Powered By Blogger

Wednesday, 18 December 2013

ఓ చిలిపి కలా ............

ఓ చిలిపి కలా .. వలపువలా .. తలపు అలా అలలా ...
నను తాకుతుంటే ఇంతలా ..
నువ్ చూపు కళా .. చిత్రమిలా .. చంద్రిమలా
ఉంటే మెరిసిందిలే వెన్నెలా ...
నీ కనుల కాటుక లా రేయి కె చీకటలా ..
నీ నవ్వు పున్నమిలా వెలుగునే చిమ్మునలా .. ఓ చిలిపి  కలా

నా ఆశలా...  పూవులా .. విరియు వేళా ..
నీ శ్వాసిలా ..వెచ్చగా .. మీటునే మేను నే అలా ...
ఓ పడుచు హంసలా .. నడిచిరావే ఇలా ..
ఎడబాటు  హింసలా ... బాధ పెడితేఎలా ?
కదలి రావాల మధుబాలా నిన్ను చేరేలా ..
కడలి కెరటాల కౌగిలిలో నది వోదిగేలా ...  ఓ చిలిపి కలా

నీ ఊహ లా .. మేఘమాల ..   తేలుతుందలా ..
ఈ మోహమేలా ... నిలువెల్లా .. నన్ను కాల్చేనేలా ?
అనురాగమాల ..నీ మెడ లో వేయాలా ?
కన్నయ్య లీలా ... నేను గా చూపాలా ?
వలపు విరహాలా .. మదినేల .. కుదిపెయ్యాలా ?
పిలుపులిక చాలా ?ఇంకా నిన్నడుగు తుండాలా ?     ఓ చిలిపి కలాNo comments: