వేల వేల పూల రంగుల్లోన ..
జాడ లేని రంగు పేరేంటమ్మా ..
అది ప్రేమ రంగేమో .. మది పొంగు తుందేమో ..
ఆ ప్రేమ కన్న కలల హరివిల్లేమో .. వేల
ఆ ప్రేమ పుట్టినపుడు కన్నుల్లో మెరిసి నపుడు
అల లయిన కడలి రంగులా కనిపిస్తుంది ..
ఆ ప్రేమ పెరిగినపుడు తన జతని వెతికి నపుడు
కలహంస మేని రంగులా తలపిస్తుంది ..
చెలి బుగ్గలోన సిగ్గై ఆ అరుణమై మెరిసింది .
మెలి తిరుగుతున్న పొద్దై తొలి కిరణమై విరిసింది
చినుకు పడితే తడిసినట్టి నేల రంగై ఉంటుంది వేల
విరహాలు రేగి నపుడు ,దాహాలు తీర్చనపుడు
నిశి వర్ణమల్లె తోస్తుందేమో ప్రేమా. ..
మోహాలు ముంచినపుడు ,మైకాలు అల్లినపుడు
ఆ ధవళ మల్లె కానరాదా ప్రేమా ..
చిరునవ్వు నవ్వితే అది స్వచ్చమైన రంగేనమ్మా ..
పిడిబాకు విసిరితే ముంచే తుఫానమ్మా ..
మనసు పడితే కలిగినట్టి ఆనందమై ఉంటుందమ్మా .. వేల

No comments:
Post a Comment