Powered By Blogger

Saturday, 14 December 2013

రుధిర సౌధం 25

భూపతి అలా వెళ్ళగానే నిశ్చింత గా వూపిరి పీల్చుకొని" ధాత్రీ .. నాన్న గారు ఏం మాట్లాడినా కాస్త కటువు గా  అనిపిస్తుంది .. నువ్వేం పట్టించుకోకు .. " అన్నాడు రత్నం .
చిన్నగా నవ్వి .. అలాగే .. అంది రచన.
ఈరోజు  ఏంటి ? ఊ రిలో అంతా ఈ రోజు బయటికి కూడా అంతగా రారు .. ఇంట్లోనే ఉండటం మంచిదేమో .. అన్నాడు రత్నం .
 నేనలా ఉండలేను .. నాకు బోర్ కొడుతుంది .. ఇంతకీ ఈ ఊరికి కొత్తగా వచ్చిన్దెవరు ?తెలియనట్టు అడిగింది రచన .
ఆ .. నలుగురు ఏవో పురాతన భవనాలు ,పరిశోదన ఏవేవో చెప్పారులే .. మన ఇల్లే ఈ వెనకవీధి లో ఒక టి ఉంది ..
వాళ్ళను నాన్న గారు అందులో ఉండమన్నారు ... నువ్వెలాగు బోర్ కొడుతుంది అంటున్నావు కదా .. పోనీ మనం ఓ సారి వాళ్ళని పలకరించి వద్దామా ?అన్నాడు రత్నం .
నాట్ బాడ్ రాజు గారూ .. సరే పదండి వెళ్దాం .. అంది రచన .
ఇద్దరూ టిఫిన్స్  ముగించారు ..
కాని వాళ్ళిప్పుడు ఇంట్లోనే ఉండుంటారా ? ఇంతకూ ముందు బాలయ్య మహల్ దగ్గరికి వెళ్ళారని చెప్పాడు కదా .. అంది రచన .
నిజమే .. కాసేపు తరవాత వెళ్దాం .. అన్నాడు రత్నం .
ఎందుకు ? ఇప్పుడే వెళ్దాం .. వాళ్ళంతా మహల్ దగ్గరే ఉన్నారు కదా .. అంత మంది ఉన్నప్పుడు మనిద్దరం కూడా ధైర్యం గా వెల్లొచ్చు అంది రచన .
వద్దొద్దు .. నీకు తెలీదు ఆ మహల్ గురించి .. వాళ్ళు ఇంటికి రానీ వెళ్దాం .. అన్నాడు భయం గా .
సరే సరే .. అని నవ్వింది రచన .
అన్నట్టు చెప్పడం మరిచా ధాత్రీ .. .. నేను ఒక 2 రోజులు పక్క ఊరికి వెళ్తున్నాను .. నాన్న గారు వెళ్ళమన్నారు .. కాస్త నీరసం గా అన్నాడు రత్నం .
పక్క ఊరు అంటున్నారు .. 2రోజులేందుకు ? అంది రచన .
అక్కడ మాకు పొలాలు  ఉన్నాయిలే .. పని ఉంది .. అన్నాడు రత్నం
ఓహ్ అంది రచన ..
నువ్ జాగ్రత్త గా ఉండు .. నాన్నగారితో వాదిన్చకేం ? అన్నాడు రత్నం ..
ఆమె చిన్నగా నవ్వి  ష్యూర్ .. అంది
మరైతే నేను కొంచెం   రెస్ట్ తీసుకుంటాను .. అంది రచన .
అలాగే .. అన్నాడు రత్నం .
                                                                       **********
భూపతి  ఏర్పాటు చేసిన వసతి గృహం లో తమ సామానంతా సర్దుకున్నారు యశ్వంత్ బృందం .
యశ్వంత్ ..  ఈ ఇల్లు కూడా బాగా పాతదే కదూ .. అయినా చాలా బావుంది .. అన్నాడు శివ ..  చుట్టూ గమనిస్తూ ..
అవునని తల పంకించాడు .. యశ్వంత్ ..
ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది ..
ఇప్పుడే వచ్చాం .. అప్పుడే అతిథులా .. అన్నాడు శివ ఆశ్చర్యం గా ..
రచన ఏమో .. అని వెళ్లి తలుపు తీసాడు యశ్వంత్ ..
ఒక ముప్పయ్యేళ్ళ వ్యక్తి .. చిరునవ్వు తో నిలబడి ఉన్నాడు ..
మీరు ... అన్నాడు యశ్వంత్ సందేహం గా .
నేను భూపతి గారి అబ్బాయి ని .. మీతో పరిచయం చేసుకుందామని వచ్చాను .. అన్నాడు అతను .
ఓహ్ .. వీడేనా రచన చెప్పిన రత్నం గాడు .. అని మనసులో అనుకొని ఓహ్ .. రండి అని గుమ్మానికి అడ్డు తోలిగాడు యశ్వంత్ .
నేను నా స్నేహితురాలిని కూడా తీసుకొచ్చాను .. అని వెనక్కి తిరిగి ధాత్రీ .. అని పిలిచాడు రత్నం .
రచన చిరునవ్వు తో వచ్చి నిలబడింది ..
యశ్వంత్ ఆమె వంక చిలిపి గా చూసాడు ..
రండి ... అని లోపలి కి నడిచాడు యశ్వంత్ .. తన వెనుక ఇద్దరూ లోపలికి వచ్చారు ..

శివ వీళ్ళని చూసి రత్నం వంక ప్రశ్నార్థకం గా చూసి వెంటనే యశ్వంత్ వంక చూసాడు ..
 మీకిక్కడ అంతా బావుంది కదా .. అని అక్కడున్న చైర్ లో కూర్చొని .. రచన ని కూర్చోమని సైగ చేసాడు రత్నం .
హా .. బాగానే ఉంది .. అని ఈమె .. పట్నం అమ్మాయిలా ఉంది అన్నాడు యశ్వంత్ .
హా .. తను నా ఫ్రెండ్ .. పేరు ధాత్రి .. తనది బొంబాయి .. హిందూ పేపర్ లో పనిచేస్తుంది .. వరసగా చెప్పేసాడు రత్నం .
మేము మా గురించి చెప్పేసాము .. మీరు మీ పేర్లయినా చెప్పలేదే .. అంది రచన కాస్త సాగదీస్తూ ..
ఓహ్ .. నిజమే సుమండీ ధాత్రి గారు .. అని నా పేరు యశ్వంత్ .. వీడి పేరు శివ .. ఇంకా మరో ఇద్దరు మాతో ఉన్నారు .. వాళ్ళు మురారి ,సత్య . ... అన్నాడు యశ్వంత్ .
ఓహో .. మరి వాళ్ళు కనబడటంలేదేం .. అంది రచన .
ధాత్రి గారు .. ఇప్పుడే కదండీ మేమీ ఇంట్లోకి వచ్చింది .. స్నానాలు ముగించాలి .. టిఫిన్ లు లాగించాలి .. ఆకలి గా ఉండదా .. వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు .. అన్నాడు యశ్వంత్ .
చిరుకోపం గా చూసింది ధాత్రీ (రచన )
(ఇంకా ఉంది ) 

No comments: