ఓ వెల్లువలా ముంచినదా .. సాగరమైన ప్రేమా
నీ అల్లికలో మల్లిక గా .. సువాసన పంచిన ప్రేమా
ఇరు మనసులలో ఉక్కిరి బిక్కిరి తుంటరి ఊహే నమ్మ ..
నునులేత చెక్కిలి పై ఎర్రదనం ఏ సూర్యుని మహిమా ..
ఈ గాలులలో .. ఏ గాలి మరి .. నీ శ్వాసే అవుతున్నది ..
నా ఊపిరి లో ఎందుకనో నీ శ్వాసే మమేకమైనది ..
ఏ పరిచయమో స్నేహమయి బంధం ధృఢ మవుతున్నది ..
ఏ పరిమళమో నాసిక తాకి నీ సిగ లో పుట్టానన్నదీ ..
మనలోని అనురాగం ఏ వింత సంగీతం .. ? లేకుంటే ఈ రాగం ప్రాణం లేనిదా సంగీతం .
ఏ వేకువ లో మెలకువ గా మారింది ఈ ప్రేమ ..
ఏ పున్నమి లో వెన్నెలగా కురిసింది ఈ ప్రేమ ..
బతుకు నే పండుగ చేసే కళ ఉన్నదీ ప్రేమా ..
మనసునే మచ్చిక చేసి పాలించునీ ప్రేమా ..
అనుభూతి తో తెలిసే రుచి ఉన్నదీ ప్రేమా .. వివరించి చెప్పాలంటే భిన్నమై కనబడునమ్మా ..
No comments:
Post a Comment