Powered By Blogger

Tuesday, 31 December 2013

రుధిర సౌధం 37


అయ్యో ! ఇంత రక్తం ... రచనా ఏదో ఒకటి చెయ్ .. మురారికి ఏమైనా అయితే నేను తట్టు కోలేను .. ఏడుస్తూ అంది

సత్య ..

సత్యా .. ముందు మురారిని ఇక్కడ నుంచి తీసుకెళ్దాం .. మన వెహికల్ ఉంది కదా .. అక్కడ వరకు ఎలా అన్నా

తీసుకు వెళ్ళాలి .. అంది ఆందోళన గా రచన .

హా .. సరే .. లేని ధైర్యం తెచ్చుకొని మురారి ని లేవదీయ టానికి ప్రయత్నించింది సత్య ...అంతే విసురుగా గాలి వారి

మీదనుండి వెళ్లి నట్లయి .. మురారి ని మెట్ల మీదుగా పైకి ఈడ్చుకు పోయింది ..

బాధ తో విల విల్లాడు తున్నాడు మురారి ..

మురారీ .. ఇద్దరూ గట్టిగా అరిచారు ..

వాళ్ళ కళ్ళ ముందే మురారి మాయమయ్యాడు ...

ఆ హటాత్పరిణామానికి తట్టుకోలేక పోయింది సత్య .. శరీరం మీద అదుపు తప్పి కూల బడిపోయింది ..

సత్యా ... అని కింద పడిపోయిన సత్య ని కుదప సాగింది ..

మెల్లిగా కళ్ళు తెరచి .. అంతా నీవల్లే .. నీవల్లే రచనా .. యష్ వద్దన్నాడు .. కానీ నువ్వు .. నీకోసమే వాళ్ళు

ప్రాణాలకు   తెగించి వచ్చారు .. వాళ్లకి ఎం జరిగినా దానికి కారణం నువ్వే ... మెల్లిగా అంది నిస్సహాయం గా సత్య ..

రచన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ..

సత్యా .. అని ఆమె ని గుండెలకి హత్తుకుంది ..

నువ్వు చెప్పింది నిజమే .. ఇదంతా నావల్లే .. కానీ నువ్వు భయపడకు .. మురారి ని నేను కాపాడతాను ..

నువ్వు నాతొ వస్తావా ? నేను పైకి వెళ్తున్నాను .. అంది రచన ..

మురారి అక్కడ ఉంటాడా ? ఆశ గా అడిగింది సత్య ..

ఉండొచ్చు కదా ... బాధ ని అణచు కుంటూ అంది రచన ..

మెల్లిగా లేచి నించుంది ఆమె .. పద రచనా ... మన వాళ్ళని కాపాడుకుందాం .. అంది సత్య ..

హ్హ .. పద .. అని ఆమె భుజం మీద చేయి వేసి ముందుకు నడిచింది రచన ..

ముందున్న మెట్లు ఎక్కబోతుండగా .. మెట్ల మీద నుంచి రక్తం ధారలయి ప్రవహిస్తుంది .. ..

రచనా ! రక్తం .. ఆందోళన గా అంది సత్య ..

అంతా అబద్ధం సత్యా .. మన కళ్ళు ఇప్పుడు మనల్ని మోసం చేస్తాయి .. నమ్మకు .. ఫర్వాలేదు ... పద .. అని

ఇద్దరు  మెల్లిగా మెట్లు ఎక్కసాగారు ...

రచన పైకి మాత్రమె చూడసాగింది .. కానీ సత్య కిందున్న రక్తాన్ని చూస్తూ భయం భయం గా నడవ సాగింది ..

నన్ను వదులు రచనా .. కాలు జారుతోంది .. అని రచన చేతిని తన భుజం మీద నుంచి తీసేసింది సత్య .

అంతే .... సర్రున కిందకి ఎవరో తోసేసి నట్లు జారి పడింది సత్య ..

అయ్యో ... సత్యా .. అని వెంటనే మెట్లు దిగి సత్య దగ్గర కి పరుగున వచ్చింది రచన ..

అమ్మా ... బాధ తో మూలిగింది సత్య ..

సత్యా .. సత్యా .. కళ్ళు తెరవు సత్యా .. అని ఆమె ని తన చేతుల్లోకి తీసుకుంది రచన ..

రచన ఆమె ని తాకగానే .. వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది సత్య ..

ఆశ్చర్యం గా లేచి నిలుచుంది సత్యా ..

రచనా !నేను నీ చేయి వదిలించ గానే .. ఎవరో తోసేసినట్లు గా పడి పోయాను .. మల్లి నువ్వు తాకగానే నిస్సహాయం

పడిన నేను లేవగలిగాను .. ఏముంది నీ దగ్గర ? రచన భుజాలను కుదిపేస్తూ అడిగింది సత్య ..

నాదగ్గర ? నాదగ్గర ఏముంది ? అయోమయం గా అంటూనే ఆమె దృష్టి తన చేతికి కట్టి ఉన్న తాయెత్తు మీద

పడింది ..

తాయెత్తు ... స్వామీజీ ఇచ్చిన తాయెత్తు .. అర్థమైంది .. ఆమె మొహం లో ఆందోళన మాయమై ధైర్యం ప్రకాశించింది .
సత్యా .. పద .. మనం మురారి ని కాపాడదాం .. మన వాళ్లకి ఎం కాదు .. నాకు బసవరాజు చెప్పాడు .. మన

వాళ్ళని కాపాడే సామర్థ్యం నాకున్నదని  మర్చి పోవద్దన్నాడు .. ఎట్టి పరిస్థితుల లోనూ నా చేయి వదలకు ..

పద .. అంది రచన .

చిన్నగా తల పంకించి .. ఆమె చేయి గట్టిగా పట్టుకుంది సత్య ..

ఇద్దరూ ధైర్యం గా మెట్లెక్కి పై అంతస్తు లోకి చేరుకున్నారు ..
                                                        **************************
మెల్లిగా శివ సహాయం తో  మహల్ ముందు భాగానికి చేరుకున్నాడు యశ్వంత్ ...

యశ్వంత్ .. అటు చూడు .. మహల్ ద్వారం తెరుచుంది .. మనం వచ్చినప్పుడు .. తలుపులు మూసి ఉన్నాయి

కదా ! ఆశ్చర్యం గా అన్నాడు శివ ..

అవును శివా .. అంటే ఆ తలుపులు తీయగలిగెది రచన ఒక్కతే ... రచన ఇప్పుడు వచ్చిందా ? ఏంటి ? ఆశ్చర్యం

గానే తన అనుమానాన్ని వ్యక్త పరిచాడు యశ్వంత్ ..

మురారి లోపల ఉన్నాడేమో ? ఆశగా అన్నాడు .. శివ ..

వెళ్లి చూద్దాం శివా !నిండా మునిగాక చలెందుకు .. అని సింహద్వారం వైపు అడుగులో అడుగు వేసుకుంటూ

నడిచాడు యశ్వంత్ .. అతన్ని అనుసరించాడు శివ

(ఇంకా ఉంది )  

3 comments:

radhika said...

its super madam....keep the tempo going

radhika said...

Super Madam...Keep the tempo going

రాధిక said...

thank u so much raaju garu