Powered By Blogger

Tuesday, 17 December 2013

రుధిర సౌధం 26అయ్యో .. మీరు టిఫిన్స్ చేయలేదా .. ఒక్క నిమిషం .. నేను మీకోసం టిఫిన్ తెప్పిస్తాను ..   పక్కనే చిన్న హోటలు ఉంది .. అని ధాత్రీ .. నువ్వు కాసేపు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు .. ఇప్పుడే వస్తాను .. అని ఉన్న పళం గా లేచి వీరు వారించే లోపే గుమ్మం దాటేసాడు రత్నం .
ఎం కంగారు రా బాబూ .. అని చెప్పండి ధాత్రి గారూ .. అన్నాడు యశ్వంత్ .
ఇంక చాలు యశ్వంత్ .. రత్నం లేడు కదా .. ఇక నీ ఓవర్ ఏక్షన్ తగ్గించు .. అంది రచన .
ధాత్రి నుంచి రచన లోకి వచ్చేసావా ? ఇంతకీ టిఫిన్ చేశావా ? అన్నాడు యశ్వంత్ .
చేశా గానీ .. యశ్వంత్ .. నువ్వొచ్చినపుడు అమ్మ ని కలిసావా ? ఆత్రం గా అడిగింది రచన .
.. అని తల ఊపి .. నువ్వు ఆవిడని ఎప్పుడు టెన్సన్ పెడతావు గా .. వెళ్లి కలిసాను .. నీకోసం ఎంతో బెంగ గా ఉన్నారు .. అన్నాడు యశ్వంత్ .
బాధ గా తలదించుకొ0ది రచన
హే .. ఎందుకలా ముఖం మాడ్చేసుకున్నావు ?నేను ఇక్కడికి వస్తున్నానని అనగానే .. ఎగిరి గెంతెసారు .. మా అమ్మాయి కి ఎలాగు నువ్వే బాడి గార్డ్ వి .. నువ్వుంటే ఇంకేం టెన్షన్ లేదు నాకు అన్నారు .. అన్నాడు తమాషాగా
చేతులు తిప్పుతూ యశ్వంత్ ..
చిన్నగా నవ్వి .. చూసావా శివా యశ్వంత్ ఎంత ఓవర్ ఏక్షన్ చేస్తున్నాడో .. అంది శివ వంక చూసి .
శివ నవ్వి .. నీకోసం యశ్వంత్ ఎంత టెన్షన్ పడ్డాడో నీకు తెలియదు రచనా .. నువ్విక్కడకి వచ్చావని తెలియగానే తనకి నిద్రలేకుండా పోయింది .. అన్నాడు శివ .
అతని మాటలు విన్న రచన హృదయం ద్రవించి పోయింది .. యశ్వంత్ కళ్ళలోకి ఆరాధన గా చూసింది ..
అతడు ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు .
ఇంతకీ అతను రత్నం రాజేనా ? అడిగాడు శివ .
అవునన్నట్లు తల పంకించి .. ఇప్పుడు టిఫిన్ లే కాదు మధ్యాహ్నం భోజనాలు కూడా భూపతి ఇంటి నుండే వస్తాయి .. అంది రచన .
వెరీ గుడ్ ఆతిథ్యం బాగానే ఉంది .. కానీ నిన్ను ఇంట్లో ఉంచాడు .. మమ్మల్ని మాత్రం వేరే ఇంటిలో పెట్టాడు .. అన్నాడు యశ్వంత్ .

అంత ఫీల్ అవకు యశ్వంత్ .. నెక్స్ట్ నా గది ఇటు వైపే   ఉంటుంది యశ్వంత్ .. ఇలా రండి చూపిస్తాను .. అని .. గుమ్మానికి ఇరువైపులా ఉన్న కిటికీ లలోఒకదాన్ని తెరచి భూపతి బంగ్లా చూపించి .. అదే భూపతి బంగ్లా .. తెలుసు కదా .. అంది .
కిటికీ లోంచి తొంగి చూస్తూ అవును అన్నారు శివ, యశ్వంత్
మొదటి అంతస్తు వైపు చూడండి .. చివరన ఉన్న కిటికీ ఉంది కదా .. అది నా గది కిటికీ నే .. కిటికీ పక్క ఉన్న పైపు గుండా కిందికి దిగి రాత్రుళ్ళు మహల్ దగ్గరకి వెళ్ళేదాన్ని .. అంది రచన .
ఓహ్ .. సో కిటికీ నుంచి నువ్ చూస్తే ఇల్లు కనిపిస్తుంది .. గుడ్ ఇదీ .. బాగానే ఉంది .. అన్నాడు యశ్వంత్ .
యష్ .. ఇంతకీ ఈరోజు మనం మహల్ దగ్గరికి వెళ్తున్నామా లేదా ?అన్నాడు శివ .
లేదు శివా .. ఈరోజు వద్దు .. మనం రేపట్నించి  మొదలు పెడదాం .. అన్నాడు యశ్వంత్ .
హాయ్ రచనా .. అంటూ వెనక నుంచి మురారి పలకరించాడు .
హాయ్ మురారి .. అని     పలకరించి ఇక్కడ నేను ధాత్రి .. అంది మెల్లిగా .
చిన్నగా నవ్వి ఎవ్వరూ లేరు కదా ఇక్కడ .. అన్నాడు మురారి .
రచన రత్నం తో వచ్చింది మురారి .. అతడు బయటికి వెళ్ళాడు .. క్షణం లోనైనా రావొచ్చు మళ్ళి .. అన్నాడు శివ .
ఓహ్ .. అని యశ్వంత్ మహల్ దగ్గరికి  ఎందుకు  వద్దంటు న్నావు ? ప్రతి అమావాస్య కె కదా ఇక్కడ హత్యలు జరిగేది .. ఈరోజు మనం వెళ్తే కదా మనకా నిజం తెలిసేది ?అన్నాడు మురారి .
లేదు మురారీ .. ముందు మహల్ లోకి వెళ్ళాలి .. అంతా పరికించి చూడాలి .. దీనికి కొన్ని రోజులు పడుతుంది .. అదే ఈరోజే మనం వెళ్తే రహస్యం బట్టబయలు చేసే ప్రయత్నం లో మనలో ఎవరన్నా ప్రమాదం లో పడొచ్చు .. అన్నాడు యశ్వంత్ ..
అందరూ నిశ్శబ్దం గా తల లూపారు.. 
ఇంతలో టిఫిన్స్   ఒక పని వాడి తో పాటు వచ్చాడు .. రత్నం 
రత్నం ,ధాత్రి లతో మాట్లాడుతూనే టిఫిన్స్ కానిచ్చారు యశ్వంత్ బృందం . 
ఆ కొద్ది సేపట్లోనే రత్నం అమాయకత్వం నచ్చింది వాళ్లకి .. అతను భూపతి లాంటి వాడు కాదని మనసులో అర్థం చేసుకున్నారు .. 
(ఇంకా ఉంది)

No comments: