Tuesday, 5 November 2013




ఫ్రెండ్స్...
            
       సమాజం పట్ల మనకి కొంత బాధ్యత ఉంది కదా...చుట్టు ఉన్న పరిస్థితుల ప్రభావం ఎంతొ కొంత మన మీదా పడుతూనె ఉండటం సహజమే.. ఐతె కొంత కాలం నుండి మన వ్యవస్థ పట్ల అగౌరవం పెరిగింది..రాజకీయవెత్తల వల్ల కావొచ్చు ..సాటి మనిషి ఫట్ల మనకి భాధ్యత లెకపొవటం వల్ల కావొచ్చు..పెరుగుతున్న నాగరికత వల్లనూ కావొచ్చు...కారణాలు  ఏమైన గానీ మన వ్యవస్థ సరిగ్గా లేదన్నది పచ్చి నిజం..స్నేహాలు..ప్రేమలు..మోసాలకి  ఆనవాల్లు అయి  సమాజం లొ అభద్రత భావాలని  రేపుతున్నాయి.

         యువత పెడదారి పడుతోంది..నైతిక విలువలు అణగారిపోతున్నాయి ..మనుషుల మధ్య సంభంధ బాంధవ్యాలు మాయమయిపోతున్నయి..ఎక్కడ చూసినా అత్యాచారాలు,హత్యలు,దాడులు,ఏక్సిడెంట్లు,ఫ్రమాదాలు..వీటికి తోడు ఫ్రక్రుతి వైపరీత్యాలు ..ప్రశాంతత  లేదు..ఆనందం కానరాదు..అశాంతి నలు దిక్కులా..సమస్యల  సుడిగుండాలని మనిషి ఎదుర్కోక తప్పని పరిస్థితులు..సామాన్యుడు నలగిపోతున్నాడు రాజకీయవేత్తలు స్వార్దం తో డబ్బు వెనకేసుకోవతం తప్ప ప్రజాసేవ మర్చిపోయారు..కానీ ఎన్ని మార్పులు వచ్చిన మనిషి మనసు పొరల్లొ ఇంకా ఏ మూలో సున్నితత్వం దాగి ఉందని ,సమాజం పట్ల ,భావితరాల పట్ల బాధ్యత ఉన్నదని సమైక్యాంధ్ర ఉద్యమం నిరూపించింది. సీమంధ్ర మొత్తం కదలి వచ్చింది..స్వార్థ రాజకీయవేత్తల గుండెల్లొ గుబులు పుట్టించింది...ఏ సమస్య వచ్చిన ఒక చేయి పనిచేయటం కంటె పది ఛెతులు ఒకటి గా పనిచేయటం వల్ల ఫలితం బావుంతుంది..త్రుప్తి మిగులుతుంది..

తెలంగాణ వస్తుందొ లేదో ,సీమాంధ్రుల కోరిక నెరవేరుతుందో లేదో..గానీ..ఈ సమస్య వల్ల  మనుషులంతా ఒకటి  కావటం ,కల్సికట్టు గా ఫోరాడటం ..నిజం గ మల్ళి  నమ్మకాన్ని పెంచింది..

    మనిషి  మనిషి గా మసలినపుడు తప్పనిసరిగా పరిస్థితులు చక్కబడతాయి..కేవలం  మీగురించే ఆలోచించకండి ..తోటి మనుషుల కోసం ఆలోచించండి..నైతిక విలువల్ని పెంచి పోషించండి..మానసిక పరిపక్వత ని వ్రుద్ధి పరచండి..ఆదర్శనీయమైన జీవితాన్ని గడపండి..

   సమాజం లో మార్పు ఆశించినపుదు  ముందు మీరు మారండి..నవ సమాజాన్ని నిర్మించండి . 

                                                         జై హింద్          

No comments: