వందనా .. నా వందనా నువు నా హృదయ స్పందనా ..
అందునా .. నిన్నందునా .. నిను నా ప్రాణ మందునా ..
నీకై పాడనా .. నా ఆలాపనా ..
నీకే తెలపనా .. నా ఆరాధనా ..
కలకాలం గుండెలో గుడి కట్టి కొలవనా ..
కలనైనా చెప్పనా నీకేనా అభినందన .. వందనా
ఆశలు రేపిన వేళా .. నా శ్వాస గా మారితి వేలా ?
నీవే ఓ పరి నన్నే చూడగా నే తగనా ....
బాసలు చేసిన మదిలా .. ఆడియాసలు మిగిలిన కథలా
నన్నే ఓ కనుసైగ తో నీకై తిప్పిస్తావు మైనా ..
నా దారిలో వాసంతమా .. నీ పచ్చదనమే ఆనందమా ..
నీకోసమే పుట్టానని నా భావన .. దరిచేరనా ఓ వందనా .. వందనా
కన్నులు కలిసిన వేళా .. ఆ మిన్ను ని తాకితి నేలా ?
నీకన్నా వేరే అందం లేదా భూమి పైనా ..
నువు నడిచిన ఈ నేలా .. స్వర్గాన్ని తలపిస్తున్దెలా ..
నువు దేవతవా .. దిగివచ్చావా అని అడిగేయనా ..
ఈ ప్రేమ ఇంతే .. నాలో మైక మంతే ..
చెలిప్రేమ మహిమా .. కదిలించగలనా .. నా మనసుని సఖి నీడనా .. వందనా
No comments:
Post a comment