముందు ఆ కేసు సాల్వ్ చేయటానికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఒక నార్మల్ పర్సన్ కాదు .. ఎన్నో గొప్ప కేసు లని సాల్వ్ చేసారాయన .. కానీ అదే మహల్ లో అతని శవం మిగిలింది .. కొన్నేళ్ళ నుంచి హత్యలు జరుగుతునాయక్కడ .
ఆ హత్యల  రహస్యం ఇప్పటికి అంతు  పట్టలేదు .. ఆలోచించండి బలేశ్వర్ .. రచన ఒక్కతే వెళ్లి చేయాల్సిన పని కాదు  ఇది .. ఈ టాస్క్ లో రచన కేదన్న ప్రమాదం జరిగితే .. కాసింత బాధ గా అన్నాడు యశ్వంత్ .
ఒకవేళ అలా ఏమైనా జరిగితే ఆ కేసు కోసం ఇంకొకరు వెళ్తారు యశ్వంత్ .. మన పని లో ప్రమాదాల కోసం ఆలోచించం .. అన్నింటికీ సిద్ధపడే ఈ ఫీల్డ్ ని ఎంచుకున్నాం .. మరలాంటప్పుడు .. నాకర్థ మయింది యంగ్ బాయ్ .. .. నువ్వు రచన ని ప్రేమిస్తున్నావు .. అందుకే నీకింత బాధ .. అవునా ? చిన్నగా నవ్వుతు అన్నాడు బలేశ్వర్

ఈ పరిస్థితి లో ఎవ్వరున్న నేనిలానే మాట్లాడతాను .. ఈ కేసు వెళ్ళింది రచన అయినా మరెవ్వరైనా ఒక్కరే వెళ్ళటం వ ల్ల  ఫలితం ఉండదు .. స్థిరం గా అన్నాడు యశ్వంత్

ఆలోచిస్తే నువ్వన్నదీ నిజమేనని పిస్తుంది యశ్వంత్ .. సరే .. ఓ టీం ని ఫార్మ్  చెయ్ .. 4 గురిని నీతో పాటు తీసుకు వెళ్ళు ..ప్లాన్ ఏంటో నువ్వే ఆలోచించు .. రచన నాకు కాంటాక్ట్ చేస్తే మీరు వస్తున్నారని చెప్తాను . . అన్నాడు బలేశ్వర్ .

సరే సర్ .. బట్ టీం రెడీ గానే ఉంది .. నేను ,శివ ,సత్య ,మురారి .. వీలుంటే రేపే బయల్దేరుతాం .. అన్నాడు యశ్వంత్ .
గుడ్ .. నీలో నాకు నచ్చేది ఈ గుణమే యశ్వంత .. నువ్వెప్పుడు సిద్ధం గా ఉంటావు . అన్నాడు బలేశ్వర్ .
థాంక్ యు సర్ .. ఇప్పుడే మాకవసరమయ్యె సామాను అంతా సిద్ధం చేసుకుంటాము .. అండ్ మాకొక వెహికల్ కావా లి .. అన్నాడు యశ్వంత్ .
రచన వెహికల్ కావాలని కూడా అడగలేదే .. అన్నాడు బలేశ్వర్ ..
 ఒక్కోసారి  .. ప్రాణాలు రక్షించుకోవటానికి గన్ తో పాటూ వెహికల్ కూడా అవసరమవుతుంది సర్ .. అన్నాడు యశ్వంత్ .
అలాగే..  అలాగే ,, తీసుకువెళ్ళు యశ్వంత్ .. అండ్ గుడ్ లక్ టు  యూ.. అన్నాడు   బలేశ్వర్
 థాంక్ యూ ..స ర్ అని లేచాడు యశ్వంత్
                                                             ***********************************
ఊరంతా తిరిగాం .. అన్ని ఫోటో లు తీసుకున్నావు .. బాగానే ఉంది గాని .. నాకూ ఒక్క ఫోటో .. అని మెల్లిగా నసిగాడు రత్నం .
ఓ .. దానికేం .. ఆ  చెట్టు కింద నిల్చో0డి రాజు గారు.. అంది  రచన .
రత్నం వెళ్లి జడల మఱ్ఱి చెట్టు కింద నిలుచున్నాడు ..
మంచి స్టిల్ ఇవ్వండి మరి .. అంది రచన ..
హీరోలా కొంచెం కామెడి ఫోజ్ ఇచ్చాడు రత్నం ..
కెమెరా క్లిక్ మనిపించింది రచన ..
బాగా తీశారా ? అన్నాడు రత్నం ..
ఊమ్..   అని  తల ఊ పి .. రాజు గారూ .. ఇక్కడ .. కంసాలి వాళ్ళెవరు లేరా ? అని అడిగింది .. రచన
ఉన్నారు .. వాళ్లతో మీ కెం పని అన్నా డు రత్నం .
అదా .. నా చెవి జూకాలు కొంచెం .. మెరుగు పెట్టించాలి అందుకే .. అంది రచన .
ఓహ్ .. అలా ఐతే పదండి .. చూపిస్తాను .. అన్నాడు రత్నం .

అంతే కాదు .. డూప్లికేట్  తాళం .. తయారుచేసేవాళ్ళు ఉన్నారా ఇక్కడ? అడిగింది రచన .
ధాత్రీ .. ఉన్నారు కానీ వాళ్ళెందుకు ?అడిగాడు ఆశ్చర్యం గా రత్నం ..
నా సూట్ కేసు కీ పోయింది .. నా బట్టలు ,చాలా వస్తువులు అందులో ఉండిపోయాయి అందుకే .. అంది రచన .
అలా ఐతే నేను వాళ్ళకి కబురు పెడతాను ..వాళ్ళు బంగ్లా కె  వస్తారు .. రత్నం
సరే .. ఐతే .. ఇక మనం బంగ్లా కి వెళ్దాం .. అంది రచన .
సరే .. పద .. అని  ముందుకి నడిచాడు రత్నం .
"ఎలా అయినా ఆ మహల్ తాళం చెవి సంపాదించాలి .. లేదంటే నేను మహల్ లోకి ఎలా వెళ్తాను ? డూప్లికేట్ కీ చేయమంటే వాళ్ళు భూపతి కి తెలియకుండా తయారు చేస్తారా ? చూద్దాం .. ముందు పరిస్థితులని ఆకళింపు చేసుకోవాలి .. "' అని ఆలోచిస్తూ నడుస్తున్న ఆమె కి మెరుపులా ఓ ఆలోచన తట్టింది .. ఆమె పెదవులపై చిరునవ్వు మెదిలింది .
                                                     *********************

కాలింగ్ బెల్ మోగటం తో ... వెళ్లి తలుపు తీసిన గిరిజ ..  వచ్చిన వ్యక్తీ ని చూసి కళ్ళు పెద్దవి చేసి నువ్వా యశ్వంత్ ?ఎప్పుడు వచ్చావు ఊ రి నుంచి ? అని అడిగింది ఆత్మీయం గా ..

నిన్ననే వచ్చాను ఆంటీ .. రాగానే తెలిసింది రచన గురించి .. అన్నాడు లోపలికి అడుగు పెడుతూ యశ్వంత్ .

నా మాట వినదు కదా .. తన ఇష్టాన్ని నేను కాదనలేను .. అంది గిరిజ నిర్లిప్తం గా

నేను రచన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఆంటీ .. రేపే బయల్దేరవచ్చు .. అన్నాడు యశ్వంత్ ..

నిజం గానా .. యశ్వంత్ ? ఆనందం గా అడిగింది గిరిజ ..

అవునాంటీ .. నేనే కాదు తనకి తోడుగా మరో నలుగురం వెళ్తున్నాం .. అన్నాడు యశ్వంత్ .

కులదేవత పూజ చేద్దాము అనుకుంటుండ గానే దాని ఫలితం కనబడింది .. నాకు ఇపుడు చాలా ధైర్యం గా ఉంది .. బాబూ .. అంది గిరిజ వెలిగి పోతున్న మొహం తో ..

ఆంటీ .. టైం లేదు .. నేనిక బయల్దేరతాను .. మీకీ విషయం చెప్పి వెళ్దామనే వచ్చాను అన్నాడు యశ్వంత్

అతని వంక కృతజ్ఞత గా చూసింది గిరిజ
                                                                                                                               
(ఇంకా ఉంది )

No comments: