హే వనమాలీ ...దర్శ న మీయవ .... ధన్యను చేయగా రా కన్నయ్యా ..
కృష్ణ మురారీ .. పాప వినాశ ... నీదయ చూపగ రా కన్నయ్యా ...
మనసే బృందావని లా తోచి .. మురళీ లోలా నీకై వేచి ..
రాధే శ్యామా .. హే పరంధామా ... నీ రాకను కనులే వీక్షించే
వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...
రాధిక మదిలో విరహము రేపిన గోపాలునివీ నీవెనయ్యా...
కుచేలుని మూ ట లో అటుకులు సేవించి ధన్యుని చేసిన మిత్రునివయ్య..
రుక్మిణి ప్రేమని గెలిచి నవాడివి ... మనువాడిన తనవాడివి ....
దర్పంతోనయిన సత్యాదేవి నిను భ ర్త గ పొందిన వైనము తెలియదా ...
గొపికలెన్దరినొ నీ గానముతో మైమరపున నువ్వు ముంచెయలెద ...
గోవిందా ... హే గోపాల ... మరి నాపై నీకూ కినుకేలా ?2
వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...
తులసికి తూగిన ఓ నటలాల .... నా భక్తి కి తూ గవ ... ఓ విట లా...
ఆవులు కాసిన వేళ లో ఐనా ... నీ లీలలు చూపగ రాలెవా...
పరమార్థం తెలిపే గీతాబోధ ... వెలుగులు నింపిన నరకాసుర వధ
కొలిచితినయ్య నా మదితోడా .... నీ తపసే నాకూ తోడునీడ ...
కొండను ఎత్తిన పసివాడా ... నా గుండెలొ నిండిన చిన్మయుడా ...
నీవేనయ్యా నా ఆణువణువూ ... నాకోసం ఎందుకు రావూ ?2
వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ...
చెలువల చీరలు దోచినవాడే ... ద్రౌపది మానం కాచిన వాడే ...
మామని చంపిన అల్లుడు వాడే ...ధరణి కి భారము తీర్చిన వాడే
నల్లని రంగు ఆ మేని ఛాయా ... నీ హృదయము రంగు తెల్లనిదయ్య
నీ వేణువు లో గాలే పాటా ... మా మనుగడ నువ్వు ఆడే ఆటా ....
పరమానందము నీ పథ మంటా .... నీకై సాగే నా పదమంటా ....
నువు నడచిన నేల మధురేనయ్య .... నిను కొలిచిన మనసు మధువేనయ్య 2
వరమును ఈయరా గోకులబాల .... హే నందలాల చూపర లీల... హే వనమాలీ..
No comments:
Post a comment