Powered By Blogger

Wednesday, 25 December 2013

రుధిర సౌధం 33నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లు తున్న యశ్వంత్ కి ఇక తనకి నిద్ర పట్ట దని పించింది . అబ్బా .. ఎందుకో .. నా

మెదడు నాకే హెచ్చ రిస్తుంది . జరగరానిదేదో జరగ బోతోన్నదని .. మెల్లిగా పక్క మీంచి లేచాడు .. శివ ,మురారి

గాఢ నిద్ర లో ఉన్నారు .. వేరే గదిలో సత్య నిద్రపోతోంది ..

వీళ్ళలో ఏ ఒక్కరిని నష్ట పోలేను .. నన్ను నమ్మిన స్నేహితులు .. అందుకే మహల్ దగ్గరకి వెళ్ళటానికి

నిరాకరించాను .. ఇంతకీ రచన ఎలా ఉందొ .. ఎప్పుడేం తోస్తే అదే చేస్తుంది .. అనుకుంటూ గుమ్మం వైపు నడిచి

కిటికీ ఓపెన్ చేసి రచన గది వైపు చూసాడు .

గదిలో లైట్ వెలుగుతుండటం , గాలికి కిటికీ తలుపులు కొట్టుకుంటూ ఉండటం గమనించి అతని మెదడు చురుగ్గా

పని చేసింది .. ఏదో జరిగింది .. రచన గది లో లేదని పిస్తుంది .. చేతికి ఉన్న వాచ్ చూసుకున్నాడు .. టైం 11. 20

నిమిషాలు  చూపిస్తుంది . వెంటనే వచ్చి మురారీ మురారీ .. శివా లేవండి .. అని వాళ్ళిద్దర నీ తట్టి లేపాడు ..

తటాలున లేచి .. ఏం జరిగింది ? అని అడిగారు ఇద్దరు ఒకేసారి .

నేనోక్కసారి రచన గదిలో ఉందో లేదో చూసొస్తాను .. మీరు రెడీ గా ఉండండి .. మన operation కి .. త్వరగా అని వీధి

గుమ్మం వైపు పరుగు తీసాడు యశ్వంత్ ..

తలుపులు తెరచి బంగ్లా వైపు పరుగు పెట్టాడు ..

ఏం జరిగి ఉంటుంది మురారి .. అన్నాడు శివ .. లేచి రెడీ అవుతూనే ..

చేతిలోకి గన్ తీసుకుంటూ .. జస్ట్ బి రెడీ .. అని.. సత్య నిద్రపోతున్న గది వైపు చూసి  సత్యా అని పిలిచాడు మురారి ..

యశ్వంత్ ఒక్క పరుగు తో బంగ్లా వెనుక భాగాన్ని చేరుకొని పైప్ సహాయం తో పైకి ఎగబ్రాకాడు .. ..

కిటికీ రెక్క ని అందుకొని రూం లోకి తొంగి చూసాడు .. గదిలో రచన లేదు .. పైపెచ్చు లోపలనుండి తలుపు

ఘడియ పెట్టి ఉంది .. చుట్టూ పరికించి చూసాడు .. బాత్ రూం ఘడియ బయట నుండి వేసి ఉంది .. అంటే రచన

బాత్ రూం లో కూడా లేదు .. అంటే రచన ఈ కిటికీ గుండానే బయటికి వెల్లుంటుంది .. హౌ ఫూలిష్ .. కోపాన్ని అణచి

పెట్టుకుని కిందకి దిగి తిరిగి పరుగున వారుండే ఇంటికి చేరుకున్నాడు యశ్వంత్ ..

యశ్వంత్ .. ఏం జరిగిందీ ? శివ ఎదురొచ్చి ప్రశ్నించాడు ..

శివా ! రచన రూం లో లేదు .. కిటికీ గుండానే కిందికి దిగిందని ఖచ్చితం గా చెప్పగలను . ఎక్కడికి వెళ్లిందో ..

ఆందోళన గా అన్నాడు .. యశ్వంత్ .

ఇంకెక్కడికి ? ఖచ్చితం గా మహల్ కె యశ్వంత్ .. డౌట్ లేదు అన్నాడు మురారి .

ఐతే ఆలస్యం చేయకుండా వెంటనే బయల్దేరడం తప్పనిసరి యశ్వంత్ .. అన్నాడు శివ .

శివా .. ఈరోజు ఆపరేషన్ వద్దనుకున్నాం .. కాబట్టి నేనే వెళ్లి రచన ని తీసుకొస్తాను .. అన్నాడు యశ్వంత్ .

సారీ .. యశ్వంత్ .. వెళ్తే మనం కలిసే వెళ్తున్నాం .. అదీ ఇప్పుడే .. ఇంకా ఎలాంటి వాగ్వివాదాలు వద్దు .. అన్నాడు

మురారి ..

అవును యష్ .. నువ్వు మాకోసం ఆలోచించావు .. మేము నిన్నెలా ఒంటరిగా పంపిస్తాం .. ?మేము వచ్చి తీరతాం

.. పద అన్నాడు శివ .

థెన్ లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..

నేనూ వస్తాను .. అంది వెనకాలే వీరి సంభాషణ విన్న సత్య .

నో సత్యా .. నువ్వుండు .. మనలో ఒకరు ఉండటం మంచిది .. మేము వస్తామని ఆశిస్తున్నాం .. బట్ ఏమైనా

జరిగితే నువ్వు ఆఫీసు కి తెలియజేద్దువు గానీ .. అన్నాడు మురారి .

మురారీ ప్లీజ్ .. అంది దీనం గా సత్య .

నా మాట వింటావు కదూ .. అని బాయ్ చెప్పి యష్ లెట్స్ గో .. అన్నాడు ..

సత్య చూస్తూ ఉండగానే ఆ ముగ్గురూ చీకట్లో కలసిపోయారు .. ఓహ్ గాడ్ .. ప్లీజ్ సేవ్ థెమ్ .. అని మనసులోనే

ప్రార్థించి లోపలకి వచ్చి తలుపులు వేసుకుంది సత్య . 

అసలెందుకు ఇలాంటి పిచ్చి పని చేసింది రచన .. ? ఎవరికీ చెప్పకుండా మహల్ కి ఎందుకు వెళ్ళాలి ??? యశ్వంత్

వద్దని చెప్పాక కూడా ... ఇప్పుడు ఏం జరుగుతుందో .. ఆమె మోకాళ్ళ మీద కూల బడి పోయింది నిస్సహాయం గా .

(ఇంకా ఉంది )


No comments: