బృందావనిలో విహరించే మోహన రాగమిదా .. ..
ఆ ఆమని నే మురిపించే మువ్వల సవ్వడిదా ..
కృష్ణా ... ఆఅ... క్రిష్ణా .. మురళి ని పెదవిని
జతచేసిన ఆ .. తీయని గానమిదా .. బృందావనిలో
గోపిక మదిని దోచిన ఆ.. నల్లని రూపం లో ..
రాధిక ఎద లో విరహం లా యమునా తీరం లో ..
కంస చ్చేధన పర్వం లో .. మధురా నగర విహారం లో ..
పులకిత దేవకీ హృదయం లో ..కుచేలుని స్నేహతరంగంలో ..
వినిపించినదీ .. ఈ రాగం .. మైమరపించే అనురాగం .. 2 బృందా
రుక్మిణి ప్రణయ సమీరం లో .. సత్యా ప్రేమ కలాపం లో ..
పలువురి కాంతల ఆరాధన లో .. ద్వారక నగరి సుఖశా0తులలో..
కుంతీ దేవి ప్రార్థన లో .. పాండవ పుత్రుల బాంధవ్యం లో ..
సోదరి ద్రౌపది ఆవేదనలో .. .. సారథి వైన కురుక్షేత్రం లో
వినిపించినదీ ఈ రాగం .. జ్ఞానము నిచ్చే గీతాసారం .. 2 బృందా
2 comments:
Great Job :) Way to go !!!
thank you parimala
Post a Comment