మనసే పలికే వేళా .... మౌనం మాటలు నేర్చినదా ....
కలలే చిలికే వేళా .... కన్నులు కళ నే చూపినదా ....
ఎద లోతులో అలజడి ఈవేళా .....ఎద లోతులో సవ్వడి ఏదోలా 2
కునుకే రాదు కనులకు.. చినుకే పడితే నేల కు ..
తడబడుతూ ఉ న్నా ... ముందుకు సాగేనా ... గడబిడ లోనా మనసే మునిగేనా
తలపే మాటిమాటికి ... పిలిచే వెన్నెలింటికి ....
తలుపులు కొడుతున్నా .... వినబడ దా మైనా ... జాబిలి వొడిలోనా చోటే దొరికేనా ?
అసలేంటో తెలియని మైకం ... అoతేదో తెలియని లోకం ...
సతమతమవుతున్నా .... తమకం లోఉన్నా ఎద లోతులో సవ్వడి ఏదోలా మనసే
పేరే తెలియదన్నా ... నీ రూపే పోల్చుకున్నా
వేరే పేరేలా ... ప్రేమ ని పిలవాలా ... నువ్వే నా వల్ల నవ్వితే చూడాలా ....
నిన్నే తలచుకున్నా .... ఆపై కలుసుకొనా ....
కలయిక లో ఉన్నా కల నిజమయ్యేన ? కలవరపడుతున్నా కల వరమయ్యెనా ....
కడుతున్నా ప్రేమకి సుంకం ...మొదలెడతా కొత్త అంకం ...
ఈ పరుగేలా .... నాలో నీ లీలా ... నిను చూసే వేళా నను నే మరవాలా ...ఎద లోతులో సవ్వడి ఏదోలా మనసే
2 comments:
పాట చాలా బాగుంది.. రాధిక గారు. ట్యూన్ చేస్తే ఎలా ఉంటుందో... అని ఆలోచిస్తున్నా. మా ఆవిడ శాస్త్రీయ సంగీతంలో దిట్ట. వాళ్లింట్లో అంతా సరిగమల పుట్ట. రోజూ సంగీతం వినివినీ నాక్కూత కాస్త ఆ జ్ఞానం అబ్బిందండి. దేవుడి దయవల్ల. కొన్నికొన్ని మార్పులు చేస్తే ఈ పాటకు మంచి ట్యూన్ సెట్ అవుతుంది.
మీరు ట్యూన్ చేయిస్తానంటే నా దగ్గర బోలెడు పాటలు ఉన్నాయండి .. మీ శ్రీమతి గారు సంగీతం లో దిట్ట అన్నారు..
నాకు సంగీతమంటే వల్లమాలిన ఇష్టం .. మీరు అదృష్టవంతులే అయితె.. ప్రతి రోజు ఓ పాట వినొచ్చు కదూ ..
మీ ప్రశంస కయితే నా ధన్యవాదాలు
Post a Comment