Powered By Blogger

Monday, 23 December 2013

రుధిర సౌధం 32


యశ్వంత్ మనసు లో మహల్ కి వెళ్ళ కూడదని తీర్మానించు కుంటూ నే ఇంకో పక్క విధి నిర్ణయిస్తే తప్పదని

సంసిద్ధం గా ఉన్నాడు . యశ్వంత్  మనసులో ఉన్న ఆందోళన ని అతని మిత్ర బృందం కూడా అర్ధం చేసుకుంది ..

వారు కూడా సంసిద్ధం గా ఉన్నారు .

యశ్వంత్ .. కిటికీ లోంచి చూసాను .. రచన గది లో లైట్ వెలుగుతూనే ఉంది . తానింకా మనం ఏమైనా

చె బుతామని  ఎదురుచుస్తుందని అని పిస్తుంది నాకు .. అన్నాడు శివ .

హా .. అవును కదా యశ్వంత్ .. తను మనకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో కూడా చెప్పింది .. ఏం చెబుదాం రచన కి ?

అన్నాడు మురారి .

హాయిగా నిద్రపోమని చెప్పు .. అన్నాడు యశ్వంత్ .. సాలోచన గా ..

శివా .. చిన్న స్లిప్ తీసుకుని .. నో అని రాసి ఇవ్వు అన్నాడు మురారి .

నేను రాస్తాను .. అని ఒక స్లిప్ మీద రాసి .. మురారి కి ఇచ్చింది సత్య .

కానీ ఈ స్లిప్ రచన కెలా .. అని అంటున్న శివ ని చూసి నువ్వు నాతొ రా శివా .. అన్నాడు మురారి .

ఇద్దరు కల్సి మెల్లిగా వీధి తలుపు తీసారు ..

అంతా నిశ్శబ్దం గా ఉంది .. అంతా అప్పుడే నిద్రపోయారు మురారీ .. అన్నాడు శివ .

అవును అని .. బంగ్లా వైపు నడిచాడు .. 10 అడుగులలో బంగ్లా వెనుక భాగాన్ని చేరుకొని రచన గది కిటికీ దగ్గరకి

చేరారు.

రచన గది కిటికీ నుండి తాడు వేలాడుతూ ఉంది ..

శివ కి అర్ధమైంది .. తాడు ని చేతిలోకి తీసుకున్నాడు . మురారి ఆ స్లిప్ తాడు చివరి అంచు కి అతికించ మన్నాడు ..

శివ అలాగే చేసాడు .. స్లిప్ అంటిన్చాక తాడు ని కొంచెం విసురుగా అటు ఇటూ  ఊపి మళ్ళి వెనుకకి నడిచారు .

గదిలో మంచం మీద బోర్లా పడుకుని ఆలోచిస్తున్న రచన కి కిటికీ కి కట్టిన తాడు కదులుతున్నట్లు అనిపించింది .

వెంటనే లేచి కిటికీ దగ్గర కి వెళ్లి కిందకి చూసింది .

మురారి ,శివ వీధిలో ఇంటి వైపు వెళ్తూ కనబడ్డారు ..

వెంటనే తాడు ని పైకి లాగింది .. తాడు చివరన ఉన్న స్లిప్ తీసి

తాడు ముడి విప్పేసింది ..

స్లిప్ మీద డిఫరెంట్ గా నో అని రాసి ఉంది .. నేనిది ఊహించాను ..

 అయినా యశ్వంత్ ఏ విషయం లోనయినా బాగా

ఆలోచిస్తాడు .. నేను తన మాట కాదని ఎలా అనగలను ? అని మనసులో అనుకొని రూం లో లైట్ ఆఫ్ చేసి బెడ్

మీదకి చేరింది . కాసేపట్లోనే మగత గా నిద్రపట్టేసింది రచన కి .

కిటికీ లోంచి రచన గది కేసి చూసి యశ్వంత్ .. రచన నిద్రపోయి నట్లుంది .. గదిలో లైట్ ఆఫ్ చేసింది .. అని చెప్పింది

సత్య .

ఓకే .. మీరు కూడా నిద్ర పొండి .. అని పక్క మీదకి చేరాడు యశ్వంత్ .

                                                                 ********************

టైం 11 కావొస్తుంది .. కిటికీ తెరచి ఉండటం తో చల్ల గాలి వణుకు పుట్టిస్తుంది .. చలి  మొదలు కావటం తో గాఢ

నిద్రలో ఉన్న రచన కి హటాత్తు గా మెలకువ వచ్చింది ..

దుప్పటి కోసం బెడ్ మీద తడిమింది .. చేతికి దొరకక పోవటం తో లేవక తప్పలేదు ఆమె కి ..

లేచి గదిలో లైట్ వేసింది .. ఆమె కళ్ళు గదిలో దుప్పటి కోసం వెతికాయి .. ..

కనబడలేదు .. కప్ బోర్డు లో ఉందేమో .. అని కప్ బోర్డు వైపు నడిచింది .. cupboard లో ఉన్న దుప్పటి తీసుకుని ,

తిరిగి బెడ్ దగ్గరకి రాబోతూ కిటికీ వైపు చూసింది .. ఓహ్ .. తలుపులు వేయలేదు కదూ .. అనుకుంటూ కిటికీ

చేరి తలుపులు వేయబోతు వీధిలోకి చూసిన ఆమె హతాసురాలయింది .

కింద .. వీధి లో ఓ స్త్రీ నడచి వెళ్తోంది .. ఆమె తలపై మంచి నీళ్ళ కుండ .. చేతిలో ఓ కారియర్ .. చిన్న లాంతరు ..

ఎవరీమె .. ఈ టైం లో ఎవరూ బయటికే రారు .. అలాంటిది ఈమె ఒక్కతే ఎలా తిరుగుతుంది ? అని పరీక్ష గా

చూసింది రచన .

ఆమె కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి .. ఆమె భూపతి ఇంట్లో పని మనిషి వెంగమ్మ ..

"వెంగమ్మ" ఈమె .. ఈ టైం లో ఇంట్లో లేకుండా ఎక్కడకు వెళ్తోంది .. ఏదో ఉంది .. నేను ఖచ్చితం గా వెంగమ్మ ని

ఫాల్లో అయి తీరాల్సిందే .. అని వెంటనే బెడ్ పక్కనున్న లాంగ్ కోట్ తీసి వేసుకుని కిటికీ నుండి కిందకి దిగింది

రచన .

రచన కి ఓ పది అడుగుల ముందే ఉంది వెంగమ్మ ..

చప్పుడు కాకుండా ఆమె ని అనుసరించసాగింది రచన .


( ఇంకా ఉంది )


:"రుధిర సౌధం " చదువు తున్న  readers దయ చేసి తమరి అమూల్య మైన సలహాలని , అభిప్రాయాలని 

కామెంట్ బాక్స్ లో తెలియ జేయండి  . 

                                                                                         మీ 

                                                                                             రాధిక 
No comments: