ప్రేమ
ప్రేమంటూ ఉంటే .. మనిషి కి మనసూ మరి ఉంటుంది ...
ఆ ప్రేమందకుంటే ... మనసుకి ఉరి వేసినట్టుంది ..
దాసోహము .. ప్రేమకు ఈ హృదయము ...
ఈ దాహమూ .. తీర్చే ప్రేమామృతము ...
ఈ భూమి పుట్టక ముందే ఆ ప్రేమ పుట్టింది ..
మరు భూమి చేరినా ... ప్రేమ కు మారు పేరు లేకుందీ ..
ఆ నింగి సాక్ష్యం కనుకే ప్రేమే నిలిచుంది
కాలాలు మారుతున్నా నిలిచి ఉన్నానంటుంది
కన్నీరూ తానేనంది చిరునవ్వు లోను ఉంది
కష్టాలు ఇష్టాలు తన నైజమంటు చెబుతుందీ ..
అభిమానమై ఉంటుందీ .. అనుమానమే రేపింది
అవమానమైనా గాని తన రూపమే అంటుందీ
త్యాగాన్ని కాంక్షి o స్తుందీ ... స్వార్థాన్ని పుట్టిస్తుందీ ..
ప్రాణాల్ని తీస్తుంది .. బ్రతుకుల్ని నిలబెడు తుందీ ..
పాపాల్ని చేయిస్తుంది .. శాపము అవుతుందీ ..
వరమాల వేయిస్తుంది శ వమల్లె మార్చేస్తుంది ..
ప్రళ యాన్ని సృష్టిస్తుంది .. విలయాన్ని కవ్విస్తుంది
ప్రణవమై నర్తిస్తుంది ప్రణయము తానయ్యింది
గరలమే కురిపిస్తుంది అనలమై జ్వలియి స్తుంది
మరణాన్ని ఎదిరిస్తుంది రణ ము గా ఎదురొస్తుంది
గతమంతా తానె ఉందీ .. భవితకి స్వాగతమంది
నేడైనా రేపైన .. ప్రతి మది ని పలకరిస్తుంది
తొలకరి వానవుతుంది .. పులకరింతల్లో ఉంది
ఎండలో మంచవుతుంది .. మంచులో ఎండ వుతుంది

పూలలో పరిమలమైంది .. గాలిలో గంధం అయింది
మాలలో దారం అయింది .. లాలి లో రాగం అయింది
రూపమే వేరంటుంది .. అపురూప మై ఉంటుంది
బంధమై జీవిస్తుంది .. అనుబంధమై ఎదిగింది
కవిత లో భావమయింది .. కలత లో తోడూ అయింది
నిదుర లో హాయి అయింది .. మధుర లో లీల అయింది
బాధలో ముభావమయింది .. రాధ లో ఆరాధనయింది
గాధ లో విజయమయింది .. బోధ లో లీనమయింది
ద్వేషమై మొదలవుతుంది .. దేశమే గులామవుతుంది
దోషమే చూడను అంది .. ఘోష గా గర్జిస్తుంది
మోసమే కానని అంది .. మౌనమే వద్దని అంది
ఆకసమే తను నిండింది .. గానమై చెలరేగింది
ప్రేమంటే ప్రేమ కెపుడు ప్రేమేలే అని అంటుంది
ప్రేమించు మనసు లో ప్రేమే పండగ అవుతుంది

7 comments:
నిజంగా మీ కవిత ప్రేమంత తీయగా ఉంది
నిజంగా మీ కవిత ప్రేమంత తీయగా ఉంది
రాధిక గారు... ప్రేమంత ప్రేమదో.. ప్రేమంత ప్రేమిస్తుందో..
ప్రేమెంత ప్రేమగా ప్రేమను పంచుతుందో... ప్రేమప్రేమతో
ఏం ముచ్చటిస్తుందో... ఎంత ప్రేమగా చెప్పారండీ.. చాలా బాగుంది.
chala bagundhi....
సతీష్ గారూ .. ఎంత చెప్పినా ప్రేమ గురించి అది తక్కువే అవుతుంది .. ప్రేమ గొప్పతనమే అది
thank you srini garu
thank you subhadra garu
Post a Comment