Powered By Blogger

Friday, 8 November 2013

కాలం తనపని తాను చేసుకుంటూ పోతుంది!
దుర్యోధనుడు పాండవులతో లేనిపోని విరోధాలకి పోయి కలహించి చివరికి తనతోపాటు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య ఇంకా ఎందరో క్షత్రియ వీరులని కాలగర్భంలో కలిపేశాడు. 

దృతరాష్ట్రుడు తమ్ముడు, ధర్మశాస్త్ర కోవిదుడు అయిన విదురుడు పాండవులకి, కౌరవులకి ఎన్నో ధర్మసూత్రాలు భోదించి చివరికి అడవిలో ధూళి పట్టిన శరీరంతో దిగంబరుడిగా తిరుగుతూ ధర్మరాజు సమక్షంలో ఒక నిర్జన ప్రదేశంలో యోగశక్తి ద్వార తన జీవాన్ని ధర్మరాజులో ఐక్యంచేశాడు.

కొడుకుల మీద అధికమైన మొహంతో వేయి ఏనుగుల బలం కలిగిన దృతరాష్ట్రుడు ఒకనాడు కంచుతో తయారు చేసిన భీమసేనుడి విగ్రహాన్ని బిగి కౌగిలిలో బంధించి ముక్కలు ముక్కలుచేసిన బలం కలిగి చివరి దశలో కొడుకుల మీద బెంగతో, తనతప్పులని తలచుకుంటూ కృంగిపోయి నడవడానికి కూడా ఓపికలేక గాంధారిదేవిని, కుంతీ దేవిని ఆసరాగా చేసుకుని ఆశ్రమవాస కాలం గడిపి చిట్టచివరికి కదలలేని పరిస్థితిలో అగ్నిజ్వాలలకి ఆహుతి అయిపోయాడు.

పాండవుల వెనకుండి అనుక్షణం నడిపించిన శ్రీకృష్ణుడు.. నారద, కణ్వ ఇత్యాది మునుల శాపం వల్ల కళ్ళముందే యాదవులు తమలో తాము కొట్టుకుని చనిపోతుంటే ఆనాటి శాపం ఈనాడు ఇలా కాలప్రభావం అనుకుని తటస్థంగా చూస్తూ ఉండిపోయాడు. అటు గాంధారి శాపం, ఇటు దుర్వాసుడి శాపం ఫలించి ప్రాణానికి ప్రాణంగా కలిసిమెలిసి ఉన్న అర్జునుడికి కూడా తెలియకుండా ఒంటరిగా తనువుని వదిలేశాడు.

మరి మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆలోచించండి. శ్రీకృష్ణుడు వెళ్లిపోయాడని తెలిసి అర్జునుడు శ్రీకృష్ణుడి శరీరాన్ని వెదికి అంత్యక్రియలు చేసి యదవులని దరిజేర్చి శ్రీకృష్ణుడి మనువడు వజ్రుడిని ఇంద్రప్రస్థానికి యువరాజుని చేసి యదవులని వజ్రుడికి అప్పగించి వ్యాసుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియజేసి నిలుచుంటే వ్యాసుడు! శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడు కనుక మీరు కూడా మహాప్రస్థానం సాగించండి అన్నాడు. అప్పటికే క్రుంగిపోయిన అర్జునుడు ధర్మరాజుకి విషయం తెలియజేస్తే సరే అన్నాడు. తరువాత అనుకోని సంఘటనలు(అన్నదమ్ముల మధ్య ఆస్థి తగాదా వచ్చిందని నకులుడు వెళ్లి ధర్మరాజుకి చెప్పగానే కలి ప్రవేశించాడని గ్రహించి మహాప్రస్థానానికి వెళ్ళిపోతారు. అశేష సామ్బ్రజ్యాన్ని పాలించిన పాండవులు అందరు(ధర్మరాజు తప్ప) ఒక్కొక్కరే యోగశక్తి ద్వారా అసువులు నిలుపుకోలేక శరీరాలని వదిలేశారు.

మొదట ద్రౌపతి : ఐదు గురు భర్తలున్నా, ఐదు గురు ఒక్కటే అంశ అని తెలిసినా అర్జునుడిమీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం వల్ల యోగశక్తి సరిపోక ముందుగా శరీరాన్ని వదిలేసింది. 
రెండు సహదేవుడు : తనకంటే ప్రజ్ఞాశాలి ఎవ్వరు లేరని విర్రవీగడం వల్ల 
మూడు నకులుడు : తనకంటే సౌందర్యవంతుడు ఎవరులేరని ఘర్వించడం వలన
నాలుగు అర్జునుడు : కౌరవులని ఒక్కరోజులో అంతం చేస్తాను అని సాధ్యం కాని ప్రగల్భాలు పలకడం వలన!
ఐదు భీమసేనుడు : అధిక భోజన ప్రియుడు కావడం వలన!
యోగశక్తి సరిపోక ప్రాణములు వదిలేశారు. వీరు చేసిన చిన్న చిన్న దోషాల వల్ల శరీరంతో స్వర్గాన్ని చేరుకోలేకపోయారు.

పైన చెప్పిన వారు ఎంతో శక్తి కలిగి ఎన్నో శక్తులు కలిగిఉండి కూడా చివరికి కాల పరిణామాల వలన అత్యంత దయనీయంగా ప్రాణాలు కోల్పోయారు. ఏ శక్తులు లేని, ఉన్న శక్తులు కూడా వాడుకోలేని మనలాంటి సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలి? వారిని తక్కువ చేసి చెప్పాను అనుకోకండి. వారు చేసింది చిన్న దోషాలే! ఆదోషాలు ప్రభావం ఎలావుందో చూశారు కదా! తెలిసి చేసిన తెలియక చేసినా ఎన్ని ధర్మాలు చేసిన, ఎన్ని ధర్మసూత్రాలు వల్లెవేసినా నిరంతరం జాగ్రత్తగా మేలగాల్సిందే. అనుక్షణం దైవ నామస్మరణం చేస్తూ ఉండాల్సిందే. కలియుగంలో పెద్ద లాభం ఏంటంటే!
ద్వాదశాక్షరి మంత్రం కానీ, పంచాక్షరి మంత్రం కాని పటిస్తే చాలు. లేక మహాభారతం గాని భాగవతం గాని విన్నా, చదివినా చాలు మోక్షం తప్పక సిద్దిస్తుంది. అలాగని నియమాలు వదిలేయకూడదు. దేని దోవ దానిదే.

No comments: