Powered By Blogger

Wednesday, 11 December 2013

రుధిర సౌధం 22

నిజమా యశ్వంత్ ? అడిగాడు మురారి ఆసక్తి గా .
మీరంతా నిద్రపోతున్నారు కదా .. నాకైతే రచన రాలేదేంటా అన్న ఆలోచన తో నిద్ర పట్టలేదు .. ఇంతలో గట్టిగా ఏవేవో మాటలు వినిపించాయి .. అనుమానం వచ్చి గేటు తెరుచుకుని మహల్ దగ్గరకు వెళ్లి చూ స్తే నాకు రచన ఎవరితోనో మాట్లాడుతున్నట్లు కనబడింది .. ఎవరితో .. అని చూస్తే అక్కడెవరు లేరు .. అన్నాడు యశ్వంత్ .
చాల ఇంటరెస్టింగ్ గా ఉంది .. కానీ ఇది పొరపాటు కూడా కావొచ్చు .. యశ్వంత్ ని చూసి అతడు పారిపోయి ఉండొచ్చు .. అన్నాడు శివ .
అలానే అనుకుందాం .. కానీ ఇది రెండో సారి .. నాకిలాంటి అనుభవం ఎదురవటం .. అసలు మీకు అర్థం కావాలంటే అన్ని మీకు వివరం గా చెప్పాలి .. అని తను ఆ ఊరు వచ్చి నప్పటి నుండి ఎదురైన ప్రతి సంఘటన పూసగుచ్చినట్లు వివరించింది రచన .
అంతా విన్నాక అక్కడ కాసేపు నిశ్శబ్దం రాజ్య మేలింది ..
ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఒకటుంది .. అంది సత్య ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ ..
ఏంటి ? అన్నారు అంతా ఒకేసారి .
అసలు అతడు .. అదే .. ఆ బసవరాజు రచన కి మాత్రమె ఎందుకు కనబడుతున్నాడు ? అ0ది సత్య .
అవును .. ఆ ప్రశ్నే కాదు మరో ప్రశ్నకి కూడా జవాబు దొరకాలి .. మహల్ ద్వారాన్ని తెరిచానంటోంది రచన .. మరి ఆ తాళం చెవి ఏమైంది ? ఎందుకంటే మహల్ ద్వారానికి ఇప్పటికి తాళం వేసేఉంది . అన్నాడు యశ్వంత్ .
నిజమే .. తాళం వేసిఉందంటే బసవరాజు తాళం వేశాడని అర్థం చేసుకోవాలా ? లేదా ఇదంతా భ్రమా ? అన్నాడు మురారి .
భ్రమ కాదు మురారీ .. నిజమే కానీ కొన్నింటికి నేను సమాధానాలు చెప్పలేకపోతున్నాను .. తాళం చెవి ఐతే ఆ బసవరాజు దగ్గరే ఉండాలి .. అంది రచన .
అది నిజమయితే ముందీ బసవరాజు నిజమో కాదో తెలియాలి అన్నాడు శివ ..
అంటే మీరెవరు నా మాట నిజమని నమ్మటం లేదా ? ఆవేశం గా అంది రచన .
అదే0 కాదు రచనా .. కానీ   కొన్ని ప్రశ్నలకి జవాబులు దొరికితే గానీ ఏదీ నిర్ణయిన్చుకోలెం .. అయినా మన వృత్తే అది కదా .. ప్రతిదానినీ అనుమాన కోణం లోనే చూడటం .. అన్నాడు శివ .
ఏదేమయినా కావొచ్చు .. కానీ నేను చెప్పే ప్రతి మాటా నిజం . మీకు సాక్ష్యం చూపించనా .. ఆ వలయాలు నామీదకి వచ్చినపుడు నాకు తగిలిన దెబ్బ ఇది .. అని తన మోజేతికి తగిలిన దెబ్బ ని చూపించింది రచన .
హే .. ఏంటిది ? నువ్వలా నిరుపించుకోవాల్సిన అవసరం ఎం లేదు ? గట్టిగా తగిలిందా ? ఆప్యాయం గా ఆమె చేతి మీద దెబ్బ ని పరిశీలించి చూస్తూ అన్నాడు యశ్వంత్ .
ఇప్పుడు మనం ఈ ఊరిలో ఎలా అప్రోచ్  అవ్వాలి అన్న విషయం గురించి ఆలోచించాలి .. సో రచన ఇక్కడ ధాత్రి .. మనకేమి పరిచయం లేదు .. అంది సత్య .
ఈ ఊరికి ఎవరు కొత్త గా వచ్చినా భూపతి కి తెలియాల్సిందే .. సో భూపతి మీతో తప్పనిసరి గా మాట్లాడుతాడు .. అంది రచన ..
అవును .. నువ్వు భూపతి వాళ్ళింట్లోనే ఉండు .. నీకైతే ఆ రత్నంరాజు వల్ల ఏం ప్రాబ్లం లేదు కదా .. అన్నాడు యశ్వంత్ ..
లేదు .. వాడికి అమ్మాయిల పిచ్చి ఉన్నమాట నిజమే గానీ నన్ను  నేను  కాపాడుకోగలను .. అంది రచన
ఐతే సరే .. ధాత్రి ఎవరో మనకి తెలీదు ,, మనమైతే పురాతన  భవనాలపై రీసెర్చ్ చేయటానికి వచ్చాము .. ఇదిగో ఈ మహల్ ముందే ఉంటాము .. ఓకే గైస్ .. అన్నాడు యశ్వంత్ .
సరే .. టైం మెల్లిగా 3. 30 అవుతోంది మరి కాసేపట్లో తెల్లారిపోతుంది .. నేను బయల్దేరతాను .. లేదంటే భూపతికి అనుమానం వస్తుంది .. అంది రచన .
సరే .. నన్ను డ్రాప్ చేయమంటావా ? అన్నాడు యశ్వంత్ .
వద్దు యశ్వంత్ నేను వెళ్ళగలను .. మీరు ప్రయాణం చేసి అల్సిపోయుంటారు .. రెస్ట్ తీసుకోండి .. రేపు ఉదయం మిమ్మల్ని ఎలాగైనా కలవటానికి ట్రై చేస్తాను అని కూర్చున్న చోటి నుండి లేచింది రచన .
సరే బాయ్ .. అన్నారు శివ ,మురారి , సత్య .
నేను కాస్త దూరమయిన నీతో వస్తాను రచన అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ .. నువ్వు నిద్రపో .. నేను వెళ్తాను .. ఏం ఫర్వాలేదు అని ముందుకి కదిలింది రచన .
(ఇంకా ఉంది)

No comments: