అడుగు అడుగు జత పడిన వేళ అది పయనమగును మనసా ..
అణువు అణువు పులకించు వేళ అది ప్రణయ మేమో బహుశా ..
తనువు తనువుని పలకరించు చిరుగాలి దేమో మాయా ..
వలపు పిలుపు ని ఆమోదించనీ హృదయమే లేదయా ..
కలువ కనులలో చూపులే వెన్నెలలు చిలికేటి తరుణం
ఆ పెదవి మెరుపులో ఎరుపునే కవ్వించిన ప్రేమ కిరణం
మనసు లోని ఈ మధుర యాతన ఇష్టమైన దేమో ..
మనసుపడిన చెలి నొదిలి ఉండటం కష్టమైన దేనమ్మో ..
అదురుతున్న నా మేను లో పులకింత ఒక కారణం
ఎదురు చూస్తున్న మనసు లో సాగింది లే ఓ రణం ..
కలవలేని నింగి నేల ని కలిపే వాన విల్లు ..
ఇక కొలవలేని ఓ రీతి లోన కురిసింది ప్రేమ జల్లు
No comments:
Post a comment