కలికి చెక్కిలి పైన కన్నీటి చారికా..
ఉప్పని వెల్లువా నువ్వు జాలువారికా..
కన్నె మదిలో గుబులు ఎవ్వరికి ఎరుకా ?
పెదవి పై నవ్వేల కానరాదె ఇక ...
పసిడి ప్రాయమ్ము ఎవ్వరికి కానుకా ?
రుక్మిణికి కిట్టయ్య ఉన్నాడు కనుక ..
వలపు వాకిలి తెరిచి చూసింది కునుకులేకా ...
ఈ పసి దాన్నికాపాడ ఏ ఆశ తునకా...
వెతికినా కనరాదు ...నీకేది దారికా...?
తాత తో మనువు నే నువు కాదనకా ....
లేలేత వయసు లో ఏమిటీ నడకా ...?
ఆకసం లో మెరిసిన ఆ తారకా...
మూ గబోయినదమ్మ దీవించలెకా...
అందచందములోన నీకు ఆ మేనకా
ఏ తీరున చూసినా సాటి రాదింకా ...
జీవమ్ము లేనిదీ ఈ పెళ్లి వేడుకా ....
సరిజోడు లేక వెలవెలబోయింది వేదికా ....
నూరేళ్ళ జీవితానికి ఉన్నదా డోకా....
తీయలేనిది కదా నీ కంట నలకా...
ఈ కవిత ఆనాటి మూ డా చారమయిన బాల్య వివాహాలకి అడ్డం పడుతుంది ... ఇప్పటికి కొన్ని ప్రాంతాల లో ఈ దురాచారం ఇంకా కొనసాగటం దురదృష్టకరం ...
వయసు మళ్ళిన వాళ్ళని బాల్యవివాహం చేసుకుని వితంతువులయిన వారెందరో ....... అటువంటి వారికి నా ఈ కవిత అంకితం .
జై హింద్
-రాధిక
No comments:
Post a Comment