Powered By Blogger

Monday, 23 December 2013

రుధిర సౌధం 31సరే .. ఐతే నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే యష్ . నాకు తెలుసు .. నువ్వందరి గురించీ 

ఆలోచిస్తావని .. ఈరోజు రాత్రి కి మహల్ కి వేల్లటమా లేదా అన్నది నువ్వే నిర్ణయించు .. అన్నాడు మురారి 
ఇంకా టైం ఉంది .. ఇప్పుడు టైం 4 అవుతుంది .. మరో 2గం లో చీకటి పడటం మొదలవుతుంది . అని రచన వంక

తిరిగి రచనా ..  మరో అరగంట లో రత్నం రాజు తో సహా వెళ్ళిపో .. లేదంటే భూపతి మన మీద కాన్సంట్రేషన్ 

పెట్టొచ్చు . నువ్వు చూపించి నట్లు ఆ కిటికీ దగ్గర కొచ్చి నీకేదన్నా తెలియజేస్తాం మహల్ కి వెళ్ళేది లేనిది సరేనా ? 

అన్నాడు యశ్వంత్ . 

సరే .. నా దగ్గర ఓ రోప్ ఉంది .. కిటికీ నుంచి దాన్ని కిందికి వదులుతాను .. ఏదైనా ఉంటె పేపర్ మీద రాసి దానికి 

కట్టండి .. ఓకే ? అంది రచన . 

సరే .. అన్నాడు యశ్వంత్ .. 

సరే .. నేను కాసేపు సత్య తో మాట్లాడి వెళ్తాను అంది రచన . 

సరే నన్నట్లు తల ఊపాడు .. యశ్వంత్ . 

రచన ఆ గది లోంచి వెళ్లి పోయింది .. 

మురారీ .. నాకెందుకో ఈరోజు మనం ఎంత కాదనుకున్నా మహల్ కి వెళ్తామని పిస్తుంది .. అన్నాడు యశ్వంత్ . 

ఎందుకలా ? అన్నాడు మురారి . 

sixth sense అన్నాడు  యశ్వంత్ . 

సాలోచన గా తల ఊపా డు మురారి .. 

మురారి .. ఒక బుక్ తీసుకుని మనం వచ్చినప్పటి నుండి ఇప్పటి మన సంభాషణ వరకూ అంతా నోట్ చెయ్ .. మన 

తర్వాతా  అది మరొకరి పరిశోధన కన్నా పనికి రావాలి .. లేదంటే ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలగాలి .. అన్నాడు 

యశ్వంత్. 

అంటే యశ్వంత్ ...  అన్నింటికీ సిద్ధం గా ఉండమంటావు .. చిరునవ్వు తో అన్నాడు మురారి . 

ఎస్ .. మై ఫ్రెండ్ .. ఇది మనందరం గడపబోయే చివరి రోజు కావొచ్చు .. కాకపోనూ వచ్చు అన్నాడు యశ్వంత్ అదే 

చిరునవ్వు తో . 

సరే .. నేను అంతా నోట్ చేస్తాను .. అన్నాడు మురారి . 

                                                                             *****

మెల్లిగా కనులు తెరచి పూర్ణ కలశం వంక చూసాడు రమనానంద మహర్షి .. 

ఆయన కలశం వంక చూస్తూ ఏదో మంత్రం ఉచ్చరించాడు .. అంత వరకు భూమి పైన ఉపస్థిత ఐన ఆ కలశం 

మెల్లిగా గాలి లోకి లేచింది . ఆ దృశ్యాన్ని చూసి చుట్టూ ఉన్న భక్తులంతా గట్టిగా హర హర మహాదేవా శంభో 

శంకరా ! అంటూ జయ జయ ధ్వానాలు చేసారు . 

రమణా నంద ముఖం లో చిరు దరహాసం .. ప్రశాంత వదనం తో ఆయన కలశానికి ఎదురుగా ఉన్న గిరిజా దేవి 

వంక చూసి కమండలం లో నీటిని తీసి ఆమె పై చల్లాడు . 2రోజులలో కనులు మూసుకొని ధ్యానం లో ఉన్న ఆమె 

ఒక్కసారిగా కనులు తెరచింది .. 

ఎదురుగా గాలి లో తేలుతున్న కలశాన్ని చూసి ఆమె కళ్ళ వెంట నీళ్ళు జలా జలా రాలాయి .. 

స్వామీజీ .. నేను చూస్తుంది నిజమేనా ? కల కాదు కదా .. గద్గద స్వరం తో అడిగింది ఆమె . 

అమ్మా .. ఓ తల్లిగా ఆ జగత్జనని మరో తల్లి కోరిక కి న్యాయం చేకుర్చకుండా ఉండదు .. నీ అకుంటిత దీక్ష ,శ్రద్ధా 

భక్తులు ,నీ బిడ్డ పట్ల నీ వాత్సల్యం .. వీటి ఫలితమే .. ఆ పూర్ణ కలశం . అన్నారు మహర్షి . 

స్వామీ .. మీకు నేను రుణపడి పోయాను .. మీరు నా బిడ్డ ని రక్షించారు .. అంది గిరిజ ఆర్తి గా . 

నీ బిడ్డ కి ఆయుష్షు పోసింది నువ్వే తల్లీ .. .. నేను నీకు మార్గాన్ని మాత్రమె చూపాను .. అన్నారు స్వామీజీ .. 

కృతజ్నతలు చెప్పకుండా ఉండలేను స్వామీజీ .. తదుపరి ఏం చేయాలో సెలవివ్వండి .. అంది గిరిజ . 

నిశ్చల మనస్కురాలవై ఆ అంబ ని సహస్రం తో కుంకుమార్చన చెయ్యు ;అని గిరిజ కి చెప్పి గోపాలస్వామి వంక 

తిరిగి  మృత్యుంజయ హోమానికి సర్వం సిద్ధం చెయ్యి గోపాలస్వామీ .. అని చెప్పారు రమనానంద . 

సరే స్వామీ .. అని ఏర్పాట్లలో మునిగి పోయాడు గోపాలస్వామి . 

                                                               ********************

రాత్రి 8 కావొస్తుంది . ఊరు ఊ రంతా స్మశాన నిశ్శబ్దం లా ఉంది .  7 గం లకే రాత్రి భోజనాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పోయారు భూపతి ఇంట్లో .

రచన మాత్రం తన గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తుంది .. 

"అమావాస్య .. అమావాస్య .. రానే వచ్చింది .. ఏం జరుగుతుంది ?  అందరు ఇంతలా భయపడుతున్నారు .. 

మనసులో అనుకొని.. కిటికీ లోంచి యశ్వంత్ వాళ్ళు ఉన్న ఇంటి కేసి చూసింది .. 

వీళ్ళెం చేస్తున్నారో .. అయినా తాడు

కడతా .. అనుకున్నా కదా .. అని సూట్ కేసు లో ఉన్న రోప్ ని తీసి కిటికీ కి కట్టి వేలాడ దీసింది.

ఆపని పూర్తయ్యాక .. మళ్ళి అటు ఇటూ పచార్లు   చేయసాగింది ..

అనుకోకుండా ఆమె దృష్టి తూర్పున ఉన్న కిటికీ మీద పడింది .. మెల్లిగా

కిటికీ వైపు నడిచి .. దాన్ని ఒకసారి పరిశీలన గా చూసింది .. ఎవరు ఓపెన్

చేయకుం డా మేకులు కొట్టి ఉన్నాయి.. 

అన్నట్టు దీనికి ఒక చిన్న కన్నం ఉండాలే .. అని పరీక్ష గా చూసేసరికి

కనబడింది .. ఆ కన్నం దగ్గర కన్ను పెట్టి అటువైపు చూసింది  .. దట్టమైన

చీకటి తప్ప ఏం కనబడలేదు .. 

మళ్ళి వచ్చి తటాలున బెడ్ పై పడి ఆలోచించ సాగింది .. ఎందుకో మనసు

మహల్ వైపు మల్లుతోంది .. ఆమె మనసు లో సంఘర్షణ మొదలయ్యింది ..

ఇలా వేళ్ళు కొరుక్కుంటూ కూర్చోనా లేక .. అని పరి పరి విధాల ఆలోచిస్తుంది 

(ఇంకా ఉంది )
  No comments: