Powered By Blogger

Monday, 2 December 2013

రుధిర సౌధం 15 (30 వ తేది తరువాయి భాగం )

                                 రుధిర సౌధం 
                                                                                              (30 వ తేది తరువాయి భాగం )

అక్కడంతా పాత సామాను ఉంది .. రెండు పుర్రెలు  .. వ్యక్తి చుట్ట తాగుతూ కనిపించాడు .. అతని తీరు విచిత్రం గా ఉంది .. లోపల కొంచెం చీకటి గా ఉండటం తో కొవ్వొత్తి వెలుగు లో ఏదో బొమ్మ గీస్తూ కనబడ్డాడు
అతని వంక ఆశ్చర్యం గా చూసింది రచన . ఎవరు నువ్వు ? మెల్లిగా గొంతు పెగల్చుకొని అంది రచన .. 
ఆమె గొంతు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగాడతను .. భయంకరం గా  ఉంది వాడి మొహం .. 
రచన వంక కూడా ఆశ్చర్యం గా చూసాడు
నన్నెవరని అడుగుతున్నావు ? నువ్వెవరు ? ఊరి దానవు కావు .. ఐతే ఇలా అడగవు .. నేనెవరో తెలియని వారున్నారా ఊరిలో ? అని భయంకరం గా నవ్వాడు
అతని వంక చిరాకుగా చూసి .. పుర్రెలేంటి ? పాత సామానేంటి ? వీటితో ఇక్కడ ఎం చేస్తున్నావు నువ్వు ?
అడిగింది రచన .. 
కొన్నేళ్ళు గా ఉంటున్నా ఇక్కడ ... బొమ్మలు గీస్తా .. పుర్రె చూపిస్తే .. వాడి బుర్ర ఎలా వుందో ఉహించి గీస్తా .. మళ్ళి భయంకరం గా నవ్వాడు .. 
ఇక్కడకి ఎవ్వరు రారని చెప్పారు .. ఈవూరి వాళ్ళంతా ఈ మహల్ గురించి కథలు కథలు గా 

చెబుతుంటే .. నువ్విక్కడ కొన్నేళ్ళు గా ఉన్నానని అంటున్నావు .. నువ్వు చెప్పేది నిజమేనా ? 

అనుమానం గా అడిగింది రచన .. 

హ హ్హా హ్హా .. గట్టిగా నవ్వాడు .. వాళ్ళు చెప్పే కథల్లో నేను ఒకడిని .. వాళ్ళు ఊ హించే ప్రమాదాల్లో 

నేను కూడా ఉంటాను ..  అన్నాడతను 

అసలు నువ్వెవరు ?? నీ పేరేంటి ? అడిగింది రచన 

తెలుసుకుంటావు .. అన్ని తెలుస్తాయి .. అందుకేగా వచ్చావు .. రుణానుబంధం లేకపోతె ఈ మహల్లో 

అడుగు పెట్టిన నువ్వెలా ప్రాణాలతో బయటపడతావు? అన్నాడతను . 

ఆశ్చర్యం తో నోట మాట రాలేదు రచన కి .. 

అతీత శక్తి ఉన్నదానవు .. కనుకనే ప్రాణాలతో బయట పడ్డావు .. కాని సాహసించకు ... అమావాస్య నీ 

నుదుట మృత్యుగీత రాయవచ్చు .. అపుడు నీ పుర్రె తో నేను బొమ్మ గీయలేను .. నా చేయి 

వణుకుతుంది .. అతని మాటల్లో ఎక్కడో కొంచెం ఆర్ద్రత . 

ఎం జరుగుతుంది అమావాస్య నాడు ? కాసింత ఆవేశం గా అడిగింది రచన 

అతను మళ్ళి వికటాట్ట హాసం చేసాడు .. 

ఎం జరుగుతుందా ? విలయం  విజ్రుమ్భిస్తుంది .. .. విధిరాత తిరగబడుతుంది...  ఆకాశం వికృతం గా

 నవ్వుతుంది .. మృత్యువు కళ్ళెదురుగా వస్తుంది .. కర్కశం గా అన్నాడతడు . 

ఐతే .. చూస్తాను .. అది ఎలా ఉంటుందో .. పంతం గా అంది రచన . 

కాలభైరవుడు తప్ప  వేరెవరు నిను రక్షించ ... అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు అతడు . 

పిచ్చివాడా? కాదు .. అతని మాటలు కొట్టి పారేయాల్సినవి కావు .. మరి .. వీటికోసం ఆలొచించనా .. 

నో .. ముందు తాళం చెవి వెతకాలి .. ఇంతకీ అద్దాల మంటపం .. ఎక్కడ ?అని చుట్టూ చూస్తున్న ఆమె 

కనులు ఓ చోట అప్రయత్నం గా నిలిచిపోయాయి.. 

ఆ మంటపం లోనే ఉన్న ఒక పాత పెట్టె .. దుమ్ము పట్టేసి ఉంది .. కాని దాని పైన ఉన్న అస్పష్ట చిత్రాలు 

.. ఇది ఆ పెట్టె .. అని పరుగున అక్కడికి వెళ్లి చూసింది .. పాత  తాళం కప్ప వేలాడుతూ ఉంది దానికి 
.. 
చుట్టూ చూసి అక్కడ కొవ్వొత్తి వెలిగించి ఉన్న రాతిని తీసి తాళం మీద రెండు దెబ్బలు వేసింది .. తాళం 

ఊ డి వచ్చింది .. ఉత్సాహం గా పెట్టె తెరచింది రచన .. ఏవేవో పాత వస్తువులు ,వస్త్రాలు ,వాటి కింద 

ఉన్న ఒక పెద్ద మైనపు ముద్ద .. దాన్ని తీసుకొని పెట్టె మూసివేసి .. వెలుగుతున్న కొవ్వొత్తి వద్దకి 

వచ్చి ఆ మంట మీద మైనపు ముద్దని ఉంచింది .. మెల్లగా కరుగుతోంది అది .. చేయి చురుక్కుమనే 

సరికి దానిని కింద పెట్టి కొవ్వొత్తి ని దాని మీద వేడి తగిలేలా అటు ఇటు తిప్పేసరికి ఒక అరగంట లో 

అంత మైనపు ముద్దా కరిగిపోయి లోపల ఉన్న తాళం చెవి బయట పడింది . 

దాన్ని చూడగానే అంతులేని ఆనందం కలిగింది రచన కి .. 

దాని ని భద్రం గా తన పాకెట్ లో దాచి మహల్ ముందు భాగం 

వైపు వచ్చింది . ఇప్పుడు ఆమె చేతిలో ఆ భవంతి సింహద్వారం

తెరవ గలిగే తాళం  చెవి ఉంది .. ఆలస్యం చేయటం ఇష్టం ఇష్టం లేనట్లు గా పరుగున సింహద్వారం చేరుకుంది రచన 
 ఏళ్ళ తరబడి మూయబడి ఉన్న ఆ భవంతి  సింహ ద్వారం తెరవ బడటానికి ఎదురు చూస్తున్నట్లు గా అనిపించింది రచన కి . 
.


                                                                                                                                                                                               (ఇంకా ఉంది )

No comments: