Powered By Blogger

Monday, 25 November 2013

రుధిర సౌధం 9                                  రుధిర సౌధం 

                                                                                                 (23వ తేది తరువాయి భాగం )
ఎక్కడి నుండో ఓ సూర్య కిరణం .. మొహాన్ని సూటిగా తాకగానే మెల్లిగా కనులు తెరిచింది రచన ..
ఎలా ? తూర్పు వైపు కిటికీ మూసిఉన్నపుడు ఈ కిరణాలు నన్నెలా తాకుతున్నాయి ? అని లేచి కిటికీ వంక చూసింది రచన .
కిటికీ తలుపులకి ఉన్న చిన్న రంధ్రం కాంతి ని లోపలికి  ప్రసరింపజేస్తుంది . ఓహ్ .. అదా సంగతి .. అనుకొని గడియారం వైపు చూసింది . టైం 8గం కావొస్తుంది ..
మెల్లిగా మంచం మీద నించి లేచి హాల్ వైపున్న కిటికీ ని కొంచెం తెరచి చూసింది .. కింద డైనింగ్ టేబుల్ వద్ద భూపతి టిఫిన్ తింటూ కనిపించాడు .. దానికి కాస్త దూరం లో ఉన్న సోఫా లో కూర్చుని ఉన్నాడు రత్నం .. మే డ మెట్ల వైపు  ప్రతి  2 నిమిషాలకోసారి చూస్తూ ఉన్నాడు ..
రచన తనలో తనే నవ్వుకొంది   .. వీడైతే నాకోసమే ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు .. నేను కిందికి వెళ్ళే దాకా టిఫిన్ కూడా చేయడేమో .. త్వరగా రెడీ అయి కిందకి వెళ్ళాలి .. అని బాత్రూం లోకి నడిచింది .

కింద టిఫిన్ చేయడం ముగించిన భూపతి .. సోఫాలో ..కుర్చుని రచన కోసం ఎదురు చూస్తున్న కొడుకుని చూసి చిన్నగా నిట్టూర్చి .. ఆ అమ్మాయి కోసమేనా ఈ నిరీక్షణ .. కాసింత గంభీరం గా అడిగాడు .
ఆ .. అదీ ,.. నాన్న గారూ .. ఇంకా ఆకలి వేయటం లేదు .. అందులోను ధాత్రి మన అతిథి కదా .. అతిథి తినకుండా ఎలా  తినేస్తాను చెప్పండి .. అన్నాడు మెల్లిగా ..

చూడు రత్నం .. ఆ పిల్ల పట్నం పిల్ల .. పట్నాలూ..వాళ్ళ పోకడలు .. మన పద్ధతులకి వేరుగా ఉంటాయి . వాళ్లీ సమయానికి నిద్రలేవరు .. నువ్వు ముందు టిఫిన్ తినేయ్యి .. అన్నాడు భూపతి .
అలాగే నాన్నా .. అన్నాడు రత్నం .

నిన్న ఆ పిల్ల ని మహల్ వైపున్న పొలాల వరకు తీసుకు వెళ్ళావు.. వద్దన్నాను .. నువ్వు నా మాట వినదలచు కాలేదా ? కాసింత కటువు గా అడిగాడు భూపతి .

జవాబు ఏమని చెప్పాలో తెలియక మిన్నకుండి పోయాడు రత్నం .
ఆ అమ్మాయి ఇక్కడ కి ఎందుకు వచ్చిందో నీకు అర్థం కాని విషయం .. కానీ నాకు నువ్వు బ్రతికి ఉండటం అవసరం .. అర్థమైందని అనుకుంటాను అన్నాడు భూపతి ..
చిన్నగా తలూపాడు రత్నం .
నేను పొలం దాకా వెళ్లి వస్తాను .. ఇంట్లో ఉండు .. అని చెప్పి భూపతి వెళ్లి పోయాడు ..
ఈలోపు  మెట్లు దిగి వచ్చింది రచన ..
రచన ని చూసి హాయిగా నిట్టూర్చి .. హమ్మయ్య వచ్చావా ధాత్రీ .. ఆకలి గా ఉంది .. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు రత్నం .
అలానా ? ఐతే ముందు టిఫిన్ చేసేద్దాం .. అని టేబుల్ ముందు కూర్చుంది రచన ..
రత్నం కూడా కూర్చున్నాడు ..
రాత్రి నిద్ర పట్టిందా ? అడిగాడు రత్నం .. ..
ఊ .. భేషుగా పట్టింది . అంది రచన .
వెంగమ్మ వచ్చి ఇద్దరికీ టిఫిన్ వడ్డించింది ..
ఏవేవో కబుర్లతో ఇద్దరు టిఫిన్ కానిచ్చారు ..
రాజు గారూ .. ఈరోజు నేను  కొన్ని  ఫొటోస్ తీయాలి .. ఊర్లోకి వెళ్లి . ... అంది చేతులు కడుగుకుంటూ రచన .
అవునా .. మహల్ వైపైతే వేల్లనవసరం లేదు గా .. అన్నాడు రత్నం కాసింత కంగారు గా .
చిన్నగా నవ్వి .. లేదు .. పచ్చని పొలాలని .. ఊరి పల్లె  పడుచులని ..  స్థితి గతులనీ .. వీటన్నింటినీ ఫోటో లు తీయాలి .. అంది రచన .
ఓహ్ .. అలా ఐతే దున్నెయొచ్చు .. ఈ ఊరిలో ప్రతి మూలా నాకు తెల్సు .. నేను చూపిస్తాను .. అన్నాడు రత్నం ..
థాంక్ యు రాజు గారూ .. అంది రచన .
మరి ఐతే బయలుదేరుదామా ? అంది రచన ..
పదండి .. అన్నాడు  రత్నం .
కానీ .. ఈరోజు మీ జీప్ లో వద్దు కాలి నడకనే వెళ్దాం .. అంది రచన .
మీ ఇష్టం .. అన్నాడు రత్నం
ఇద్దరూ ఇంటి నుండి బయలుదేరారు ..
                                    *************************************************

స్వామీ .. నన్ను రమ్మని చెప్పారట .. అంది గిరిజ కొంత ఆత్రుత గా ..
అవును తల్లీ .. కంగారు పడకు .. రచన క్షేమం గానే ఉంది .. అన్నారు స్వామీజీ
సంతోషం స్వామీ .. మీ మాట నాకు కొంత ఓదార్పు నిచ్చింది .. అంది గిరిజ ..
చూడు తల్లీ .. రచన మంచి కోసమే .. ఆశ్రమం లో చండీ యాగం ,మృత్యుంజయ హోమమం చేయాలని సంకల్పించాను .. అది నీ చేతుల మీదుగా జరగాలి .. అన్నారు స్వామీజీ .
అలాగే స్వామీ .. మీరు చెప్పినట్లే చేద్దాము .. సన్నాహాలను మొదలుపెట్టండి స్వామీ .. అంది గిరిజ .
వీటితో పాటూ ..కొన్నే ల్లనుండి ఆగిపోయిన మీ కులదేవత పూజ కూడా జరగాలి అన్నారు స్వామీజీ ..
స్వామీ .. ఆశ్చర్యం గా అడిగింది గిరిజ ..
చూడు తల్లీ  ..నీ ఆశ్చర్యానికి కారణం నాకు తెలుసు .. కానీ నేను చెప్పేది నిజమే.. కులదేవత పూజ జరగాలి .. అందుకు నువ్వేమి చేయాలో తెలుసు కదా .. అన్నారు స్వామీజీ .
తెలుసు స్వామీ .. నేను నా బిడ్డ కోసం ఎంత కష్టాన్నైనా ఎదుర్కొనగలను .. మీరు మూహూర్తం నిర్ణయించండి ..
పూజ కి సర్వము నేను సిద్దం చేస్తాను .. అంది గిరిజ .. రానున్న అమావాస్య కి ముందు మూడు రోజులు పూజ లు జరగాలి . రచన పేరు మీద హోమాలు జరుగుతాయి .. కులదేవత పూజ కి సిద్దం గా ఉండు .. ఆ తరువాత ఆ పరంధాముడే నీ బిడ్డ కి రక్ష ...  నింగి వంక చూస్తూ అన్నారు స్వామీజీ .
అలాగే స్వామీజీ .. ఇక నేను వెళ్లి వస్తాను .అ ని లేచింది గిరిజ..
అభీష్ట ఫల సిద్ధి రస్తు .. అని దీవించారు స్వామీజీ .
(ఇంకా ఉంది )
   

 

1 comment:

Nagaraju said...

nice...
http://gsystime.blogspot.com/ please refer this site and let me know how it is .....