Powered By Blogger

Sunday, 8 December 2013

రుధిరసౌధం 20

గడియారం 12గం కొట్టింది .. ఉలిక్కి పడి లేచింది రచన  ..
తల బరువుగా అనిపించి విదిలించింది . అబ్బా !ఎందుకిలా హటాత్తుగా మెలకువ వచ్చింది .. అనుకొని మెల్లిగా లేచి బెడ్ పక్కన చిన్న టేబుల్ పై ఉన్న మంచి నీళ్ళ కూజా .. లో నీటిని గ్లాస్స్ లో పోసుకొని తాగింది . అంత అర్థరాత్రి ఎక్కడో దూరం గా వినిపిస్తోన్నకుక్కల అరుపు క్రమేపీ దగ్గరగా వినిపిస్తోంది . ఇదేంటి ఇంత ఎక్కువ గా అరుస్తున్నాయి ?? అనుకొని మంచి నీళ్ళ గ్లాస్ పక్కన పెట్టి దక్షిణాన ఉన్న కిటికీ తెరచి వీధి లోకి చూసింది ..
అలా చూసిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఖంగుతింది .
అక్కడ ఓ పది కుక్కలయినా ఉంటాయి .. మధ్య లో అతడు .. ఆ పిచ్చివాడు .. సూటిగా పైకి ,కిటికీ లోంచి చూస్తున్న రచన నే చూస్తున్నాడు . ఆ కుక్క లన్నీ అతడిని చూస్తూ అరుస్తున్నాయి ..
ఆమె కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి ..
ఇంత గోలగా ఉన్నా ఎవరూ లేవరేంటి ? అని ఓ మూల మనసు సందేహపడుతున్నా .. ఆమె అతడి వంక తీక్షణం గా చూసింది .. అతడి కళ్ళు ఆమె కి ఏదో చెబుతున్నట్లనిపించాయి .
అసహనం తో ఆమె కిటికీ తలుపులు మూసివేసింది . యితడు నన్ను ఫాలో అవుతున్నాడా ??నా చుట్టూ తిరుగుతున్నాడా ??నన్ను అనుక్షణం గమనిస్తున్నాడా ?? అనుమానం పెనుభూతమై ఆమె మనసుని కలచి వేస్తుంది ..
ఇంకా ఉండి ఉంటాడా ? వెళ్ళిపోయి ఉంటాడా ? మెల్లిగా తలుపు తెరిచి చూసింది .. అతడు లేడు .. కుక్కలూ లేవు ..
తలుపు పూర్తిగా తెరచి కొంచెం వంగి చూసింది .. వీధి చివర వరకూ కనబడుతుంది అలా చూస్తే .. కాని అతడు కనబడలేదు . ..
అంటే వెళ్ళిపోయాడా ... ఆమె మల్లి తలుపులు మూసి వచ్చి బెడ్ మీద కూర్చుంది .. గడియారం వంక చూసింది .. 12. 15 నిమిషాలు చూపిస్తుంది .
ఇతని గురించి నేను వేరే వాళ్ళని అడగటం కంటే అతడినే అడగటం మంచిది .. నా సందేహాలు అతనే నివృత్తి చేయగలడు .. ఇప్పుడు అతను మహల్ దగ్గరే ఉండొచ్చు .. వెళ్ళాలి .. ఇప్పుడే వెళ్ళాలి .. అని దిగ్గున లేచి పది నిమిషాలో డ్రెస్ మార్చుకొని కిటికీ గుండా కిందకి దిగి దక్షిణం వీధి లో ఉంది ..
మహల్ వంక నడక మొదలుపెట్టింది .. చల్లని గాలి సన్నగా వణికిస్తోంది .. చుట్టూ అలముకున్న చీకటి ఆమె ని కొంచెం కూడా భయానుభూతి ని కలగనివ్వటం లేదు .. ఊరి ని దాటి మెల్లిగా పైర్ల మధ్యలో నడుస్తుంది ఆమె ..
కాసేపట్లో మహల్ ని చేరుకుంది .. గేటు ని ముందుకు తోసింది .. సులువు గానే గేటు తెరచుకుంది . మెల్లిగా మహల్ లో తను ముందు అతనిని చూసిన మంటపం  కేసి నడిచింది ..
ఆమె ఊహ నిజమే .. అతడు మంటపం మొదటి మెట్టు పై కూర్చొని చుట్ట తాగుతున్నాడు ..
తను వచ్చినట్టు గా అతనికి తెలియడం కొంచెం గొంతు సవరించింది ..
ఆమె వంక చూడకుండానే అతడు భయానకం గా నవ్వాడు ..
రా .. నువ్వు వస్తావని తెలుసు .. నీకోసమే ఎదురు చూస్తున్నది నేను .. అన్నాడు .
ఓహ్ .. నీకు తెలుసు .. నీకు అన్ని తెలుసు .. కానీ నాకు తెలీదు .. నాకు తెలియాలి .. ఎవరు నువ్వు ? బంగ్లా దగ్గరకి ఎందుకు వచ్చావు ???? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు ? నేనేం చేసినా నీకెలా తెలిసిపోతోంది .. ఆవేశం గా అడిగింది రచన ..
అతడు మళ్ళి  వికటాట్టహాసం చేసాడు ..
చాలు .. గట్టిగా అరచింది ఆమె .. ఆమె గొంతు  ప్రతిధ్వనించింది ..
అతను నవ్వటం  ఆపేసాడు .. ఆమె వంక తీక్షణం గా చూసాడు ..
నువ్వీ రోజు నాకు జవాబులు   చెప్పి తీరవలసిందే .. స్థిరం గా అన్న దామె .
నువ్వే ఇలా అడిగే రోజు వస్తుందని అనుకోలేదు .. అతడు మెల్లిగా అన్నాడు .
ఆమె అతడి వంక సంశయం గా చూసింది ..
మనిషి కి భగవంతుడు కొన్ని  పరిమితులని విధించాడు .. మనిషి కూడా ఆ పరిమితుల లోనేజీవిస్తున్నాడు . కానీ దానికి  అర్ధం మనిషి ఆ పరిమితులని దాటలేడని కాదు .. నువ్వు  దాటడానికి ప్రయత్నించు .. నేనెవరో  నీకు తెలసి వస్తుంది .. అన్నాడు అతడు .
 ఆపు .. నాకు కావాల్సింది  వేదాంతం కాదు .. నిజం .. ఎవరు నువ్వు అన్న నిజం .. నీ  పేరు ఏంటి ?????????
కోపం గా ప్రశ్నించింది  ఆమె .
ఇతడెవరో కాదు     ... బసవరాజు .. .. గట్టిగా  అన్నాడు అతడు .
"బసవ రాజు"  అప్రయత్నం గా ఆమె కళ్ళలో తడి .. ఎక్కడో ఆ పేరు విన్నాట్టు .. ఏదో అనుబంధం తరుము  తున్నట్టు ..
అతడు ఆమె వంక దీనం గా చూసాడు .. చింత నిప్పుల్లాంటి ఆ కళ్ళలో ఏదో ఆర్ద్రత .
ఆమె అతడి  కళ్ళ లోని భావాలను చదవ టానికి ప్రయత్నిస్తుంది .. ..
ఆమె వంక దీనం గా చూస్తున్న  అతడి కళ్ళలో ఏదో తొట్రుపాటు ..
అతని చూపు ఆమెపై నుండి ఆమె వెనుక  కి మల్లటం  గమనించి0ది రచన ..
ఆమె వెనుక గా ఏదో అడుగుల చప్పుడు .. ఆమె వెనక్కి తిరగబోయే లోపుగానే  ఆమె భుజం మీద ఓ చెయ్యి పడింది .. ఓ  క్షణం ఆమె గుండెల్లో రైళ్ళు పరిగెట్టినట్లు అయింది ...

(ఇంకా ఉంది )   No comments: