Powered By Blogger

Tuesday, 10 December 2013

రుధిరసౌధం 21 


ఆమె గుండె శరవేగం గా కొట్టుకుంటున్న మెల్లిగా చూపుల్ని ఓరకంట తన భుజం మీద పడ్డ చేతి మీద నిలిపింది . ఆ చేతివేళ్లు ఆమె కి సుపరిచితం అనిపించి వెంటనే వెనక్కి తిరిగి చూసింది ..
ఆమె కళ్ళు ఆనందాశ్చర్యాలతో మెరిసాయి .. పెదవులు విచ్చుకున్నాయి ..
యశ్వంత్ నువ్వా? కళ్ళింత చేసి అన్నదామె ..
చిరునవ్వు తో తలాడించి .. ఎలా ఉన్నావు రా ? అన్నాడు ఆప్యాయం గా ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ .
నేను ఓకే .. కానీ నువ్వేంటి ఇక్కడ ? అంది ఆమె సంభ్రమాశ్చర్యాలతో ..
నీకోసమే వచ్చాను .. నా మాట వినకుండా నువ్వోచ్చేసావు .. నీకేం జరుగుతుందో అని భయమేసింది .. వెంటనే బయల్దేరి వచ్చేసాను .. అన్నాడు యశ్వంత్ .
అంటే .. నామీద నీకు నమ్మకం లేదా ? నేనీ టాస్క్ ఒంటరిగా చేయలేననుకున్నావా ? ఆమె ముఖం లో సంతోషం మాయమై చిరుకోపం తొణికిసలాడుతోంది ..
మళ్ళి మొదలుపెట్టావా ఈ చిర్రుబుర్రులు ? నమ్మకం లేక కాదు నీ మీద ప్రేమ ఎక్కువై వచ్చాను .. అందులో ఇది పల్లెటూరు .. సెల్ ఫోన్స్,బలేశ్వర్ డిస్టర్బ్ చేయని ప్లేస్ కాదా ? అందుకే నీతో హాయిగా గడిపే ఈ కొన్ని రోజులని జీవితం లో ఎందుకు మిస్ చేసుకోవాలి ? అందుకే వచ్చేసా .. అన్నాడు చిలిపి గా ఆమె ముక్కు మీద చిటిక వేస్తూ ..

ఆహా ! అలాగా ! ఐతే వెంటనే తమరు దయచేయండి . నాకిక్కడ పని ఉంది .. పనే ముఖ్యం నాకు .. అంది తమాషా గా ..
చిన్నగా నవ్వి .. అది సరే .. ఇంతకీ ఇక్కడ నీలో నువ్వే మాట్లాడుకుంటుంటే చూసాను . ..... ఎవరితో మాట్లాడుతున్నావు ? అడిగాడు యశ్వంత్ ..
యశ్వంత్ ని చూసిన సందడి లో తానంత వరకు బసవరాజు తో మాట్లాడుతున్న సంగతే మర్చిపోయింది రచన .
ఓహ్ .. అదీ .. ఈయన బసవ రాజు .. అని వెనక్కి తిరిగిన రచన కి ఆశ్చర్యం తో మాటరాలేదు .. అక్కడ ఎవరు లేరు .రచనా ? ఏమైంది ? ఎవరితో మాట్లాడుతున్నావంటే అలా వెనక్కి తిరిగి ఎం చూస్తున్నావు ? ఆమె భుజం మీద చేయి వేసి తనవైపు తిప్పుకుంటూ అడిగాడు యశ్వంత్ .
యశ్వంత్ .. నువ్వు నన్ను చూసినప్పుడు నేనొక్కదాన్నే కనిపించానా నీకు ?? అని అడిగింది రచన అతని కళ్ళలోకి చూస్తూ .
అవును .. అన్నాడతను .
ఆశ్చర్యం గా ఉందే .. అంటే రత్నంరాజు చెప్పింది నిజమేనన్న మాట .. అంది రచన .
ఇందాక బసవరాజన్నావు .. ఇప్పుడు రత్నంరాజు అంటున్నావు .. అసలెంత మంది రాజులు ఉన్నారు ఈ కోట లో ?అన్నాడు యశ్వంత్ .
అదికాదు యశ్వంత్ .. అసలు ఏమైందంటే ... అని ఆమె ఏదో చెప్పబోయేలోగా .. ఆమె పెదవులపై తన చేయిని అడ్డం గా పెట్టి .. ఇక్కడ కాదు .. ముందు ఇక్కడనుంచి వెళ్దాం పద .. అని ఆమె భుజం పై చేయి వేసి ముందుకి నడిపించాడు యశ్వంత్
ఆమె ఆశ్చర్యం గా వెనక్కి చూస్తూనే యశ్వంత్ తో ముందుకి నడిచింది ..
అతడు సరాసరి టెంట్స్ వేసున్నవైపు తీసుకు వెళ్ళాడు ..
ఇక్కడ 2 టెంట్స్ ఉన్నాయి .. ఇంకా ఎవరెవరు వచ్చారు ? ఆ టెంట్స్ వంక చూస్తూ అడిగింది రచన .
ఆమె వైపు చిరునవ్వుతో చూసి .. టెంట్స్ వైపు చూపు తిప్పి శివా ... అని పిలిచాడు యశ్వంత్ .
టెంట్ నుంచి శివ బయటికి వచ్చి .. హే రచనా .. ఎలా ఉన్నావు ? అని ఆప్యాయం గా అడిగి .. సత్యా .. మురారీ .. యశ్వంత్ రచనని తీసుకు వచ్చాడు .. అని అరిచాడు .
సత్య ,మురారి కూడా టెంట్ నుంచి బయటికి వచ్చారు ..
పరస్పర పలకరింపులు అయినాక టెంట్స్ ముందు ఒక నెగడు వేసుకుని దాని చుట్టూ కూర్చున్నారు మిత్ర బృందమంతా ..
ఇప్పుడు చెప్పు రచనా .. ఏమైంది నువ్వోచ్చిన ఈ 3 రోజుల్లో ఏమేం చూసావు ? ఈ వూరు ,దాని పరిస్థితులు అన్ని వివరం గా చెప్పు .. అప్పుడే మనం అందరం కలసి ఈ కేసు ని సాల్వ్ చేయగలుగుతాం .. అన్నాడు యశ్వంత్
అన్ని చెప్తాను .. ఈ వూరు నిజం గా చాల మంచి ఊరు .. ప్రజలు అమాయకులు .. అంతా బాగానే ఉంది .. కానీ భూపతి అనే పెద్ద మనిషి పాదాల కింద నలగిపోతున్నారు .. ఈ ఊరికి ఇంత వరకు ఎటువంటి సదుపాయాలూ  కలగక పోవటానికి కారణం కొంత ఈ రాణి మహల్ ఐతే .. మరి కొంత ఆ భూపతి దౌర్జన్యం .. ఇకపోతే మహల్ విషయానికి వస్తే .. ఈ మహల్ లో ఎవరో మనుషులు ఏదో  చేస్తున్నారో ... లేకా ఇంకేదో .. నాకు తెలియడం లేదు కాని నేనీ మహల్ లో చాలా విచిత్ర పరిస్థితులని ఫేస్ చేశాను .. ఇంతకు ముందు కూడా నేను ఒక వ్యక్తి తో మహల్  దగ్గర మాట్లాడుతున్నాను .. కానీ అతను వేరెవరికీ కనబడటం లేదు .. అంది రచన సాలోచన గా .
అంటే .... .... ?కనబడటం లేదు అంటే ??? అంది సత్య ఉత్సుకత గా
అంటే ... అతను నాకు తప్ప వేరే ఎవరికీ కనిపించటం లేదు .. యశ్వంత్ రాక ముందు వరకు నేనతనితోనే మాట్లాడు తున్నా .. కానీ అతడు యశ్వంత్ కి కనిపించ లేదని యశ్వంత్ అంటున్నాడు . అంది రచన .

(ఇంకా ఉంది )

No comments: