Powered By Blogger

Thursday, 14 November 2013

రుధిర సౌధం 1

       
     
                                                         
                                                                 రుధిర సౌధం   సూర్యుడు అస్తమించడానికి సిద్దపడుతున్నాడు ... పక్షుల కిల కిల రావాలు ,ఎర్రబారిన ఆకసం ఆహ్లాదకరమైన ప్రకృతి ...

  రమణా నంద మహర్షి ఆశ్రమం ..  శిష్యులు కొంత మంది ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నారు . ఇంతలో ఆ ఆశ్రమం ముందు ఓ కార్ ఆగింది ... కార్ లోంచి ఓ 25 ఏళ్ళ అమ్మాయి దిగింది .. చూడగానే గొప్ప అందగత్తె అని చెప్పవచ్చు . ఆమె ముందు కి నడిచి ఆశ్రమం ముందు పనిచేస్తున్న శిష్యుని వద్దకి వెళ్లి స్వామీ ... అని పిలిచింది .. ఆమె పిలుపు కి వెనుతిరిగిన అతడు ... మీరా ? ఎంతసేపైంది వచ్చి ? అని అడిగాడు . ఆమె చిరునవ్వు తో ఇప్పుడే ... అని
 స్వామీజీ .... అని అంటుండగా ... సంధ్య వందనానికి వెల్లారమ్మా ... మీరెళ్ళి కూర్చోండి .. గురువు గారు రాగానే తమరోచ్చిన సంగతి తెలియజేస్తాను  అన్నాడతను .
 
 అలాగే ...అని , తనకెప్పుడు అలవాటున్న ఓ రాతి మీద కుర్చున్నదామె .ఆమె కి ఆ ఆశ్రమానికి రావటం కొత్తకాదు ... తన చిన్నతనం నుండి స్వామీజీ తెలుసామే కి . ఏ పని చేయాలన్న స్వామీజీ సలహా కావాల్సిందే . ఇప్పుడు ఆమె ఓ  ముఖ్యమైన నిర్ణయం  తీసుకోవాల్సి ఉంది ..  మనసు ఆందోళన లో ఉన్నా ,సంతోషం లో ఉన్నా ఆశ్రమానికి రావటాన్ని ఇష్ట పడుతుందామే.

అమ్మాయి రచనా...స్వామీజీ వచ్చారు రమ్మంటున్నారు ... అని ఒకతను వచ్చి చెప్పాడు ... ఆమె ముందు కి నడిచి ఓ వెదురు పాక లోకి వెళ్ళింది ... కళ్ళు మూసుకుని ఆసనం వేసుకుని కూర్చున్నారు రమనానంద మహర్షి .
ఆమె అడుగుల సడి విని మెల్లిగా  గా కళ్ళు తెరిచి  రామ్మా ... అన్నాడాయన ఆత్మీయం గా ..

ఆమె నమస్కరించి అతని ఎదురు గా కూర్చుంది . రచనా ... అమ్మగారు బావున్నారా ? అని అడిగాడాయన .
చిన్నగా తల ఊపి .. స్వామీజీ   నేను ... అని  ఆగిపాయిందామే . నీ సందేహం నాకు తెలుసు తల్లీ ... ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని ఆలోచిస్తున్నావు ... అన్నాడాయన ప్రశాంతం గా .

అవును స్వామీజీ .. మీకు తెలియనిదేము0ది? చెప్పండి ... నేనెక్కడకి వెళ్ళాలనుకోవటం మంచి నిర్ణయమేనా ?
అడిగిందామె . ఆమె మొహం లో మీమాంస స్పష్టం గా కనపడుతుంది .   నిర్ణయం తీసుకోవటం జరిగిపోయింది తల్లీ .. నువ్వక్కడకి వెళ్ళటం అనేది అనివార్యం . విధి లిఖితం .. ఆ జగద్రక్షకుడే నిన్ను అక్కడికి పంపాలని నిర్ణయిస్తే నువ్వు వెళ్ళక తప్పదు కదా ... అన్నాడాయన .  ఏమో స్వామీ ... అవన్నీ నాకు తెలియవు .. నా డ్యూటీ నేను చేయాలనుకుంటున్న .. అమ్మ వద్దంటోంది .. మీరే చెప్పాలి ఆమె తో . అందామె .


సరే ... కానీ రచన నీ ఈ ప్రయత్నం లో విజయం నీడైనప్పటికినీ .. నీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి .. పోరాటం లో అవి తప్పవు  అన్నాడాయన దూరం గా అస్తమిస్తున్న సూర్యున్ని చూస్తూ .
 విజయం నాదే అన్నారు .. సమస్యల కోసం భయపడను స్వామీజీ .. స్థిరంగా  అంది రచన . "అవును తల్లీ ఆ జగదాంబ అంశ  లో జన్మించిన నువ్వు భయాన్ని ఎరుగవు .." అని మనసులో అనుకుని రా నున్న అమావాస్య నాడు ఈ తాయెత్తు ని ధరించు తల్లి .. ఇది నీ ప్రయత్న్నాన్ని సఫలీకృతం చేస్తుంది .. అని అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం వద్ద ఉన్న కుంకుమ పళ్ళెం లోంచి ఓ తాయెత్తు ని తీసి రచన కి ఇచ్చాడత డు. ఆమె దానిని అందుకుని భక్తి తో కళ్ళకద్దుకుని అమ్మ కి మీరు చెబుతారు గా .. అంది రచన . అతను ప్రసన్న వదనం లో చిరునవ్వు విరిసింది .. మెల్లగా తల పంకించాడు .
మరి నేను వెళ్లి వస్తాను స్వామీజీ అని లేచింది రచన .
 రచనా ... కొన్ని సమయాల్లో భయం,ప్రమాదం,మన వెన్నంటే ఉంటాయి .. నమ్మకాన్ని కోల్పోకు .. విధాత ఈ సమస్య ని పరిష్కరించటానికి నిన్ను ఎంచుకున్నాడు . కాబట్టి ఒక్కోసారి ఓడిపోతున్నట్లు అనిపిస్తున్న ధైర్యాన్నికోల్పోకు తల్లి అన్నాడతను .
అలాగే స్వామీజీ అని బయటికి నడిచింది ... మరో 2 నిమిషాల్లో కార్ వెల్లిపొఇన శబ్దం వినిపించింది . రమనానంద మహర్షి అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూసి నమస్కరించాడు ..

అమ్మా ! జగదాంబ! ఈ బిడ్డ ని అడుగడుగునా కాపాడు . నీ కృప వలన వర్ధనరావు గారికి జన్మించిన ఏకైక బిడ్డ . బ్రతికి ఉన్నంత కాలం అతడు నిన్ను కొలిచాడు . రచన నిప్పుల గుండం లోకే వేలుతోందని తెలిసినా అది నీ నిర్ణయమని ఆమె ని వారించలేక పోయాను . ధైర్యాన్ని కోల్పోకుండా ఆమె విజయం సాధించేలా ఆశీర్వదించు .. అని మనసారా వేడుకున్నాడు


                                                  ******************************
రచనా ! ఎక్కడకి వెళ్లావు ? ఇంత  ఆలస్యమయింది... గుమ్మం లోనే ఎదురై అడిగింది గిరిజ .
అమ్మా .. ఆఫీసు నుంచి ఆటే స్వామీజీ ఆశ్రమానికి వెళ్లాను ... అందుకే ఆలస్యమయింది అంది రచన .ఇంటిలోకి ప్రవేశిస్తూ .
ఎన్ని సార్లు చెప్పాను నీకు ఆఫీసు నుంచి సరాసరి ఆశ్రమానికి వేల్లోద్దని ... స్నానం చేసి వెళ్ళాలి గాని అంది గిరిజ చిరుకోపం గా .
అంత  టైం నాకు లేదు కదమ్మా ... ఐన స్వామీజీ నన్ను  క్షమించేస్తారు  అంది మురిపెం గా రచన .
రచన ఐన నువ్విప్పుడు స్వామీజీ ని కలవడానికి ఎందుకు వెల్లా వు?నీ పంతం నేగ్గించుకురావటానికే  కదా ... అందామె భయం గా .
అమ్మ ... ఎందుకలా భయపడతావు? స్వామీజీ నన్ను వెళ్ళమన్నారు .. ఎం ఫర్వలేదన్నారు . స్వామీజీ చెప్పా క కూడా నీకు అనుమానుమా ? అని అడిగింది రచన
ఆయన అలా అన్నారా? నా  భయం అర్థం చేసుకోలేదా ? అంది కాస్త భయం గా గిరిజ
అదే0 లేదు .. నీతో మాట్లాడతానన్నారు కూడా ... నన్ను ఆశీర్వదించారు ... ఈ సమస్య పరిష్కారానికి ఆ దైవం నిన్ను ఎన్నుకున్నదమ్మ అన్నారు .. అంది రచన తల్లి భుజాల చుట్టూ చేతులు వేస్తూ .
అవునా ? అంది ఆశ్చర్యం గా  గిరిజ .
అవునమ్మ... కాని నాకు ఓ తాయెత్తు కూడా ఇచ్చారు ...కాబట్టి నువ్వు భయపడ కు.అంది రచన

స్వామీజీ చెప్పాక నేను కాదనలేను కానీ నా మనసు లో ఇంకా ఏ మూలో ... అంది గిరిజ .

అమ్మా ఇంక చాలు నేను రేపే బయల్దేరాలి .. ఇంక నువ్వు నన్ను ఆశీర్వదించి పంపు ... నేను ఫ్రెష్  అయి వస్తాను అని కదిలింది రచన .

రచన నా మాట వినడం లేదు ... ఇంకా ఆ అమ్మవారే కాపాడాలి అనుకోండి గిరిజ మనసు లో .

                                                                                                                                 (ఇంకా ఉంది )  

No comments: