Powered By Blogger

Saturday, 23 November 2013

రుధిర సౌధం8

                                  రుధిర సౌధం
                                                                                                (22 వ తేది తరువాయి భాగం ) 

ఆమె మరోసారి మహల్ సింహద్వారం వైపు చూసింది .. ప్చ్ .. తాళం చెవి దొరికి ఉంటె పరిస్థితి మరోలా ఉండేది .. ఏదో శక్తి నన్ను అడ్డుకుంటుంది .. కాని నేను ఊరికినే వోడిపోయి వెల్లేరకం కాదు ... అనుకుని ..
గట్టిగా అరచింది ..ఎవరు ? ఎదురుగా వచ్చి నిలబడు .. భయపెడితే పారిపోయే రకం కాదు నేను .. ..ఓ డి పోయి  వెళ్ళ ను ... మళ్ళి  వస్తాను .. నాకోసం వేచి ఉండాలి నువ్వు...  తప్పదు . ..అంది గట్టిగా ..
అంతే ఉవ్వెత్తున ఓ సుడిగాలి లేచి ఆమె వైపు రాసాగింది ..

ఆమె బిత్తరపోయి చూసి .. వెంటనే తేరుకుంది .. భయపడకుండా సూటిగా అటువైపు చూ సింది .. ఆమె కళ్ళలో ఎరుపు .. జంకు లేనితనం గుర్తి0ఛి0దేమో ఆ అదృశ్య శక్తి .. ఒక్క సారి గా సుడి గాలి విచిత్రం గా మాయమయింది ..
గట్టిగా ఊ పిరి తీసుకుని ముందుకు కదిలింది రచన ..

ఆకాశం వివిధ వర్ణాలతో కనబడుతుంది భయానకం గా .. ఆమె మెల్లిగా గేటు దగ్గరికి వచ్చింది ..చేతి నొప్పి  ఎక్కువవసాగింది ..  చేతికి కట్టిన కట్టు ని గట్టిగా పట్టుకుని మెల్లిగా ఆ ప్రాంతాన్ని దాటింది ..
ఆమె వస్తున్నపుడు ఆమె వెనుకగా మహల్ గేటు తానంతట తానె మూసుకు పోవటం ఓరకంట గమనించింది .
విసురుగా గాలి .. చెట్లు పిచ్చేక్కినట్లు ఊగిపోతున్నాయి .. పొలాల వెంబడి నడుస్తూ  ఎందుకో వెనక్కి తిరిగి మహల్ వైపు చూసింది .. నింగి అరుణ వర్ణం లోకి మారటం వల్లనో ఏమో ఆ మహల్ కూడా ఎర్రని రంగు లో కనబడింది ..
వడివడిగా నడుస్తూ బంగ్లా వెనుక భాగాన్ని చేరుకుంది ..
చేతి నొప్పి తాళలేక  పోతున్న మెల్లిగా పైపు ని పట్టుకుని పైకి ఎగబాకి కిటికీ ని అందుకొంది రచన .
కిటికీ గుండా గదిలోనికి ప్రవేశించి మెల్లిగా మంచం మీదకి చేరింది ..
ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది .. జరిగినదంతా కళ్ళ ముందు మెదిలింది ..

ఏమిటది ? ఏదైనా అతీత శక్తి ? లేదంటే ఎవరో కావాలనే అలాంటి పరిస్తితుల్ని సృష్టించి ఉంచారా? లేదు .. నేనా ప్రాంతం ఉన్నపుడు ఆకాశం కూడా వికృతం గా కనబడింది .. అనుకుంటూ కిటికీ లోంచి ఆకాశం వంక చూసింది .. ఏమి జరగనట్లు ప్రశాంతం గా ఉంది ..
అబ్బా.. చేతి నొప్పి ఆమె ని ఇబ్బంది పెట్టింది ..లెచి తను తెచ్చుకున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ని తీసి గాయం తగిలిన చోటు నంతటిని స్పిరిట్ తో శుభ్రం చేసి బ్యాండ్ ఎయిడ్ వేసింది ..
గడియారం 3గం కొట్టింది ..
ముందు కాసేపు నిద్ర పోవాలి .. లేదంటే తెల్లారేసరికి నా మొహం చెప్పేస్తుంది రాత్రంతా నేను నిద్రపోలేదని .. భూపతి కి అనుమానం రాకూడదు .. ఏదేమయినా నా చేతల్ని గమనించమని ఎవరికో చెప్పే ఉంటాడు ..
సాధ్యమయినంత త్వరగా పరిస్థితులని చక్కబరచు కోవాలి .. అనుకొని డ్రెస్ మార్చుకుని నిద్ర కి ఉపక్రమించింది .
                             *************************************************

స్వామీ .. ఇంత వేళ దాటినా మీరింకా ధ్యానం లోనే ఉన్నారేంటి? అంటూ ప్రశ్నించాడు .. భోజనాన్ని కూడా స్వీకరించకుండా   అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం లో ఉన్న రమణా నంద మహర్షి ని శిష్యులలో ఒకరైన గోపాలస్వామి .
మెల్లిగా కనులు తెరిచి .. విలయం మనం నిద్రపోతే ఆగదు .. జాగరూకత తో ఉన్నా ఆగదు .. కాని భగవంతుడనే వాడు తలచుకుంటే .. ఎన్ని అద్భుతాల నైన సృష్టించ గలగుతాడు . అన్నాడు
అర్థం కాలేదు స్వామీ .. అన్నాడు గోపాల స్వామి .
ఆ తల్లి లీలను అర్థం చేసుకునే శక్తి నీకింకా రాలేదు నాయనా .. అన్నాడు మహర్షి .
స్వామీ .. ఆ జగత్జనని లీలను నేను అర్థం చేసుకోలేక పోయిన ఎవరో ఆపదలో ఉన్నారని .. వారికోసమే మీరింత వరకు ప్రార్థించి ఉంటారని ఊ హించగలను స్వామీ .. అన్నాడు గోపాలస్వామి .
స్వామీజీ చిరునవ్వు తో .. గోపాలం .. తెల్లవారగానే వర్ధనరావు భార్య గిరిజమ్మ కి ఆశ్రమానికి రమ్మని కబురు ప0పు ..అన్నారు స్వామీజీ ..
అలాగే స్వామీ .. స్వయం గా నేనే వెళ్లి ఆమె ని తోడ్కొని వస్తాను .. మీరిక విశ్రమించండి స్వామీ .అ ని అక్కడి నుంచి నిష్క్రమించాడు గోపాలస్వామి .

హే జగత్జననీ .. నీ బిడ్డ ని కాపాడావు తల్లీ .. నా  నమ్మకాన్ని ,పూజ ని అలక్ష్యం చేయలేదు నీవు .. అనుక్షణం ఆ బిడ్డ వెంట ఉండి కాపాడు తల్లీ .. అని ప్రార్థించాడు రామనానంద మహర్షి .
                                                                                                                                       (ఇంకా ఉంది )
No comments: