Wednesday, 4 December 2013

ముగ్ధ మోహన సౌందర్యాతి శయమా..

ముగ్ధ మోహన సౌందర్యాతి శయమా.. 
ప్రియమా .. ప్రియతమా .. 
సందేహ పూరిత గద్గద స్వరమా .. 
భయమా .. అనుపమా .. 
నీ మేలి ముసుగు ఒలికేటి సిగ్గు దొంతరల సాన్నిత్యమా .. 
నీ కాలి మువ్వ పలికేటి సంగీత సామ్రాజ్యమా ..    ముగ్ధ 

వణికి నపుడు ఆ పెదవి తలుపు తట్టింది ఆ మౌనమే .. 
కలికి కనులలో జాలువారు కన్నీరు ఆనందమే .. 
పడమటింట ఆ భానుడయిన సెలవు కోరేనులే .. 
ఈ భామ కంట భావాల జాడ నేడు తెలిసెనులే .. 
కళ లెన్నొ చిలికెనులే ..                                     ముగ్ధ 

వలపు తలపు రేగేటి వేళా .. నాకైనా అది ఓటమే .. 
మది తలుపు తట్టి నిను పిలుచు వేళా నువ్వింక నా నేస్తమే .. 
చిలిపి చూపు తాకేటి వేళా .. పులకింత ఈ మేనుకే .. 
చిరుకోపమింక నను హెచ్చరించు .. గిలిగింత నా మనసుకే 
దడ పెంచ కె వయసుకే ..                                   ముగ్ధ    

No comments: