Powered By Blogger

Friday, 20 December 2013

రుధిర సౌధం 29అంతే కాదు .. మన ప్రాచీన కాలం నాటి మునుల తెలివితేటలు సామాన్య మైనవెమ్ కావు .. హనుమాన్ చాలీసా లో భూమి కి సూర్యునికి మధ్య దూరం మన సైంటిస్ట్లు లు కనుగొనక ముందే తెలపబడింది .. మనం వెనక బడినా ఇతర దేశాలు మన భగవద్గీత లో అన్ని నిజాలే చెప్పబడ్డాయని ఒప్పుకున్నాయి ..కానీ మనమే ఇంకా డైలమా లోనే ఉన్నాము .. అంది రచన .
ఐతే ఇప్పుడు మనం పోరాడాల్సింది మనిషి తో కాదు ఓ ఆత్మా ? అడిగాడు మురారి .
మురారి .. మనం పోరాడాల్సింది ఆత్మ తోనా మనిషి తోనా అన్నది ముఖ్యం కాదు .. మనం పోరాడాల్సింది ఓ సమస్య తో .. అంతే . కాకపొతే .. ఇప్పుడు రత్నం చెప్పిందంతా నిజమయే ఉంటుందని నేనూ చెప్పలేను .. బట్ అన్ని రకాలు గానూ మనం సిద్ధం గా ఉండాలి .. అన్నాడు యష్ .
ఒక మనిషి తో పోరాడాలంటే మన దగ్గర భుజ బలం ఉంది .. గన్స్ కూడా ఉన్నాయి .. కానీ ఓ ఆత్మ ని ఎదురించాలంటే ఏమి ఉండాలి ? అన్నాడు శివ .
బుద్ధి బలం , మానసిక స్థైర్యం , అన్నింటిని మించి దైవ బలం .. అంది రచన .
కానీ రచన .. నాకెందుకో మనం ఈ విషయం లో సరిగ్గా ఆలోచించలేదని పిస్తుంది .. కేవలం ఒక్కరు కూడా ఆ మహల్ కి వెళ్లి బతకలేదని అంటున్నారు కదా .. మరి అలాంటప్పుడు నీకేం కాలేదు .. నువ్వు ఇప్పుడు మా మధ్యే ఉన్నావు .. మరి అలాంటప్పుడు అక్కడ ఏ సమస్యా లేక పోయి కూడా ఉండొచ్చు కదా .. అంది సత్య .
సమస్య ఉందా లేదా అన్నది తెలియాలంటే మనం ఈరోజు మహల్ కి వెళ్లి తీరాలి యశ్వంత్ . మనం కనుక అక్కడ ఏ సమస్య లేదని నిరూపించ గలిగితే ఈ వూరి ప్రజల భవిష్యత్తే మారిపోతుంది .. .. అన్నాడు మురారి .
అవును .. నిజం గా ఆలోచిస్తే నాకూ మనం ఓ సారి మహల్ కి వెళ్ళటం మంచిది అనిపిస్తుంది . అన్నాడు శివ .
కానీ ఈరోజు మనం మహల్ కి ఎలా వెళ్తాం? ఈ వూరిలో ఎవరు చూసిన .. మనల్ని వెళ్ళనివ్వరు కదా .. అంది సత్య యశ్వంత్ మనం ఐదుగురం ఉన్నాము .. ఏ పరిస్థితి నయినా సరే ఎదుర్కొందాం .. మహల్ కి వెళ్దాం .. అంది రచన .
సరే ఐతే .. మీ అందరు వెళ్దాం అంటే నేనెలా వద్దంటాను ? ఈరోజే మన ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం .. కానీ మన ఆపరేషన్ కి ఏమని పేరు  పెడదాం ? అన్నాడు యశ్వంత్ .
నేను మహల్ లోకి వెళ్ళిన వెంటనే రుధిర ధారల్ని చూసాను ..ఎంతో మంది రక్తం కళ్ళ జూసిన ఆ మహల్ ని రక్తానికి సంభందించిన పేరే పెట్టాలి .. అంది రచన
సరే రక్తం అంటే రుధిరం .. మరి మహల్ ని ... అని యశ్వంత్  ఆలోచిస్తుండగా .. శివ అన్నాడు .. సౌధం .. అంటే ?అని
ఓహ్ వేరి నైస్ శివా .. నేటి నుంచి మన ఆపరేషన్ పేరు "రుధిర సౌధం " నువ్వు లాప్ టాప్ లో నోట్ చెయ్ సత్యా అన్నాడు యశ్వంత్ .

ఎస్ బాస్ అంది సత్య చిరునవ్వు తో .
సో .. ఐతే ఈరోజే మనం ఆ రుధిర సౌధం లోకి వెళ్తున్నాం ..  వైజయంతి కి హాయ్ చెబుతున్నాం .. అన్నాడు మురారి .
ఎస్ .. ఆ యువరాణి ని  కలవాలని అంత ఆత్రం గా ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు .. అన్నాడు శివ .
ఇప్పుడైతే భోజనం చేద్దాం ..  రాత్రి ఊరంతా నిశ్శబ్దం అయాక మహల్ కి వెళ్దాం అన్నాడు యశ్వంత్ .
అందరూ  అంగీకరించారు .
మాట్లాడుకుంటూ భోజనాలు ముగించారు .. ఎందుకో రచన మనసు మాత్రం కలవరం గా ఉంది ..
యశ్వంత్ .. నీ గిటార్ తెచ్చావా ? అని అడిగింది .. రచన .
తెచ్చాను .. నువ్వు దాని కోసం అడిగావంటే ఎందుకో అశాంతి గా ఉన్నావు .. అన్నాడు ఆమెకి  సామీప్యం గా వచ్చి మంచి మ్యూజిక్ వినాలని ఉంది .. ప్లీజ్ .. నాకోసం .. అంది దీనం గా మొహం పెట్టి ..
శివా .. నా గిటార్ .. అని అరిచాడు యశ్వంత్ .
శివ గిటార్ తెచ్చి ఇచ్చాడు ..
గోడ కి ఆనుకొని  కూర్చుని ప్లే చేయసాగాడు యశ్వంత్ .. అతని పక్కనే కూర్చుని అతని భుజం పై .తలవాల్చి నిశ్చింత గా కళ్ళు మూసుకొంది రచన
 
(ఇంకా ఉంది  )


.

No comments: