కుదురులేదు మనసులొ.. ఎదురుచూపు కనులలో
ఎక్కడ నువ్వని? ఏ దిక్కున ఉన్నావని ....
ఎవరిని అడగాలని ,ఏ చోటని వెతకాలని ...
ప్రేమ తప్ప తోడు లేని పిచ్చి మనసుకు.. బదులు మనసునిచ్చి నన్ను చేరవెందుకు?
ii కుదురు11
మల్లె లాంటి మనసులోన పరిమళమే ప్రేమ ...
అది నిన్ను తాకి నన్ను చేర్చు రోజు ఎప్పుడమ్మా....
వెన్నెలున్న రేయిలోన చందమామ ప్రేమా ...
నువ్వు నాతో ఉంటే పున్నమల్లె రాత్రి మారునమ్మా ...
నీ తలపుతోనే రేయి పవలు గడపగలనుకానీ ...
నిన్నొక్కసారి చూడాలి నన్ను చేరవేమి ? కుదురు
గుండెలోన సవ్వడల్లె నాలోన కలిసె ప్రేమా ...
నువు రావు అంటే గుండె కూడా ఆగిపోవునమ్మ
తేనే లోని తీపిమల్లె నాలోనే నిలిచే ప్రేమా
నువ్వు లేవు అంటే చేదు నాలో మిగులునమ్మా
నీ పిలుపు కొరకు వే చిఉన్న మనసు కలలు కననీ ..
ఆ కలల నైన కన్న కనులు కనీరు దాచనేమీ ? కుదురు
3 comments:
బాగుందండీ... మీ ప్రేమ గీతం. కుదురు లేనిదే మనసు మరి. ఏం చేస్తాం.. ప్రేమించేస్తుంది. పిచ్చిపిచ్చిగా. పిచ్చి మనసు. ఈ మధ్య కాస్త బిజీ ఎక్కువై... కాస్త లేటయింది.. స్పందనకు. అన్నట్టు మన రాష్ట్రం ఇప్పుడు వేరండోయ్. నూతన రాష్ట్ర శుభాకాంక్షలు. మనసులో ఏమైనా ఉండనీయండి. మన ప్రాంతం మనుషులకు పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువకదా. ఎడారిలో వదిలేసినా... మినరల్ వాటర్ వ్యాపారం చేయగల దిట్టలు. ఏమంటారు.
నూతన రాష్ట్ర శుభాకాంక్షలు అనైతే మీరు ఈజీ గా చెప్పేశారు సతీష్ గారు .. కానీ ఇది మింగుడు పడని అంశం కదా
మన వాళ్ళది ఆశావాదం కావొచ్చు కానీ నష్టపోయేదీ కష్ట పడేదీ ఈ తరం కదూ .. ఏమిటో .. ఒకర్ని విడదీసే హక్కు మరొకరికి ఎవరిచ్చారో
నేను ఈజీగా చెప్పలేదండి.. చాలా బాధపడుతూ చెప్పాను. మూర్ఖత్వాల వల్ల విడిపోయిన రాష్ట్రం మనది.
Post a Comment