Powered By Blogger

Friday, 22 November 2013

రుధిర సౌధం 7

                                                           రుధిర సౌధం 

ధాత్రీ ..సిద్దమ్ గా ఉన్నావా ? ఊరి లోకి వెళ్దాం .. అంటూ వచ్చాడు రత్నం
హా .. అని సెల్ బాగ్ లో పడేసి లాక్ చేసి రత్నం ని అనుసరించింది రచన .
 కింద జీప్ రెడీ గా ఉంది .. ఇద్దరు ఎక్కి కూర్చున్నాక రత్నం జీప్ స్టార్ట్ చేసాడు ..
బాగా పల్లెటూరు .. జనం  విచిత్రం గా చూస్తున్నారు రచన ని ..
ఏంటి అంతా నన్ను వింతగా చూస్తున్నారు .ఽని ప్రశ్నించింది రత్నాన్ని .
అదా .. మా వూళ్ళో ఆడపిల్లలు ఎవరు జీన్స్ వేసుకోరు .. వాళ్ళకి నీ వేషధారణ కొత్తగా కనిపిస్తుంది .. అని చెప్పాడు చిరునవ్వుతో రత్నం .
అతనితో అలా పిచ్చాపాటీ మాట్లాడుతూనే వూళ్ళో అన్ని మార్గాలని క్షుణ్ణం గా పరిశీలించ సాగింది రచన .
ఊరికి  చివర్లో ఉన్న పొలాల వరకు వచ్చి .. ఇవే మాఊ రి పొలాలు .. అని చెప్పి ఇక్కడి నుంచి వెనక్కి వేల్లిపోవటమే .. అన్నాడు రత్నం
అదేంటీ .. ఆ ముందంతా ఎంత బావుంది ? చూద్దాం .. మారం చేస్తున్నట్లు అంది రచన .
అమ్మో .. అటు వైపా.. లేదు ధాత్రీ .. అటు మనం వెళ్ళకూడదు . అటువైపు రాణి మహల్ ఉంది .. పైగా సాయంత్రమయిపోవోస్తుంది .. అన్నాడు   రత్నం .
ఎందుకంత భయం ఆ మహల్ అంటే .. అటువైపు పొలాలు ఎంత పచ్చగా ఎంతబావున్నాయి ?అంది రచన తెలివి గా
సరే .. కానీ మరి కొంచెం ముందుకి పోనిస్తానంతే .. అని ముందుకి పోనిచ్చాడు .
జీప్ ముందుకు వెళ్తుంటే దూరం గా కనిపించింది ఓ పురాతన భవనం ..
ఆమె ఆసక్తి గా చూసింది ..
అదుగో .దూరం లో కనిపిస్తున్నదే .. అ దె రాణి మహల్ .. వణికిపోతూ చెప్పాడు రత్నం .
ఆమె పరీక్ష గా చూసింది అటువైపు .
ఆమె ని అడగకుండానే జీప్ ని వెనక్కి పోనిచ్చాడు రత్నం .
                                                ***********************************
భోజనాలు పూర్తయినాక తన  గది లోకి వెళ్లి అందరు నిద్రపోయేవరకు తానూ నిద్రపోయినట్లు నటించింది .
పల్లెటూరు కావటం తో 9 గం కొట్టేసరికి ఊరంతా నిశ్శబ్దం అయిపొయింది .. ఎక్కడో దూరం లో హృదయ విదారకం గా కుక్కలు అరుస్తున్నాయి .. వాటి అరుపులు తప్పితే ఏమి వినిపించడం లేదు .
11గం కొట్టేసరికి మెల్లిగా బెడ్ మీది నుంచి లేచి గదిలో ఉన్న కిటికీ తెరచి హాల్లోకి చూసింది రచన . అందరు నిద్రపోతున్నారు . ఇదే సరి ఐన సమయం ... అని గది  తలుపులు లోపలి నుంచి మూసి  గదంతా పరికించి చూసింది .. అ గదికి దక్షిణం గా ఉన్న కిటికీ తెరచి చూస్తే.. ఆవలి వైపు ఉన్న వీధి కనబడుతుంది .. కిటికీ తలుపులు తెరచి చూసింది ..  వీధి అంతా నిశ్శబ్దం గా ఉంది .. ..

ఆ కిటికీ కి   చువ్వలు లేకపోవటం తో నిశ్చింత గా ఊపిరి పీల్చుకుంది .. కిటికీ కి దగ్గ్గరలో బాత్రూం పైపు ఉండటం తో దాని సహాయం తో కిందికి దిగోచ్చని తలచి .. తనకి కావాల్సిన వస్తువులతో పాటు గన్ తీసుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంది రచన .. మెడ చుట్టూ స్కార్ఫ్ చుట్టుకుని .. కిటికీ దగ్గరికి వచ్చి .. కిటికీ లోంచి సునాయాసం గా పైపుని అందుకుంది రచన .. పైపు ని సహాయం గా పట్టుకుని జర్రున జారింది
కొన్ని క్షణాల్లోనే రచన బంగ్లా వెనుకవైపున ఉన్న వీధి లోంచి మాయమయింది .

వీధుల్లో ఎవరు లేరు .. అందరు గాఢ  నిద్ర లో ఉన్నారు .. రచన మహల్ వైపు వడి వడిగా నడిచింది ..పొలాల మధ్యలోంచి వెళుతుంటే చల్లని గాలి మేను ని వణికిస్తుంది .. దూరం గ ఎక్కడో నక్క  వూల .. భయానకం గా .
దేనికి చలించకుండా మహల్ దగ్గరికి చేరుకుంది రచన ..

ఆ చీకట్లో ఏ మూలనుంచి వస్తుందో తెలియదు గాని ఓ రక మైన వెలుగు ఆ మహల్ మీద పడటం తో వింతగా మెరుస్తుంది .. దాదాపు శిథిలావస్థ లో కొన్ని గోడల మీద పెరిగిపోయిన పిచ్చిమొక్కలతో జడల దెయ్యం లా ఉంది ..
మహల్ దగ్గరకి వచ్చేసరికి ఆమె పాదాలు వేగాన్నితగ్గించాయి .. పరిశీలన గ చుట్టూ పరికించి చూసాక ముందుకు నడిచింది . మహల్ ముందు ఉన్న గేటు బలహీనం గా ఉంది .. మెల్లిగా దానిని ముందుకి తోసింది .. కిర్ర్ మంటూ అది చేసిన శబ్దం కూడా కర్ణ కటోరం గా తోచింది రచన కి .

మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకి నడిచింది ..
విశాల మైన ప్రాంగణం లో మహల్ లోనికి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి ..  చాలా పెద్దగ గొప్ప నైపుణ్యం తో నిర్మించిన ఆ మెట్లు సరాసరి సింహద్వారానికి తీసుకేల్తాయి ..
ఉత్సుకత తో మెట్లన్నీ ఎక్కి సింహద్వారాన్ని చేరుకుంది రచన ..
చేతిలో ఉన్న టార్చ్ తో ఆ ద్వారాన్ని చూసింది తలుపులు వేసి తాళం వేసి ఉంది ..
అయ్యో ..లొపలికి ఎలా వెళ్ళటం ..తాళం వేసి ఉంది .. ఇంత  పెద్ద తాళాన్ని ఏ రాతితో కూడా బద్దలుకొట్టడం కష్టం ... మరి మహల్ లోకి ఎలా వెళ్ళటం ? అని చుట్టూ చూసింది .. ఎత్తైన స్తంభాలతో వరండాల ఉన్న ఆ ప్రాంగణం లో నడుస్తూ ఉంటె భవనం వెనక్కి చేరుకోవోచ్చు .. క్షణం ఆలస్యం చేయకుండా ముందుకి నడిచింది రచన .
భవనం వెనుక వైపు పాత తటాకం ఉంది .. నీళ్ళు మాత్రం లేవు .. వెనుక వైపు ఉన్న అన్ని ద్వారాలు కూడా మూసి ఉన్నాయి .. ఆమె లోపలి వెళ్ళే  అన్వేషిస్తూ ముందుకి  నడుస్తున్న ఆమె  కి   ఏదో సవ్వడి  వినిపించింది .
ఆగి   రిక్కించి విన్నదామే .. మెత్తని అడుగుల  సవ్వడి ..
ఆమె  వెంటనే జేబులో ఉన్న గన్ పై వేసి వెనక్కి తిరిగింది .. ఓ క్షణం ఆమె విస్తుపోయింది ఆ దృశ్యం చూసి ...
ఆమె వైపు రెండు కా 0తి  వలయాలు శర  వేగం తో దూసుకు వస్తున్నాయి ... ఆమె మెదడు చురుగ్గా పనిచేసింది


వెంటనే ఆమె  అక్కడ  నుంచి కిందికి దుమికింది .. ఎత్తు  ఉన్నప్పటికీ ఆమె కింద పడటం తో  ఆమె మోచేయి 
రగిడి రక్తం కారసాగింది .. లేచి నిలబడి మల్లి వరండా వైపు చూసింది .. అక్కడంతా   సాధారణం గా ఉంది .. మోచేయి రక్తం కారడం తో మెడకి ఉన్న స్కార్ఫ్ ని తొలగించి మోచేయికి కట్టు కట్టింది .. మెల్లగా ముందు కి నడిచిన ఆమె కి ఒక్కసారిగా దుమ్మురేగటం తో తన కళ్ళకు అడ్డం గా రెండు చేతులు పెట్టింది ... ఆకాశం అరుణ వర్ణం లోకి మారుతోంది .. మేఘాలు వడివడిగా సాగిపోతున్నాయి .. కళ్ళు తెరిచి చూసింది రచన .. 

మెల్లిగా భవనం ముందు వైపుకి వచ్చింది రచన .. వాతావరణం లో మార్పు స్పష్టం గా అర్థమవుతున్దామే కి .. 
ఏమిటిదంతా .. ఆమె క ళ్ళ ముందు జరుగుతున్నదాన్ని మౌనం గా అంగీకరించింది .. ఆ పరిస్తితు లని ముందుగా ఊహించినట్లు .. 
                                                                                              (ఇంకా ఉంది )
No comments: