Powered By Blogger

Friday, 6 December 2013

రుధిర సౌధం 19


యశ్వంత్ .. అటు చూడు .. రామనంతపురం .. బోర్డు మీద రాసి ఉంది .. సత్య బిగ్గరగా అరచింది ..
నిజమే .. అన్నాడు శివ .
ఐతే మనం లక్ష్యానికి  గంట దూరం లో ఉన్నాము ..
కాని ఇప్పుడు సమయం 7 కావొస్తుంది .. చుట్టు పరిసరాలు చూసారా ఎలా ఉన్నాయో .. అసలు ఓ సారి బలేశ్వర్ గారితో మాట్లాడితే .. అన్నాడు మురారి ..
ఇక్కడ సిగ్నల్ ఉండదు మురారీ .. ఫోన్ చెక్ చేస్కో .. అన్నాడు డ్రైవ్ చేస్తూనే శివ .
ఆ విషయం కోసం ముందే మీకు చెప్పాను కదా .. అయినా సిగ్నల్ కట్ కాక మునుపే ఊరికి దగ్గరలో ఉన్నామని నేను బాస్  కయితే తెలియజేశాను .. అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ ఇక్కడ్నుంచి ఎటు వెళ్ళాలి ? అడిగాడు శివ ..
ఇక్కడ ఓ పక్క గా మట్టి రోడ్ ఉండాలి .. ఆ రోడ్ గుండా వెళితే రావణ పురం వస్తుంది .. అన్నాడు యశ్వంత్ .
సీ     దేర్ .. అని పక్కగా కనిపిస్తున్న మట్టి రోడ్ ని చూపించాడు మురారి .
ఎస్ .. అదే .. శివా .. అటు పోనీ .. అన్నాడు యశ్వంత్ ..
వారు ప్రయాణం చేస్తున్న కార్ టర్న్ తీసుకొని మట్టి రోడ్ లోకి మళ్ళింది ..
యశ్వంత్ .. ఇప్పుడు ఆ వూరు లో రచన గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది ? అంది సత్య వెనక సీట్లోంచి .
మనం వెళ్లేసరికి టైం 8 అవుతుంది .. అసలే పల్లెటూరు .. ఆపైన దెయ్యాలు ,భూతాలు .. భయం . సో .. మనం వెళ్ళేసరికే జనం ఎవరు ఆరు బయట ఉండక పోవొచ్చు .. అంతటా నిశ్శబ్దం .. గాఢ నిద్ర లో ఉంటారు .. మనం ఈ రాత్రి ఎవర్ని ఇబ్బంది పెట్టలేం .. అన్నాడు శివ .

అదీ నిజమే .. కానీ ఎవరైనా అందుబాటు లో ఉన్నాసరే మనం రచన కోసం అడగకూడదు .. అన్నాడు యశ్వంత్ .
అవును యశ్వంత్ .. అసలు రచన ఆ ఊరిలో ఎలా అప్రోచ్ అయిందో తెలీదు .. మనం రచన మన మనిషి అని చెప్పటం సబబు కాదు . అన్నాడు మురారి ..
యు అర్ కరెక్ట్ మురారీ .. సో మనం రచన కోసం వెతకడం గాని తనకోసం ఎవరిని వివరాలు అడగటం కానీ చేయలేం ..అన్నాడు యశ్వంత్ .
మరి రచన ని ఎలా కలుస్తాం ? ఆందోళన గా అడిగింది సత్య .
దానికి మనం ఏమి శ్రమ పడాల్సిన అవసరం లేదు అన్నాడు మురారి .
అవును .... అదే మన్నా పెద్ద సిటీ నా? రచన  గురించి మనకి తెలియకుండా ఉండటానికి .. చిన్న ఊరు .. తెలుసుకోవొచ్చు అన్నాడు శివ .
అంతే కాదు .. నా దగ్గర ఓ ఐడియా ఉంది .. మనం ముందు మహల్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేద్దాము .. ఎక్కడున్నా ఎంత రాత్రైనా రచన మహల్ దగ్గరికి వస్తుంది .. నాక నమ్మకం ఉంది అన్నాడు యశ్వంత్ .
ఒకె ..బట్ ఇప్పుడు ఊరిలో ఎలా అప్రోచ్ అవుతున్నాం ? అంది సత్య .
ఆర్కియాలజీ  డిపార్ట్మెంట్ అని చెప్తాం ఓకే .. అన్నాడు యశ్వంత్ .
కార్ వారి ఆలోచనల లాగే ముందుకు సాగిపోతోంది .
                                                             *******************
భోజనం ముగించి తన గదికి చేరుకుంది .. మనసెందుకో గజిబిజి గా ఉండటం నిస్పృహ గా మంచం మీద కూర్చుంది . వొళ్ళంతా పచ్చి నొప్పి గా ఉంది .. మనసు లో మీమాంస కొనసాగుతూనే ఉంది ..
ఆమె మంచం మీద వాలిపోయింది .. తలదిండు కూడా ఆలోచనలతో వేడెక్కిపోతోందని   అని పించింది ఆమె కి
 ఎందుకో ఓ క్షణం యశ్వంత్ గుర్తు కొచ్చాడు ఆమె కి . మనసు బాధ గా ఉన్నప్పుడు ఆమె మనస్థితి ని అర్థం చేసుకునే వాడు .. నవ్వించేవాడు .. "ఈరోజు .. నా మనసంతా గందరగోళం గా ఉంది యశ్వంత్ .. నువ్వుంటే బావుంటుందని పిస్తోంది .. ఈ పాటికి ఢిల్లీ నుండి వచ్చేసి వుంటావు .. నీ మాట వినలేదని నా మీద కోపం గా ఉండి ఉంటావు .. నన్ను బాగా తిట్టుకుంటున్నావేమో ... అందుకే గుర్తు కోస్తున్నావు .. " అనుకొంది రచన మనసులో . 
ఎందుకో యశ్వంత్ గురించి ఆలోచన ఆమె పెదవులపై సన్నని చిరునవ్వు ని తీసుకొచ్చింది . 

ఆ వెంటనే గిరిజ  గుర్తుకొచ్చింది .. ""అమ్మా !ఏం చేస్తున్నావో .. ?   బహుశా నా కోసమే ఆలోచిస్తూ ,బాధపడుతూ ఉండి ఉంటావు .. నాకంటే ఆలోచించడానికి నీకే విషయమూ లేదు . నేను మాత్రం నీ గురించి కాక మిగతా అన్ని
 విషయాల గురించి ఆలోచిస్తున్నాను .. కానీ నీ ఇష్టం లేకుండా నేనెందుకు ఇక్కడికి వచ్చింది నీకు త్వరలోనే తెలుస్తుంది . "" అనుకొంది మనసులో రచన . ఆలోచనలతోనే మెల్లిగా నిద్రలోకి జారుకుంది రచన . 

                                                                                                                                     (ఇంకా ఉంది )


  

No comments: