ఆకాశం అంతుందా ప్రేమా ..
భూలోకం నిండావే ప్రేమా ..
సంగీతం లో రాగం ప్రేమల్లే తోచింది ..
సాహిత్యం లో భావం ప్రేమయ్యే ఉంటుంది ..
ప్రేమిస్తే ప్రేమే ప్రేమిస్తుందీ .. ఆకాశం
పయనానికి గమ్యం ప్రేమా .. చలనానికి మూలం ప్రేమా ..
ఈ ప్రేమకి మనమే చిరునామా
ఆనందం రూపం ప్రేమా .. అనుబంధం అర్థం ప్రేమా ..
ఈ ప్రేమకి తోడై ఉందామా ..
ఏ అంతరంగం .. కాదనదు నేస్తం ..
ఈ ప్రేమ తరంగం ఆగదు ఏ మాత్రం ..
ఈ ప్రేమకి పల్లవి నువ్వై చరణం నేనై పాటై పోదామా ... ఆకాశం
కావ్యానికి ప్రాణం ప్రేమా .. హృదయానికి లోకం ప్రేమా ..
ఈ ప్రేమని కానుక చేద్దామా ..
మరణానికి లొంగదు ప్రేమా .. మరవటమే కుదరదు లేమా ..
ఈ ప్రేమకి దాసుల మవుదామా ..
ఏనాటి నుండో చేస్తుంది యుద్ధం ..
త్యాగానికయినా ఈ ప్రేమ సిద్ధం ..
ఈ ప్రేమకి మనసు వి నువ్వై వయసుని నేనై పరిపాలించేద్దామా .. ఆకాశం
No comments:
Post a Comment