నేలా నింగీ కలిసిన వేలా ... కలిసేనా మరి ఈ జంటా ..
నీరు నిప్పు ఒకటగు నంటే నమ్మేవారే లేరంటా
పగలు ,రేయి కలిపే రోజు నిన్ను నన్ను కలిపేనా?
వలపో గెలుపో తెలియని పంతం దూ రాన్నంతం చేసేనా/ నెల నింగి
అమవాసపుడు వెన్నెల రాదే కాని దీపావళి లేదా ?
మండుటెండ లో నీడనివ్వగా ఏ చెట్టయినా సరిపోదా
తూర్పు పడమర కలవక పోతేం ... ఎదురెదురుగా ఉంటె చాలదా
సూర్యుడు చంద్రుడు కలవకపోతెం ...జాబిలీ వెలుగు సూర్యునిదేగా ...
ఈ బంధం జన్మ జన్మల బంధం ... కలిసే దాక జన్మిద్దాం ..
కలవక పొతే మరణిద్దాం .... నేల
ఒక్కరినోక్కరు చూడని కనులు చూసే చూపు ఒకటేలే
పదములు రెండు వేరైనా నడిచే దారి ఒకటవులే ...
చప్పట్లకైన రెండు చేతులు కలవాలె. ..
ప్రేమ ,ద్వేషం రెండు మనసులోనే పెరిగేలే
అంతరార్ధం ఒకటే ఏవేవో నీ చుట్టూ ఉన్నా ....
No comments:
Post a Comment