Powered By Blogger

Friday, 31 January 2014

ఇంతకీ నేనెవరో తెలుసా

ఏడు రంగుల ఇంద్ర ధనుసు లో శ్వేత వర్ణమై యున్నా ..

అష్ట దిక్కులా నింగి హద్దులే చెరప టానికొస్తున్నా ..

సంతోషమే నా పేరని .. వాసంతమే నా తీరని ..

సుతి మెత్తని హృదయాలలో ఉయ్యాలలే ఊగనీ ..


పసిపాప నవ్వుల్లో హాయి నేనవ్వనీ ..

కనుపాప లోగిల్లో కల నవ్వనీ .. 

పెదవింటి ముంగిట్లో చిరునవ్వు ముగ్గేయనీ ..

ప్రతి పెరటి తోటలో పూల సోయగమవనీ ..

కులమంటూ మతమంటూ నాకేది లేదని ..

రవికుల సోముని తిలకము నేనని ..

భవితకి ప్రాణం నన్నే కానీ ..

చరిత లో హృదయం నేనై పోనీ ..

ప్రతి ఒక్కరిలో  ధైర్యం కానీ ..

ప్రతి ఇంట వెలిగే దీపాన్నవనీ ..

నింగికి నేలకి నిచ్చెన వెయనీ ..

స్వర్గాన్నే ఇలకే దింపే యనీ ..

ఇంతకీ నేనెవరో తెలుసా నీకని .. అడిగా చెప్పెయ్ జవాబునీ .. 

ప్రేమంటే
    ప్రేమంటే ఒక వ్యక్తి ని తోడుగా ఎంచుకోవటం కాదు... 

   ఒక సరయిన బంధాన్ని ఏర్పరచుకోవటం .. 


   ప్రేమ ప్రారంభం లో ఎంత ఉన్నదన్నది కాదు... 


   చివరిదాకా నిలిచే ప్రేమని పంచుకోవటం ముఖ్యం . 


     ప్రేమ ఇద్దరి మనసులని ఒక్కటి చేసేదే కాదు ఆ ఇద్దరి ఆత్మగా కూడా 

      వెలుగొoదేది 

కలికి చెక్కిలి పైన కన్నీటి చారికా..
        కలికి చెక్కిలి పైన కన్నీటి  చారికా..

    ఉప్పని వెల్లువా నువ్వు జాలువారికా.. 

     కన్నె మదిలో గుబులు ఎవ్వరికి ఎరుకా ?

     పెదవి పై  నవ్వేల   కానరాదె ఇక ... 
     
      పసిడి ప్రాయమ్ము ఎవ్వరికి కానుకా ?

     రుక్మిణికి  కిట్టయ్య ఉన్నాడు కనుక .. 

      వలపు వాకిలి  తెరిచి చూసింది కునుకులేకా ... 
      
       ఈ పసి దాన్నికాపాడ ఏ ఆశ  తునకా...

       వెతికినా కనరాదు  ...నీకేది దారికా...?  

       తాత తో మనువు నే నువు కాదనకా .... 

        లేలేత వయసు లో ఏమిటీ నడకా ...?

        ఆకసం లో మెరిసిన ఆ  తారకా...

         మూ గబోయినదమ్మ దీవించలెకా...

         అందచందములోన  నీకు ఆ మేనకా 

          ఏ  తీరున చూసినా సాటి రాదింకా ... 

          జీవమ్ము లేనిదీ ఈ పెళ్లి వేడుకా .... 

          సరిజోడు లేక వెలవెలబోయింది వేదికా .... 

           నూరేళ్ళ జీవితానికి ఉన్నదా డోకా.... 

            తీయలేనిది కదా నీ కంట నలకా... 
            
            
ఈ కవిత ఆనాటి మూ డా చారమయిన బాల్య వివాహాలకి అడ్డం పడుతుంది ... ఇప్పటికి కొన్ని ప్రాంతాల లో ఈ దురాచారం ఇంకా కొనసాగటం దురదృష్టకరం ... 

      వయసు మళ్ళిన వాళ్ళని బాల్యవివాహం చేసుకుని వితంతువులయిన వారెందరో ....... అటువంటి వారికి నా ఈ కవిత అంకితం . 


                                  జై  హింద్ 

                                                    -రాధిక      

        

        
       

Thursday, 30 January 2014

రుధిర సౌధం 63
ఐతే మనకి కావాల్సిన బుక్ దొరికి నట్టే ... అంది సంతోషం గా .. రచన .

అవును .. ఈ బుక్ తరవాత చదువుదాం . ముందు ఈ బుక్ బాగ్ లో పెట్టేయాలి . అని ఆ పుస్తకాన్ని తన బాగ్ లో

పెట్టేసాడు యశ్వంత్ .

వెళ్ళండి .. వెళ్ళండి .. ముందు అన్ని బుక్స్ వెతకండి .. ఇంకా ఏదన్నా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరకొచ్చు ..

అన్నాడు మురారి .

మల్లి అంతా పుస్తకాల వేట లో పడ్డారు .

యశ్వంత్ కూర్చున్న చోటే ఇంకో పుస్తకం ఏదో దొరకటం తో దాన్ని చదవటం మొదలు పెట్టాడు .

ఇంతలో రచన కేదో పుస్తకం కనబడింది .. అందులో విషయాన్ని చదువు తుంటే ఆమె భ్రుకుటి ముడి పడింది .

ఆమె మనసు సంతోషం తో ఉరకలేసింది ..

యష్ .. అంటూ యశ్వంత్ దగ్గరకెళ్ళి మోకాళ్ళ పై కూర్చుని .. యష్ .. ఈ బుక్ ఇక్కడ   దొరికిoది . నేనీ పుస్తకం

కోసం చాలా వెతికాను ... తెల్సా ? అంది సంతోషం గా ..

ఏంటా పుస్తకం ? అన్నాడు యశ్వంత్ .

ఇదా ? మన భారతదేశం లో ప్రాచీన కాలం లో ఋషులు చాలా రకాల విద్యలని అభ్యసించే వారట . అవి సామాన్య

విద్యలు కావు .. ఎలాంటి వంటే .. ఈరోజు మనకి అంతు చిక్కని ప్రశ్నలు గా ఉన్న సమస్యలన్నీ పారద్రోలే విద్యలు .

ఈ పుస్తకం కోసం నాకు రమణానంద మహర్షి చెప్పారు . ఈ పుస్తకం సంపాదించగలిగితే నువ్వు అనుకున్న వన్ని

మరింత సమర్థవంతం  గా చేయగలవు అన్నారు . ఇన్నాళ్ళకి నాకీ పుస్తకం దొరికింది .. అంది రచన సంతోషం గ .

నువ్వింత హ్యాపీ గా ఉన్నావంటే అది నిజం గానే మనకి కావాల్సిన పుస్తకం అయి ఉంటుంది .. ముందు అది

దాచెయ్ .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ .. ఈ గ్రంధాలయం లో ఉన్న ప్రతి పుస్తకం అమూల్య మయినదె .. వీటి విలువ చాలా మందికి తెలీదు .

ఈ గ్రంధాలయాన్ని పూర్వ స్థితి కి తీసుకు రావాలి .. అంది రచన .

మన పని పూర్తి కాగానే ఆ పనే చేద్దాం .. ఓకే .. అన్నాడు యశ్వంత్ .

యశ్వంత్ ... పుస్తకాలన్నీ చూసాం .. ఇక మనం వెల్లొచ్చను కుంటా .. మనకి కావలసినవి ఇంకా ఏమి లేవు ..

అన్నాడు శివ వీరి వద్దకొచ్చి .

చాలా వరకు పుస్తకాల్ని ఆ చెద పురుగులే మాయం చేసేసాయి .. యష్ .. ఆ ముసలోడు పురుగులు లేవన్నాడు ..

అని వచ్చింది సత్య .

సత్యా .. ఆ ముసలాయన చెప్పింది చదివే పురుగుల గురించి .. చెద పురుగుల గురించి కాదు .. అన్నాడు

యశ్వంత్.

యష్ .. ఆ ముసలోడు వస్తున్నాడు .. పదండి ఇక మనం బయల్దేరదాం ... అన్నాడు మురారి ..

ఆ ముసలాయన లోపలికి వస్తూ ఏం బాబూ .. చదివారా పుస్తకాలు ? అని అడిగాడు ..

ఆ తాతా .. పుస్తకాలు అన్ని చెద పట్టి ఉన్నాయి ..  ఓ పని చెయ్ .. అని యశ్వంత్ తన జేబు లోంచి కొంత డబ్బు

తీసి అతనికి ఇచ్చాడు .. ఈ గ్రంధాలయానికి పనికొస్తుంది .. ఉంచు తాతా .. అని ఇచ్చాడు ..

ఇంత డబ్బా ? ఇలా ఎవ్వరు నాకివ్వలేదయ్య ... పుస్తకాల విలువ తెలసిన వాడివయ్యా .. అన్నాడు ముసలాయన .
ఈ పుస్తకాలే తాత .. గతానికి .. భవిత కి వంతెన వేసేది .. సరే మేము వెళ్తాం .. అని వచ్చేసాడు యశ్వంత్ .

బయటికి వచ్చి వెహికల్ ఎక్కుతూ యష్ .. ఆ ముసలోడికి అంత డబ్బు యిచ్చావు .. అతడు నిజం గా ఈ

గ్రంధాలయం బాగు చేయిస్తాడో లేక తన సొంతానికి వాడు కుంటాడో ఎవరికి తెల్సు ? అంది సత్య .

సత్యా .. నువ్వొకటి గమనించలేదు .. ఈ గ్రంధాలయం చాలా పాతది .. దీన్ని నిర్వహించాల్సిన అవసరం కూడా

ఆయనకి లేదు .. ఇలా పుస్తకాలు చదివే వాళ్ళు అతనికి ఎంత ఇస్తారు ? దానితో అతనేం బతుకుతాడు ?

పుస్తకాలన్నీఅమ్మేసి కూడా అతను బతకాలను కోవొచ్చు .. కానీ అతనలా చేయలేదు .. కారణం అతను

పుస్తకాలను , ఈ గ్రంధాలయాన్ని ప్రేమిస్తుండాలి .. లేదంటే  ఈ గ్రంధాలయం తో అనుబంధం ఉండి ఉండాలి . ..

అన్నాడు యశ్వంత్ .

యష్ .. చెప్పింది నిజం .. ఇది రాజుల సారథ్యం లో నడిచి ఉంటుంది .. ఇప్పుడు దీని నిర్వహణ కష్టం .. కానీ

అతను కొనసాగిస్తున్నా డంటే .. ఆయన్ని మెచ్చుకోవాల్సిందే .. అంది రచన .

 లెట్స్ గో శివా .. మరి కొంత దూరం వెళ్తే తినడానికి ఏమన్నా దొరకొచ్చు .. అందరం భోజనం చేసి కావాల్సిన

వస్తువులేవన్నా కొనుక్కుందాం .. అన్నాడు మురారి .

ముందు రెండు సైకిల్ లు కొనుక్కుందాం .. ఆ ఊరిలో బావుంటుంది .. అన్నాడు శివ ..

సరే .. ముందు స్టార్ట్ చెయ్ .. అన్నాడు యశ్వంత్ .

వాహనం ముందుకి సాగిపోయింది .

(ఇంకా ఉంది )

ఓ భారతీ వందనం.

                                     ఓ గీతం...భరత జాతికి అంకితం 

గతమంటూ ,మతమంటూ..విధ్వన్సమేలా..
గతజన్మ ఫలమంటు ..భావించనేలా..
మనదోయీ ఈ భారతం...శాంతి కే అంకితం జీవితం..
మనదేశమే పూవనం ..పూవులా విరియులే జీవనం..(గత)

ఉగ్రవాదుల కోరలలో చిక్కుకున్నా..
 హింసలే చెలరేగి పేట్రేగుతున్న...
చిరునవ్వు చిందించరా...స్నేహ హస్తాన్ని నువు చాపరా..
ప్రతీకారమంటూ అహంకారమంటే ...
మమకారమందించరా...ప్రేమ మనలోని నైజమ్ము రా..
అహింసయె గెలుచురా..సత్యమే శాంతి నెలకొల్పురా...
ఆ ఆ  ఆ  ఆ  ....ఆ ఆ...ఆ...ఆ...

ఓ భారతీ వందనం..నీకు ప్రియమారా అభివందనం..2

గాయాలు రేగాయి..కన్నీళ్ళు పారాయి..
నెత్తుటి ధారల్లో అసువులే బాశాయి...ఐనా
తల్లీ ఇది నందనం ..పూలు విరిసే నందనవనం..

గతమంటూ..మతమంటూ..విధ్వన్సమేలా?
ఇది ఖర్మ ఫలమంటూ..వగచింది నేలా..

అమాయకుల ప్రాణాలను హరియించగా నీకేమి ఫలముండురా..?
భాయీ..భాయీ అని పిలవగా..ఆనందపు రుచి తెలియురా..

నీవు కూడా భరత మాతకూ బిడ్డవే..
ఉగ్రవాదపు  మాయలొ ఉన్న బిడ్డవే..

నీ సోదరులే వీరురా..
నిజం గ్రహించి నువు మసలరా...
ప్రతి బిడ్డ ఆనందమూ ..కోరునూ..తల్లి గా ఈ దేశమూ..

వందే మాతరం అని పలకవేలరా..ఎందుకాలిడినా భారతీయునివిరా..
హిందూ..ముస్లిం అని..ఎవ్వరు నిను పిలవనీయకురా..
భరతావని విలసిల్లగా..చేయి చేయి కలపాలిరా...
ఓ భారతీ వందనం..నీకు మనసారా అభివందనం..

                 జై హింధ్
                                                                                                 _Radhika

విరహ గీతం       ఏ లోకం లో విహరిస్తూ ... ఈ లోకాన్నే మరిచావే ...

                                                  నీకోసం నే వేచున్నా మౌనం గా ..

      నా రూపం లో జీవిస్తూ ... నా   సర్వం నువ్వయినావే ...

                                                  నా అనుమతి నడగ క ననువీడి వెళ్ళవు గా
     
       ఎందరితో కలిసున్నా నా మనసే నిను వెతికిందీ ..

       నా కనులకు నువ్వు కనరాక.. కన్నీరే పొంగిందీ ...              ! ఏ లోకం లో!


       నా గుండె సడి లో నువ్వు నూరేళ్ళు ఉంటావు ... నీ జతని వీడిన నా మది నేమిచేయమంటావు ?

      నా కనుల గుడిలో నువ్వు దేవతవు అయినావు ... ఇలలోనా చూపలేని కనులనేమి అంటావు?

      ఓ ప్రియతమా .. నా ప్రాణమే నీవు ...      నీ ప్రాణమే నాకిచ్చి వెళ్ళిపోయావు .....

      ఓ హృదయమా .. నా గానమే నీవు...   ఆ గగనమై నానుండి వేరు అయినావు

      నువ్వు లేని...  నే లేనే ... అడుగైన...    వేయలేనే .... జీవించమంటూ ఓ శాపమిచ్చి వెల్లావె ...! ఏ లోకం!


     నా ప్రేమ నదిలా నీవు .. నాలోనా ప్రవహించావు ...ఈ కడలి కౌగిలి నొదిలి ఏల మాయమైనావు ?

     పూలలో  సౌరభ  మల్లె నాలోనా ఒదిగావు .... రూపాన్ని విడిచి ప్రేమ వాసనల్లే మిగిలావు

    ఓ త్యాగమా ... నిను మించలేరె వరు  ...  ఓ అందమా నిను చూపగల వారెవరూ ?

    ఓ బంధమా ... నిను వివరించువారెవరు?  ఓ విరహమా ... నిను ఓడించ గలవారెవరు?

    ఓ చెలీ     చేరవా ... నీవు నాతోడూ .. ఓ సఖీ .. చావునే గెలిచి నను చేరూ ....


    ఏ లోకం లో విహరిస్తూ ఈ లోకాన్నేమరిచావే .. నీకోసం నే వేచున్నా మౌనం గా ....

    నా రూపం లో జీవిస్తూ ... నాసర్వం నువ్వయినావే ... నన్నే ఒంటరి చేసి ఎటువెల్లావే ?

    నీ మరణం సత్యం అయినా .... నీ స్మరణం నిత్యం చెయన...

    ఓ రూపం లేని నీడై నిను నాలో కనుగొన్నా .... ఏ లోకం లొ  

Wednesday, 29 January 2014

వెంటపడే ప్రేమ

అ : నీకోసం బెంగపడి భంగపడి చిక్కిపొయానమ్మా .. 

      నీవెంటే నేను పడి మనసు చెడి చులకనయ్యనమ్మా ..  

ఆ :  వృధా చేసావే సమయం .. నీతోనా నాకు ప్రణయం .. 

అ :  అవునంటే రాదే ప్రళయం .. కాదంటే కానే మాయం 

ఆ :  ఇలా నా కంట పడి వెంటబడి చెయ్యకు లే  పేచీ .. 

       అలా అలవాటు పడీ ఈ  కబడీ కుదరదు లాలూచీ .. 


అ ;  నీతో  నడిచాను నీడలా .. ఎండల్లో మారాను గొడుగులా .. 

       చూస్తావే నన్ను పీడలా .. నాతోనే నీకు క్రీడలా .. 

ఆ :  వద్దంటే వినవు ఏంటలా .. చెబుతుంటే నీకు మెంటలా .. 

       నన్నే ఫాల్లో అవకలా .. మరీ వేదించ కింతలా .. 

అ :   గుండెల్లో ప్రేమ దాచి పైపైనా విసుగు చూపించ కె అలా .. 

ఆ :   ప్రేమంటూ సోది చెప్పి నను పక్కదారి పట్టించ మాకలా ..      ఇలా 


ఆ :   నీకోసం కొంచెమైనా ఆలోచించే సమయం లేదురా .. 

        ఆకాశం అంచులోన నిరీక్షించే మనసే కాదురా .. 

అ :    ఆమాత్రం మాట చాలు నీ మనసు తలుపునే తట్టనా .. 

        ఏమాత్రం భయం లేని ఈ వయసు తీరు నే తెలపనా .. 

ఆ :    ఊహల్లో బ్రతుకుతూనే మేడల్ని గాలిలో కట్టకు .. 

అ :    ఆశoటూ లేకపోతే పడుతుందా అడుగు మరి ముందుకు ..  నీకోసం 


ఆ :   నన్నే నువ్ ఇష్టపడి కష్టపడి గెలుచు కున్నావేమో .. 

       ఇలా నా గుండె సడి వింత జడి నువ్వు అయ్యావేమో 

రుధిర సౌధం 62

గతుకుల మట్టి రోడ్ మీద సాఫీ గానే ముందుకు సాగుతుంది ఇన్నోవా .

కొంత దూరం లో కనబడుతున్న ఓ పాత కట్టడాన్ని చూపించి .. యష్ .. అదే నేను చెప్పిన గ్రంధాలయం .. అన్నాడు

శివ .

ఓహ్ .. అని దాన్ని పరీక్ష గా చూసాడు యశ్వంత్ .. ""'రాజా విక్రమ సింహ గ్రంధాలయం "" అని వ్రాసి ఉంది దాని

మీద .

ఆ అక్షరాలని చదువుతున్నపుడు రచన పెదవులపై ఓ సన్నని చిరునవ్వు విరిసింది .

ఇది చాలా పురాతన మైనది శివా .. నీ అంచనా సరైనదే కావొచ్చు .. మనకిక్కడ రాణి మహల్ వివరాలు

తెలియొచ్చు . అంది సత్య .

వెహికల్ ఆ గ్రంధాలయం ముందు ఆగింది . అందరూ కిందకి దిగాక శివ ఓ పక్కగా వెహికల్ ని పార్క్ చేసి వచ్చాడు .

మురారి గ్రంధాలయానికి కొన్ని ఫోటో లు తీసాడు ..

ఇక వెళ్దామా ? అన్నాడు యశ్వంత్ ..

అంతా  లోపలికి నడిచారు . గ్రంధాలయం మొదటి గదిలో ఓ పాత బల్ల వేసుకుని దాని ముందు ఉన్న కుర్చీ లో

ఒక ముసలాయన ఉన్నాడు ..

లోపలికి వస్తున్న వీరిని కళ్ళద్దాలు తుడుచుకొని మరీ చూశాడు .

ఎవరు మీరు ? వణుకు తున్న గొంతు తో అడిగాడు అందర్నీ నఖశిఖ పర్యంతం గమనిస్తూ ..

తాతా ! ఈ గ్రంధాలయం చాలా పురాతన మైనదని తెలిసి వచ్చాము .. పుస్తకాలవీ ఉన్నాయి కదా ? కాస్త

అనుమానం గానే అడిగింది రచన .

పుస్తకాలకేం ? .. ఉన్నాయి .. కానీ పుస్తకాల పురుగులెక్కడున్నాయి ?  వైరాగ్యం తో అన్నాడు  .

పురుగులా ? పురుగులేమిటి ? అసహనం గా అంది సత్య .

తాత గారి ఉద్దేశ్యం వేరు సత్యా .. పుస్తకాలు చదివే వాళ్ళు ఇప్పుడు లేరని .. అన్నాడు మురారి .

తాతా మేము కొన్ని పుస్తకాలు చదవొచ్చా ? అడిగాడు యశ్వంత్  అతడిని ..

చదవండి బాబూ .. కానీ నాకు కొంచెం డబ్బు ఇవ్వండి .. కాస్త ఎంగిలి పడి వస్తాను .. దీనం గా అన్నాడు తాత .

వెంటనే శివ 100 రూపాయల నోటు తీసి అతడి చేతిలో పెట్టాడు ..

అతని మొహం వికసించింది .. మీరు చదువు కొండి బాబూ .. నేనిప్పుడే వస్తాను .. అని మెల్లిగా లేచి అడుగులో

అడుగు వేసుకుంటూ బయటికి వెళ్లి పోయాడు .

యశ్వంత్ బృందం లోపలికి నడిచింది .. చాల వరకూ బుక్స్ లేవు . రాక్స్ కొన్ని ఖాలిగా ఉన్నాయి .. మరి కొన్ని

మాత్రం బుక్స్ తో ఉన్నాయి .. అవి కూడా సరైన సంరక్షణ లేక చెదలు పట్టి ఉన్నాయి ..

ఏంటో ఇలా ఉంది లైబ్రరీ .. అంది దుమ్ము పడకుండా ముఖాన్ని స్కార్ఫ్ తో కట్టేసుకుంటూ .. సత్య .

ఇలానే ఉంటుంది .. ఇంకా ఇది ఇప్పటి వరకూ ఉందంటే గొప్పే .. అన్నాడు యశ్వంత్ ..

త్వరగా పని పూర్తీ చేసుకోవాలి .. ఇదెప్పుడు కూలిపోతుందో భయం గా ఉంది .. అన్నాడు మురారి ..

శివ అప్పుడే ఏవో బుక్స్ తిరగేయడం మొదలు పెట్టాడు .

రచన మాత్రం ఆ గ్రంధాలయం గోడల మీదున్న పెయింటింగ్స్ ని శ్రద్ధ గా చూడటం లో నిమగ్న మయింది .

ముందు పని కానీండి .. ఏదన్న పుస్తకం మనకి పనికొస్తుందంటే బాగ్ లో వేసేయండి .. అన్నాడు యశ్వంత్ ..

దొరికిపోతామేమో యశ్వంత్ .. నవ్వుతూ అంది సత్య .

ఒత్తినే ఇక్కడ పుస్తకాలన్నీ మాయ మయి పోయాయను కుంటున్నావా ? అన్నాడు యశ్వంత్ ..

యశ్వంత్ కూడా రాక్ లో పుస్తకాలని తిరగేయసాగాడు .. కొన్ని రాజుల కథలు , స్వాతంత్ర పోరాటం గురించి ,కొన్ని

సాహిత్య గాధలు ,మరి కొన్ని సంఘ హితమైన బుక్స్ .. అతని చేతులు ఓ బుక్ మీద ఆగిపోయాయి .. ఆ పుస్తకం

అట్ట  కొంత మేర చినిగి పోయి ఉంది .. దాని మీద "విచిత్ర దుర్గం" అని వ్రాసి ఉంది . అతని చేతులు ఆ పుస్తకం

పేజీలను తిప్పుతున్నాయి .. కళ్ళు వికసిస్తున్నాయి .. అలానే గోడకి జారగిల బడి ఆ పుస్తకాన్ని చదవడం

మొదలు పెట్టాడు ..

అందరూ మెల్లిగా ఏదో ఒక పుస్తకం చదవనారంభించారు .

శివా .. గట్టిగా పిలిచాడు యశ్వంత్ ..

యష్ .. ఏవన్నా దొరికిందా ?? అంటూ వచ్చాడు శివ .

సి థిస్ బుక్ .. అన్నాడు యశ్వంత్ .

విచిత్ర దుర్గం  ... అంటే ? అన్నాడు శివ .

విచిత్ర దుర్గం అంటే ఒకప్పుడు ఈ ప్రాంతం .. ఈ చుట్టు పక్కల గ్రామాలు కూడా ఈ విచిత్ర దుర్గం కిందికే వస్తాయి .

ఇప్పుడంటే ఊరి పేర్లు మారిపోయాయి గానీ .. ఒకప్పుడయితే ఇదే విచిత్ర దుర్గం .. అని చెప్పాడు యశ్వంత్ .

యశ్వంత్ ,శివ మాటలు విని రచన ,సత్య ,మురారి కూడా వీరి దగ్గరకే వచ్చారు .

(ఇంకా ఉంది )

ఇంటి భోజనం (ఓ చిన్న కథ )

                                 ఇంటి భోజనం
 అరె  ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ పెరుగన్నం,పులిహోర,వైట్ రైస్ ,ముద్దపప్పు... ఇవేనా ?  తినాలి అంటే .... బోర్ 
కొడుతుంది ప్రియా ... విసుగ్గా అన్నాడు శరత్ . 
  శరత్ నీకీమధ్య బయట తిండి అలవాటు అయింది ... అందుకే వీటన్నింటిని వద్దంటున్నావు . ఐనా నీకోసం ఎంత 
ప్రేమగా చేస్తానో ఆలోచించావా? అంది ప్రియ ఓ పక్క శరత్ లంచ్ బాక్స్  సిద్ధం చెస్తునె. 
    నేనెంత చెప్పినా నువ్వేమన్నా వింటావా ? నీకు నచ్సినట్లే కానీ ... కాస్త కోపాన్ని అదుపు లో పెట్టుకునే అన్నాడు 
శరత్ . 
 సరె.. వేళకి తిను శరత్ ... చిరునవ్వుతో లంచ్ బాక్స్ బాగ్ ని అందించింది ప్రియ . 
అలాగే కానీ ..వారమ్ లో 2రోజులైనా నాకు నచ్చిన భోజనం చేయనీ ప్రియా.. అన్నాడు శరత్ .. 
వద్దు శరత్ .. బయటి భోజనం ఆరోగ్యానికి మంచిది కాదు... రుచికరం గ ఉందని అలవాటు చేసుకోవటం తోనే మొదలవుతున్ది.. అనారొగ్యమ్... నేనుండగా మీకే సమస్య రానీయను కదా... అంది స్థిరం గ ప్రియా . 
             సర్లే ... నేనైతే నీతో వాదించలేను .. ఆఫీసు కి టైం ఐంది గానీ నేనింక బయల్దేరుతాను .. అన్నాడు శరత్ 
సరే ... అంది ప్రియ చిరునవ్వు తో . 
            బైక్  స్టార్ట్ చేసి ఆఫీసు కి అరగంట లో చేరుకున్నాడు సరత్
                                                                              *  *   *  
ఆఫీసు లో లంచ్ టైం . 

        ఏం  శరత్ .. ఈరోజు కూడా మాతో పాటు లంచ్ కి రావటం లేదా నువ్వు? అడిగాడు  కొలీగ్ ప్రసాద్ . 
లేదు ప్రసాద్ ... నాకు లంచ్ ఉంది ... అన్నాడు శరత్ 
ఏంటి ఆ  పుళిహోరా ,దద్దోజనమేనా? నవ్వుతూ అడిగాడు ప్రసాద్ 
అవునన్నట్లు తలాడించాడు  శరత్ . 
ఏం ఫుడ్ బాస్ అది? హాయిగా ఏ పిజ్జా నో లాగించక. అన్నాడు ప్రసాద్ 
ఐనా ఆఫీసు లో అందరం క్యాంటీన్ తింటున్నాం కదా... కొత్త కొత్త రుచులు బయట అనేకం ఉన్నాయి బ్రదర్ ... అన్నాడు ప్రసాద్ . 
అవును ... ఈరోజైతే  నేను లంచ్ తెచ్చుకున్నకదా ... రేపు మీతో వస్తాను ప్రసాద్ ... అన్నాడు శరత్ 
సరే ఐతే నీ  లంచ్ కానివ్వు నేనీరోజు చీస్ పిజ్జా తిని వస్తాను అన్నాడు ప్రసాద్ . 
ప్రసాద్  అటు అలా వెళ్ళ గానే లంచ్ బాక్స్ ఓపెన్ చేసాడు శరత్ ... అబ్బా !ఎప్పుడు ఇవే తినాలా ? ఈరోజుకి బయట ఏ పిజ్జానో తింటేనో .... ప్రియ కే మన్నా తెలుస్తుందా ఏంటి ? కావలిస్తే ఇంటికి వెళ్లేముందు బాక్స్ ఖాళీ చేస్తే సరి అనుకున్నాడు శరత్ ... కానీ పాపం ఉదయాన్నే లేచి నాకోసం కష్టపడి అన్ని వంటలు చేస్తుంది ... నేను వీటిని పారేయ్యలేను కదా ... అనుకుని తినడం ఆరంభించాడు శరత్ . 
                                                                              ******
ఇప్పుడెం చేశావు ప్రియా   డిన్నర్ కి ? చేతులు శుభ్రం చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అడిగాడు శరత్ .. 
ఆమె నవ్వుతూ ప్లేట్ లో వడ్డించిన పదార్ధాన్నిచూసి ఆశ్చర్య పోయాడు శరత్ . 
పిజ్జా నా ?నాకోసం నువ్వు పిజ్జా తెప్పించావా ?అడిగాడు శరత్ 
లేదు ... నేనే చేశాను అంది ప్రియ చిరునవ్వుతో . 
పిజ్జా నా ?నీకిది చేయటం వచ్చా?అని అడిగాడు శరత్ ... 
వచ్చేది కాదు కానీ పక్కింటి రాణీ కి వచ్చు తన దగ్గర నేర్చుకున్నాను ... మీకిలాంటి ఫుడ్ అంటే ఇష్టం కదా ... అందుకే మీకు పిజ్జా చేసి పెట్టాలనుకున్నాను ...  రుచి చూసి చెప్పండి ఎలా వుందో ... అంది ప్రియ ఆత్రుత గా 
 నాకోసం తాపత్రయపడతావు ప్రియా ... అనుకొని ఓ చిన్న ముక్క తిని అద్భుతం అన్నాడు శరత్ 
సంతోషం గా నవ్వింది ప్రియ . 
                                                                           *******

ఏంటి బాస్ ఈ రోజు ఇంత డల్ గా ఉన్నారు  అడిగాడు శరత్ ప్రసాద్ ని . 
టైం చూసావా శరత్ 3గం దాటింది ... బాగా ఆకలిగా ఉంది ... అన్నాడు ప్రసాద్ 
అదేంటి ?ఇంతకూ ముందు మీరంతా లంచ్ కి వెళ్లారు కదా !ఏమి తినలేదా ?ఆశ్చర్యం గ అడిగాడు శరత్ 

బాస్ .. ఈరోజు సిటీ లో బంద్ .. కాంటీన్ కూడా ఈరోజు లేదు సరికదా ఒక్క రెస్టారంట్ కూడా ఈరోజు ఓపెన్ చేయలేదు ... ఫలితం ఈరోజు భోజనం లేదు అన్నాడు నీరసం గా ప్రసాద్ 
అయ్యొ... అలా ఐతే నాకు మీకు భోజనం ఆఫర్ చేయాలనీ ఉంది కానీ ఇలాంటి భోజనం మీకు నచ్చదు కదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు  శరత్ . 
అదేంటి నువ్వింకా తినలేదా అడిగాడు ప్రసాద్ 
వర్క్ ఉంది అందుకే తినలేదు ఐనా ఈరోజు హోలీ పండగ కూడా ...  నా వైఫ్ ఏవేవో specials చేసుంటుంది ... అన్నాడు గమ్మత్తు గ శరత్ . 

అయ్యో శరత్ బాగా ఆకలి గ ఉంది ... ఈరోజు నీ లంచ్ బాక్సే గతి నాకు ... అన్నాడు ప్రసాద్ 
సరే రా ... కలసి తిందాం అన్నాడు శరత్ 
ఇద్దరూ కలసి భోజనం ముగించారు ... 
ఏ మాట కా మాటే చెప్పాలి శరత్ .. ఇంత రుచికరమయిన భోజనం నేనెక్కడా తినలేదు ... నువ్వు అదృష్టవంతుడివి శరత్ .. నీ వైఫ్ నీకు ప్రేమ గ లంచ్ బాక్స్ కడుతుంది ... నా భార్య నాలాగే ఉద్యోగానికి వెళుతుంది ... తను లంచ్ ఏ రెస్టారంట్ లోనో చేస్తుంది ... నేను అంతే .. జీవితం యాంత్రికం అయిపోతుంది ... డబ్బు సంపాదిస్తున్నా మన్న మాటే గానీ జీవితం లో తృప్తి లేదు ..ఆ  అశాంతి తో ఉన్నా నన్న నిజం ఇప్పుడు అర్థమయింది . ఇంటి భోజనం ఆకలి తీర్చడమే కాదు మన ఆత్మీయుల ప్రేమ ని పంచుతుంది... ఇది నిజం బాసూ అన్నాడు ప్రసాద్ 

సంతృప్తి గా తల ఊపాడు శరత్ . 
                                                        ********************
ప్రియా .... ఈరోజు లంచ్ కొంచెం ఎక్కువ కట్టు అని చెప్పాడు శరత్ ... 
అదేమిటీ ....ఈరొజు లంచ్ కోసం ఇంత  శ్రద్ధ చూపిస్తున్నారు ... రోజూ నేను సిద్దం చేసే వంటకాలని గేలి చేస్తారుగా ... 
అంది ప్రియ 
నీ చేతి వంట తినాలంటే అదృష్టమే చేసుకోవాలి .... ఆ విషయం ఇప్పుడే అర్ధం చేసుకున్నాను ... చదువుకున్నా ఉద్యోగం చేయకుండా అనుక్షణం నాకోసమే పాటు పడతావు ... ఏంతో  ఇష్టం గా నాకోసం వంట చేస్తావు .... నాకేది ఇష్టమో తెలుసుకుని నేర్చుకుని మరీ నాకు వండి పెడతావు ....నాపై ప్రెమనీ..  . శ్రద్ధ నీ ఎంతగానో  చూపిస్తావు 
అలాంటి నీ ప్రేమని నేను గేలి చేసినందుకు నన్ను క్షమించు ప్రియా... అన్నాడు శరత్ 
ప్రియ కనుల నిండా నీళ్ళూ 
థాంక్స్ శరత్  ... నువ్వు నా కష్టాన్ని ప్రేమనీ గుర్తించావు .... అది చాలు .... నీకీ రోజు పిజ్జా పెట్టనా లంచ్ కి అని అంది 

లేదు ...నీ స్పెషల్ పులిహోర ,దద్దోజనం చాలు ... అన్నాడు శరత్ 
ప్రియ ఆనందం గా తల ఊపి వంటగదిలోకి వెళ్ళింది 
"ప్రసాద్ .... నీ వల్ల నా భార్య గొప్పతనాన్ని,ఇంటి భోజనపు రుచి విలువనీ తెలుసుకున్నాను థాంక్స్ "అని  మనసులోనే ప్రసాద్ కు కృతజ్ణతలు చేప్పుకున్నాడు శరత్ 

                                                              సమాప్తం  

చుక్కల్లో చందమామా .. నేలా దిగి రావమ్మా ..

చుక్కల్లో చందమామా .. నేలా దిగి రావమ్మా ..

గుండెల్లో భారం దింపి .. పున్నమి నే తేవమ్మా ..

మనసింట  బాధని ఆర్పి .. పెదవింట వెలుగై రామ్మా ..

కునుకంటూ ఎరుగని కన్నుల వెన్నెల వె కావమ్మా ... చుక్కల్లో చందమామా ... హొయ్


చినబోయినదమ్మ చిలకమ్మా .. పలుకైన లేనే లేదమ్మా

ఏం జరిగి ఉంటుందోయమ్మా ... ఎందుకని నొచ్చు కుందమ్మ ..

మిల మిల మెరిసే మోము .. వెలవెల బోతూoదేమి ..

కిల కిల నవ్వే సొగసరి .. వల వలా సోకాలేమి ?

నీకైనా తెలుసా జాబిల్లి .. కోపం గా ఉందేం సిరిమల్లీ ... చుక్కల్లో చoదమామా ... హొయ్


చిగురంటి పెదవుల పైన చిరునవ్వే అందమటమ్మా   ..

చినుకంత వేదన కూడా మనసుని నిలవనీయదు లెమ్మా ..

ఎండా వానా కలిసే రోజే హరివిల్లోస్తుంది ..

సుఖమూ దుః ఖం లోనే జీవితమూ దాగుంటుంది ..

గ్రహణమ్ము  వీడిన జాబిలీ .. వెలుగే నింపే లోగిలి... చుక్కల్లో చందమామా .. హొయ్  

రుధిర సౌధం 61కొంచెం తటపటాయించినా లోపలికి అడుగు పెట్టింది సరస్వతి .

సరే నేను టిఫిన్ తీసుకొస్తాను .. అని మురారి బయటికి  వెళ్ళాడు ..

తలుపులు దగ్గరగా మూసి .. పద సరస్వతీ .. అంది రచన .

ఇద్దరూ యశ్వంత్ వాళ్ళు కూర్చున్న చోటికి వచ్చారు ..

ఎలా ఉన్నావు సరస్వతీ ? ఆర్ద్రం గా అడిగాడు యశ్వంత్ ..

సత్య .. "ఈమె నా .. వీళ్ళందరూ చెప్పే సరస్వతి"" .. అని మనసులో అనుకుంది .

యశ్వంత్ ప్రశ్న కి కళ్ళ నీళ్ళ పర్యంత మయింది సరస్వతి ..

బాధ పడకు సరస్వతీ .. నీకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది .. కాని గుండె నిబ్బరం చేసుకోక తప్పదు .. అంది

రచన .

ధాత్రి గారూ .. ఈ బాధ ఎప్పటి కయినా తప్పదని నాకూ తెలుసు .. కానీ నా భర్త మామూలు గా చచ్చి పోలేదు

కదమ్మా ... నా మనసు నాకు చెబుతోందమ్మ .. వాడి ఆత్మ ఘోషిస్తుందని .. అని వెక్కి వెక్కి ఏడ్చింది సరస్వతి ..

ఎందుకు సరస్వతీ అలా అంటున్నావు ?? అంది రచన ..

యశ్వంత్ ,శివ ,సత్య ఆమె వైపు ఆసక్తి గా చూసారు ..

ఒకే మనసుగా బతికేవోలం .. నాకు తెలవదా ... బాబూ .. ఆరోజు పోలీసు లు వచ్చిండ్రు కదా .. మీతో ఏం సెప్పినారు

? నా పెనిమిటి ని ఎవరో చంపేసిన్రని సెప్పిన్రా ? ఆవేదన గా అడిగింది సరస్వతి .

అవును సరస్వతి .. నీ భర్త ని చంపేశారు .. అది సహజ మరణం కాదు .. అలా అని వైజయంతి కూడా చంపలేదు ..

అనుమానా లున్నాయి .. కానీ ఋజువులు కావాలి .. నేను నీకు మాటిస్తున్నాను .. నీ భర్త ని చంపిన వాడిని

శిక్షించ కుండా మేమీ ఊరి నుండి కదిలేది లేదు ... అన్నాడు యశ్వంత్ .

మాకు భూపతి కన్నా శత్రువు లెవరు బాబూ .. ఆయన ఉన్నోడు .. నేను పోరాడగాలనా ఏమి ? అంది సరస్వతి ..

మేమంతా నీకు తోడుగా ఉన్నాం కదా .  అని సరస్వతీ .. నిన్ను ఓ విషయం అడగాలి .. అన్నాడు యశ్వంత్ .

అడగండి .. అని పమిట చెంగు తో కళ్ళను ఒత్తుకుంది ..

ఆ రోజు రాత్రి .. అదే ఆ అమావాస్య రాత్రి ... ఊరిలో ఎవరూ మహల్ వైపు వెళ్ళరు .. కానీ రాముడు వెళ్ళాడు ..

రాముడు అక్కడ వెళ్ళటం నీకు తెలియదా ? అని అడిగాడు యశ్వంత్ ..

తెలీదు బాబూ .. నిజానికి ఆ డికి ఆ రోజు ఒంట్ల బాలేదు బాబూ .. పెందలకడే పడుకున్నడు .. పనులు ముగించు

కొని నేనూ ,తాత కూడా నిద్దర పోనాం .. ఉదయాన్నే నాలుగింటికి లేవటం మాకలవాటు .. ఉదయం లేసి నప్పటికి

మా మావ లేడు .. ఎక్కడికి పోతడు ? ఏ తోట కాడికో పోయిండను కున్నాను .. కానీ మళ్లి తిరిగి శవమై వస్త డను

కోలే ... అని భోరుమంది సరస్వతి .

సరస్వతీ .. నువ్వో సారి పోలీసు స్టేషన్ కి వొఛ్చి ఈ వివరాలన్నీ చెప్పాలి .. చెబుతావా ? అన్నాడు యశ్వంత్ ..

నేనేనాడు ఆడికి పోలేదు బాబూ అంది .. సరస్వతి .

నువ్వేం భయపడకు మేము నీకు తోడుగా ఉంటాం గా .. ధాత్రి కూడా వస్తుంది .. అన్నాడు యశ్వంత్ .

అయిష్టం గానే వోప్పుకుంది సరస్వతి .

 ఈలోపు  మురారి అందరికి టిఫిన్స్ పట్టుకు వచ్చాడు .

బాబూ .. మీరు తినండి .. నేను వెల్లొస్తాను .. మీతో మాటాడాక నాకు కొంచెం శాంతం గా ఉంది అని లేచింది

.. సరస్వతి .

అదేంటి సరస్వతి .. నువ్వూ మాతో కొంచెం తిను .. ఎప్పుడు తిన్నావో ఏమో అంది రచన .

ఎంత అభిమానం చుపిస్తున్రమ్మ .. అదే పదివేలు .. ఈ ఇంట అడుగు పెట్టినానని భూపతి కి తెలిస్తే ఏమవుద్దో ...

నేను వెల్లొస్తను ,, అని వడి వడి అడుగులతో అక్కడి నుండి సరస్వతి వెళ్ళిపోయింది .

పాపం .. చాలా మంచిది లా ఉంది అంది సత్య ..

ముందు అందరూ టిఫిన్స్ చేయండి .. అన్నాడు మురారి .

అందరూ టిఫిన్స్ చేయడం లో మునిగి పోయారు ..

యష్ .. మొన్న నేను పోలీసు కి ఇన్ఫొర్మ్ చేయటానికి వెళ్ళినప్పుడు గమనించాను .. ఇక్కడ కొంత దూరం లో ఓ

పురాతన గ్రంధాలయం ఉంది .. నాకు తెలిసి ఆ గ్రంధాలయం లో ఈ రాణి మహల్ కోసం ఏమైనా బుక్స్

ఉన్నాయేమో ... అన్నాడు శివ .

గుడ్ ఐడియా శివా .. మనం టిఫిన్స్ కానిచ్చాక వెళ్దాం . అన్నాడు మురారి ..

"ఇక్కడ ఆ మహల్ వారసురాలే ఉంది .. ఈ విషయం తెలిస్తే మీరంతా ఎంత షాక్ అవుతారో .. రచన కి ఈ మహల్

చరిత్ర తెలియకుండా ఉంటుందా ? " అని మనసులో అనుకున్నాడు యశ్వంత్ ..

నాకూ తెలుసుకోవాలనుంది .. మనం అక్కడికి వెళ్దాం అంది సాలోచన గా రచన .. స్పూన్ ని పెదవులపై పెట్టి .

(ఇంకా ఉంది )


Tuesday, 28 January 2014

ప్రేమ

ప్రేమ

 ప్రేమంటూ ఉంటే .. మనిషి కి మనసూ మరి ఉంటుంది ...
ఆ ప్రేమందకుంటే ... మనసుకి ఉరి వేసినట్టుంది ..
దాసోహము .. ప్రేమకు ఈ హృదయము ...
ఈ దాహమూ .. తీర్చే ప్రేమామృతము ...

ఈ భూమి పుట్టక ముందే ఆ ప్రేమ పుట్టింది ..
మరు భూమి చేరినా ... ప్రేమ కు మారు పేరు లేకుందీ ..
ఆ నింగి సాక్ష్యం కనుకే ప్రేమే నిలిచుంది
కాలాలు మారుతున్నా నిలిచి ఉన్నానంటుంది

కన్నీరూ తానేనంది చిరునవ్వు లోను ఉంది
కష్టాలు ఇష్టాలు తన నైజమంటు చెబుతుందీ ..
అభిమానమై ఉంటుందీ .. అనుమానమే రేపింది
అవమానమైనా గాని తన రూపమే అంటుందీ

త్యాగాన్ని కాంక్షి o స్తుందీ ... స్వార్థాన్ని పుట్టిస్తుందీ ..
ప్రాణాల్ని తీస్తుంది .. బ్రతుకుల్ని నిలబెడు తుందీ ..
పాపాల్ని చేయిస్తుంది .. శాపము అవుతుందీ ..
వరమాల వేయిస్తుంది   శ వమల్లె మార్చేస్తుంది ..

ప్రళ యాన్ని సృష్టిస్తుంది .. విలయాన్ని కవ్విస్తుంది
ప్రణవమై నర్తిస్తుంది  ప్రణయము తానయ్యింది
గరలమే కురిపిస్తుంది అనలమై జ్వలియి స్తుంది
మరణాన్ని ఎదిరిస్తుంది రణ ము గా ఎదురొస్తుంది

గతమంతా తానె ఉందీ .. భవితకి స్వాగతమంది
నేడైనా రేపైన .. ప్రతి మది ని పలకరిస్తుంది
తొలకరి వానవుతుంది .. పులకరింతల్లో ఉంది
ఎండలో మంచవుతుంది .. మంచులో ఎండ వుతుంది

పూలలో పరిమలమైంది .. గాలిలో గంధం అయింది
మాలలో దారం అయింది .. లాలి లో రాగం అయింది
రూపమే వేరంటుంది .. అపురూప మై ఉంటుంది
బంధమై జీవిస్తుంది .. అనుబంధమై ఎదిగింది

కవిత లో  భావమయింది .. కలత లో తోడూ అయింది
నిదుర లో హాయి అయింది .. మధుర లో లీల అయింది
బాధలో ముభావమయింది .. రాధ లో ఆరాధనయింది
గాధ లో విజయమయింది ..  బోధ లో లీనమయింది

ద్వేషమై మొదలవుతుంది .. దేశమే గులామవుతుంది
దోషమే చూడను అంది .. ఘోష గా గర్జిస్తుంది
మోసమే కానని అంది ..  మౌనమే వద్దని అంది
 ఆకసమే తను నిండింది ..  గానమై చెలరేగింది

ప్రేమంటే ప్రేమ కెపుడు ప్రేమేలే అని అంటుంది
ప్రేమించు మనసు లో ప్రేమే పండగ అవుతుంది 

రుధిర సౌధం 60యష్ .. ఏంటి ? చాలా దీర్ఘాలోచన లో ఉన్నట్టు ఉన్నావు ? యశ్వంత్ దగ్గరికి వచ్చి అంది రచన .

ఏం లేదు రా ... భూపతి నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నా .. మొన్న రాముడి చావు విషయం లో

అతడ్ని మనం ఎదురించి నందుకు మనకి భోజనం కట్ చేసాడు .. ఇప్పుడు మనం వాళ్ళు దాచి పెట్టిన జాడీ

మాయం చేశాం .. కాబట్టి మనల్ని ఈ వూరి నుంచి పంపిoచేయాలని  ఇప్పుడు చూస్తాడు .. అతని ఎత్తుగడ కి

ముందు గానే మనం పై ఎత్తు వేయాలి కదా .. అదే ఆలోచిస్తున్నా .. అన్నాడు యశ్వంత్ .

దానికేం టెన్స్ పడాల్సిన అవసరం లేదు యశ్వంత్ .. నువ్వేం వర్రీ కాకు .. పరిస్థితి శ్రుతి మించితే ఏం చేయాలో

నాకు  తెలుసు .. నా దగ్గర బ్రహ్మాస్త్రమే ఉంది .. కాని పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని  ఆలోచిస్తున్నాను .. అంది

రచన చిరునవ్వు తో .

నీ బ్రహ్మాస్త్రం ఏంటో మరి ? నాకు చెప్పవూ ... గోముగా అడిగాడు యశ్వంత్ ..

అబ్బా .. అప్పుడే చెప్పేస్తామేంటి ? లెట్స్ వెయిట్ సం టైం .. అంది రచన కొంటెగా ..

అయిపోయాయా కబుర్లు ? ఇద్దరూ ఒకరి చెవి ఒకరు కొరికేసు కుంటున్నారు .. ఇక ఇన్వెస్టిగేషన్ మాట

దేవుడెరుగు... మనం వీళ్ళిద్దరికీ కాపలా కాయాల్సిందే .. అంది సత్య నవ్వుతూ ..

శివ ,మురారి నవ్వేసారు .

అంతలేదు సత్యా .. ఇక్కడ రచన .. అంది రచన కల్లెగరేస్తూ .

సరేలే .. ఏం చేస్తాం ? ఎంత వారలైన కాంత దాసులే .. యశ్వంత్ లాంటి వాడే నీకు గులాం ఐనప్పుడు మాకెవ్వరికి

నిన్ననే ఛాన్స్ ఉంటుందా ? అంది సత్య .

అది సరే  గాని సత్యా .. ఆకలేస్తుంది .. తినడానికేమన్నా .. ఉన్నాయా ? అంది రచన .

మనం తెచ్చుకున్న కేక్స్ ,బిస్కట్స్ ,నూడుల్స్ పాకెట్స్ అన్ని అయిపోయాయి .. కేవలం కొన్ని ఏపిల్స్ మాత్రమె

ఉన్నాయి .. నేనవి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళింది సత్య .

యష్ .. మనం ఫుడ్ కి కూడా ఏదన్నా ఏర్పాటు చేసుకోవాలి .. ఓసారి ఈ వూరు దాటి బయటకి వెళ్తే .. మన వాళ్లకి

ఫోన్స్ చేసుకోవొచ్చు .. ఏవన్నా తినడానికి తెచ్చుకొవోచ్చు.. అన్నాడు శివ .

ఓకే శివా .. వెళ్దాం .. కానీ అందరం ఒకేసారి ఊరు వదిలి వెళ్ళడం మంచిది కాదు .. ఒకసారి కొంతమంది ,మరోసారి

కొంత మంది .. అలానే వెళ్దాం .. పెట్రోల్ కూడా స్టాక్ పెట్టుకోవాలి .. అన్నాడు యష్ .

సరే .. అన్నాడు శివ .. ఈలోపు సత్య ఏపిల్స్ పట్టుకొచ్చింది .

 యష్ .. ఈ పక్కనే చిన్న హోటల్ ఉంది .. ఇడ్లి దొరుకుతుంది .. నేను వెళ్లి అందరికి తీసుకొస్తాను .. అన్నాడు

మురారి లేస్తూ .

సరే వెళ్ళు .. అని తలో ఆపిల్ అందుకున్నారు ..

ఇంతలో ఎవరో తలుపు కొట్టిన సవ్వడి వినిపించింది ..

బయటకి వెళ్ళడానికి గుమ్మం వరకు నడిచిన మురారి .. ఓ క్షణం ఆగి వెనక్కి తిరిగి వీరందరి వైపు ప్రస్నార్థకం గా

చూశాడు .

రత్నం ఏమో .. అంది రచన నోట్లో ఆపిల్ తీస్తూ ..

తలుపు తీయమన్నట్లు కళ్ళ తోనే సoజ్ఞ చేసాడు యశ్వంత్ .


మురారి తలుపులు తీసాడు .. ఎదురుగా సరస్వతి ..

మురారి ఆమె వంక ప్రశ్నార్థకం గా చూశాడు ..

యశ్వంత్ బాబు ఉన్నారా ? బలవంతం గా మాట

పెగల్చుకొని అంది సరస్వతి .

సరస్వతి .. యశ్వంత్ .. అని వడివడిగా గుమ్మం దగ్గర

కి నడచి .. సరస్వతీ .. రా లోపలికి .. అంది రచన.

ధాత్రమ్మ ... భర్త చనిపోయినాక ఎవరింటా కాలు

పెట్టకూడదు ఈ ఊరిలో .. కానీ నేను కూసింత మీతో

మాటాడాలి ..

అంది సరస్వతి .

ముందు లోపలికి రా సరస్వతీ .. ఏం ఫరవాలేదు .. మాకలాంటి భావాలేం లేవు కదా .. అంది రచన .

(ఇంకా ఉంది )

Monday, 27 January 2014

రుధిర సౌధం 59మే బి .. యష్ . వాళ్ళ ఉద్దేశ్యం లో రాముడు ఒక పావు మాత్రమె .. ఐ మీన్ బలి ఇచ్చారు .. అంతే .. అన్నాడు

మురారి.

సరే .. ముందు వాళ్ళెం పాతి పెట్టారో తెలుసుకోవాలి .. ముందు అక్కడ తవ్వి చూద్దాం .. అన్నాడు యశ్వంత్ .

మళ్ళి అందరు రచన చూపించిన స్థలం దగ్గరకి వచ్చారు ..

ఇక్కడే అని చూపించింది రచన .

నిజమేనా ? ఇక్కడయితే ఏమి పాతి పెట్టిన ఆనవాళ్ళు లేవు .. అన్నాడు శివ .

కాని ఇక్కడే శివ .. వాడేదో మంత్రం చెప్పాడు .. అందుకే నేల ఇలా ఉంది .. ఎవరికీ అనుమానం రాకుండా అయి

ఉండొచ్చు  .. అంది రచన .

మురారి అందుబాటు లో ఉన్న ఓ కర్ర తీసుకుని అక్కడ తవ్వటం మొదలు పెట్టాడు . శివ కూడా మరో కర్ర తీసుకొని

మురారి కి సహాయం చేసాడు ..
 


యశ్వంత్ ,రచన  తీక్షణం గా మట్టి వైపే చూస్తున్నారు ..

సత్య వాళ్ళు తవ్వుతుంటే మట్టి పక్కకి తొలగిస్తోంది ..

శివ కర్ర కి ఏదో తగిలింది .. ఏదో ఉంది అని మరింత ఉత్సాహం గా

తవ్వసాగాడు శివ ..

మట్టి పొరలు లోంచి ఓ జాడీ బయట పడింది .. దాన్ని చూడగానే రచన

మొహం వికసించింది .. దొరికింది... అంది .

యశ్వంత్ తన రెండు చేతులతో ఆ జాడీ ని బయటకి తీసాడు ..

ఇదొక గాజు జాడీ .. అన్నాడు శివ .

ఇందులో ఏమి లేదు అంది సత్య ..

ఉంది సత్యా .. ముందు ఆ మట్టినంతా ఆ గోతిలో వేసి పూడ్చేయండి అన్నాడు యశ్వంత్ ..

మురారి, శివ ఇద్దరూ ఆ పనిలో పడ్డారు ..

యష్ జాడీ మూత తీద్దామా ? అoది రచన ..

ఆ మూత తీయటానికి ప్రయత్నించాడు యశ్వంత్ ..రాలేదు ..

ఇది చాలా టైట్ గా  బిగించి ఉందే .. రావటం లేదు అన్నాడు వగరుస్తూ యశ్వంత్ ..

అందరూ ఒకరి తర్వాత ఒకరు గట్టి ప్రయత్నమే చేసారు .. ఐన ఫలితం లేకపోవటం తో .. యష్ .. ముందు ఇక్కడి

నుంచి వెల్లిపోదాం .. ఆ వీరాస్వామి వస్తే సమస్య అవుతుంది .. అంది రచన .

సరే అని ఆ జాడీ ని తన భుజానికి ఉన్న బాగ్ లో భద్రపరచి లెట్స్ గో .. అన్నాడు యశ్వంత్ ..

మరి కాసేపట్లో వారు అడవి దాటారు .. ఇంకాసేపట్లో ఇంటికి చేరారు ..

ఇంటికి చేరాక మళ్ళి జాడీ మూత తీయటానికి ప్రయత్నించారు ..

అబ్బా !ఎలా తీయటం దీన్ని ? అని విసుక్కుంది సత్య ..

నాకిలా ఇవ్వు మరోసారి ప్రయత్నించనీ .. అని రచన అడిగింది ..

బరువుగా ఉన్న ఆ జాడీ ని రచన అందుకొనే లోపు సత్య చేతి నుండి కిందకి జారి నాలుగు ముక్కలైంది ఆ జాడీ ..


అంతే .. ఆ జాడీ లోంచి విసురుగా ఓ గాలి వచ్చి తక్షణం

మాయమయింది ..

అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ..

ఏం జరిగింది ? జాడీ లోంచి బసవరాజు వెళ్ళిపోయాడా ?

వణుకు తున్న గొంతు తో అంది సత్య ..

అవును మనకి కనీసం థాంక్స్ కూడా చెప్పకుండానే ..

అన్నాడు శివ ..

రచన చిన్నగా నవ్వి .. జాడీ పగిలితే పగిలింది .. బసవరాజు కి విడుదల .. ఐ యాం హ్యాపీ .. అంది నిట్టుర్చుతూ ..

కానీ యష్ .. వాళ్లకి మనమే ఆ జాడీ తీసామని తెలియడం పెద్ద కష్టం కాదు .. కాబట్టి మనకి భూపతి ఇక ప్రత్యక్ష

శత్రువే కాగలడు .. అన్నాడు మురారి .

అవును మురారి .. అడుగడుగునా ప్రమాదాలు ఉండొచ్చు .. మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అన్నాడు యశ్వంత్

ఒక్క విషయం లో మాత్రం నాకు హ్యాపీ గా ఉంది .. రాముడి హత్య వైజయంతి చేయలేదు .. సో ఆరోజు అమావాస్య

హిస్టరీ ని మనం నిజం గానే బ్రేక్ చేసాం .. అన్నాడు శివ .

"కానీ ఇటు భూపతి , అటు వైజయంతి ఇద్దరూ ఇప్పుడు అవకాశం కోసం చూస్తారేమో " మనసులోనే

అనుకున్నాడు  యశ్వంత్ .

(ఇంకా ఉంది )
     

Naa Rachana: రుధిర సౌధం 59

Naa Rachana: రుధిర సౌధం 59

Saturday, 25 January 2014

ఓ ఆడ జన్మా ? నువ్వు ఆటబొమ్మా

అడుగు అడుగు ఎందుకు తడబడిందో ..

అడుగు మనసు ఎందుకు భయపడిందో ..

ఏ దిక్కు నుండి ఏ ప్రళయం ముంచుకొస్తున్నదో ...

నిను ధిక్కరించి ఏ విలయం నీ వెంట బడుతున్నదో ..

ఓ అతివా .. ఓ మగువా .. నీ జన్మపాప మేంటి ?

ఓ ముదితా .. ఓ .. వనితా .. నీ చుట్టూ శాప మేంటి ?  !అడుగు !

కాల మెంత మారినా ఆధునికత ఎంత మరి పెరిగినా ..

మగవాడి కర్కసత్వాన ఆడ బతుకే కుములుతుంది ..

గడప దాటి నువ్వు కదిలినా .. అంతరిక్షాన్ని తాకినా ..

ఆట బొమ్మ వని తలచిన మగజాతి వెంట బడుతుంది ..

ఓ సహన శీలి .. అనురాగ కడలి .. నీ మది మధించి ..

నిలువునా నిను దహించి .. .... మహరాజులల్లె తిరిగే మగ పులులే .. !అడుగు !

పాలుగారే పసితనాలే కామంధుల చేతిలో వసి వాడు మొగ్గలై ..

ఏ చూపు లోన ఏ దురుద్దేశ్య ముందో .. ఆణువణువూ నిన్ను అది తడుము తుందో ..

నింగి కెగసిన కెరటమై ఎన్నెన్ని సాధించినా ..ఏ పడగ నీ గొడుగు లా కాచుకున్నాదో ..

మహలక్ష్మి నీవేనని తలచు వారేరమ్మ ? మృగ తృష్ణ కబలించగా వణికే నీ జన్మ .

పది మంది పగబడితే ఆది శక్తి వి కాని ఆశక్తురాలివై గాలిలో కలిసెవె ..

కన్నీటి చెమ్మా .. ఓ బాపు బొమ్మా .. దైవాని కయినా చెప్పి రావమ్మా ..

ఆడ జన్మే వద్దు .. ఈ ఆవేదనోద్దు ... నేల పై జీవించలేనని చెప్పమ్మా ..అందరికీ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

డియర్ రీడర్స్ .. 

రేపే గణతంత్ర్య దినోత్సవం ... భారత జాతికి పండుగ రోజు .. దేశభక్తి పెల్లుబికే రోజు .. కానీ నేటి తరం ఇలాంటి 

రోజులని మరచిపోతుంది . ఈ కింద రాసిన పాట నా చిన్నతనం లో ప్రతి స్వాతంత్ర్య దినోత్సవానికి ,గణతంత్ర్య 

దినోత్సవానికి జెండా ఎగురవేసాక పాడే వాళ్ళం ..  ఇప్పటికి శ్రీకాకుళం జిల్లా ,సారవకోట మండలం లో చాలా 

స్కూల్ లలో ఈ పాట ని పాడు తున్నారు .. కానీ ఈ పాట రాసిన వారిని మాత్రం వాళ్ళెవరు ఎరుగరు . 

ఈ పాట రచయిత కె . నాగేశ్వర రావు గారు .. సారవకోట మండలం ,నౌతల గ్రామం లో టీచర్ గా పని చేస్తున్న 

దశ లో ఆయన స్వయం గా పాటలు వ్రాసి విద్యార్థుల చేత పాడించేవారు . అలా వ్రాసిన పాటల్లో ఈ పాట కూడా 

ఒకటి . ఆకాలం లో బాగా ప్రాచుర్యం పొందిన పాట ఇది . ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థిని గా ఇది నా చిన్న 

నాటి జ్ఞాపకం . ఆయన కుమార్తె గా ఈ పాట ని ఈ సందర్భం గా మీ అందరికి తెలియజేయటం నా సంతోషం . 

అందరికీ గణతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు . జై హింద్ నేడే గణతంత్ర్య/ స్వాతంత్ర్య  దినోత్సవం .. 

భారతీయులకు నవోదయం .. 

భారతావనికి శుభోదయం .. 

నవశకానికి నాందీ దినం ..   !నేడే !

ఐక్య భారతం వెలసింది లౌకిక భావం తో ... 

బానిసత్వం లేదింకా భారత దేశం లో ...   2

సమతా భావం మన ఆదర్శం .. ప్రజాక్షేమమే మన లక్ష్యం .. 2

ఎగరేద్దాం మన జాతి పతాకం .. 

ఎగరేద్దాం మన జాతి పతాకం .. ! నేడే !

Friday, 24 January 2014

రుధిర సౌధం 58


అప్పుడే తెలవారుతోంది .. తూర్పు ఎర్రగా ఉంది .. పల్లె నిద్రలేవటానికి సమాయత్త మవుతూ వుంది ..

యష్ .. తెల్లవారక ముందే మనం ఇక్కడ కొఛ్చెసామ్ .. బాగానే ఉంది .. కాని రచన ఇంకా రాలేదు .. తను రాక

పొతే మనకి దారెలా తెలుస్తుంది .. అన్నాడు శివ .

రచన వస్తుంది శివా .. తను బంగ్లా నుండి రావాలి కదా ఆలస్యం కావొచ్చు .. బట్ రచన త్వరగానే వస్తుంది .. తన

ఉత్సుకత గురించి మనకి తెలియదా .. అన్నాడు యశ్వంత్ .

యష్ .. రచన వస్తుంది అదుగో .. అన్నాడు మురారి ..

ఉదయపు కాంతి ఆమె మొహం మీద పడి అందం గా  మెరుస్తుంది ..

కంగారు గా వీళ్ళ దగ్గరకి పరుగున వచ్చింది రచన ..

లేట్ అయ్యానా ? అంది వగరుస్తూ ..

కొంచెం .. ఏమయ్యింది ? అని అడిగింది సత్య .

ఏం చేయను ? రత్నం నేనెక్కడికి వెళ్ళినా వెనుక వస్తానంటాడు .. ఆ బాలయ్య నిద్రలేవక ముందే నేను వచ్చేయాలి

గా .. వెంగమ్మ ఒక్కతే లేచింది .. మార్నింగ్ వాక్ అని చెప్పి వచ్చేసా .. అంది రచన .

రచనా .. ముందు మనం ఎటు వెళ్ళాలో చెప్పు .. అన్నాడు మురారి .

అటు .. ఆ మట్టి రోడ్ లో కొంచెం నడిస్తే ఒక అడవి వస్తుంది .. అక్కడికే వెళ్ళాలి మనం .. అంది రచన .

ఐతే పదండి .. మనల్ని ఎవరూ గమనించక ముందే మనం ఇక్కడి నుంచి ఆ అడవిలోకి వెళ్ళాలి అని యశ్వంత్

ముందుకి సాగాడు . మిగతా వారంతా యశ్వంత్ ని అనుసరించారు .. కాసేపట్లో అందరూ మట్టి రోడ్ దాటి అడవిలోకి

ప్రవేశించారు .. రచన ముందు వెళ్తుంటే మిగిలిన వాళ్లు ఆమెని అనుసరించారు .. ఇంతలో అటునుంచి ఎవరో

వస్తున్న సవ్వడి వినిపించింది ..

ఎవరో వస్తున్నారు అంతా తలో దిక్కు దాక్కోండి .. అంది రచన .

యశ్వంత్ రచన ఒక వెడల్పాటి చెట్టు వెనక నక్కారు .. శివ ,మురారి,సత్య అక్కడున్న పొదల వెనుక దాక్కున్నారు .

క్రమేపీ ఆ వ్యక్తి దగ్గరైన సవ్వడి వినిపించింది .. రచన కొo చెం తొంగి చూసింది .. అతడు వీరాస్వామి ..

యష్ .. వాడే .. ఆ వీరాస్వామి .. యష్ చెవిలో గొణిగింది మెల్లిగా ..

యశ్వంత్ కూడా కొంచెం తొంగి చూసాడు .. ఆగి ఆగి .. చుట్ట తాగుతూ వెళ్తున్నాడు ..

యశ్వంత్ అతడిని పరీక్షగా చూసాడు .. నిద్రలేని కళ్ళు .. వాటం చూస్తే ఊరి వైపే వెళ్తున్నట్లు ఉన్నాడు .. అతడు

అక్కడనుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరూ బయటకి వచ్చారు ..

ఎవరై ఉంటాడు అడవిలోంచి వస్తున్నాడు అన్నాడు శివ ..

శివా .. వాడే ఆ వీరాస్వామి .. పోన్లే వాడిప్పుడే బయట కి వెళ్తున్నాడు .. ఈలోపే మనపని కానిచ్చుకోవాలి .. అంది

రచన.

లెట్స్ గో గైస్ .. వాడు వచ్చేలోపే మనం అక్కడకి చేరాలి అని ముందుకి నడిచాడు యశ్వంత్ ..

అందరూ కలసి కాసేపట్లో బసవరాజు సమాధి దగ్గరకి చేరుకున్నారు ..

శివ ఆ ప్రాంతాన్ని అంతటినీ వీడియొ తీస్తున్నాడు .. మురారి సమాధి ని పరీక్ష చూస్తూ అదెప్పుడు కట్టబడిందో

అంచనా వేయసాగాడు ..

ఇదుగో ఇక్కడే ఏదో పాతి పెట్టారు .. అని వీరస్వామి పాతి పెట్టిన స్థలం చూపించింది రచన యశ్వంత్ కి ..

యశ్వంత్ .. ఓసారి ఇటు చూడు .. ఇక్కడ ముగ్గు వేసి ఉంది .. నిమ్మకాయలు కూడా .. గట్టిగా అరచింది సత్య ..

సత్య నిలుచున్న దగ్గరికి అందరూ పరుగున వెళ్లారు .. శివ వెంటనే ఫోటో తీసాడు ..

చూసావా యష్ .. మన అనుమానం నిజమే ఇదంతా క్షుద్రపూజలె .. ఇలాంటి ముగ్గులు నిమ్మకాయలు .. ఆ రక్తం ..
ఇంకా అనుమానం అక్కర్లేదు .. అన్నాడు మురారి .

నిజమే గానీ మురారి .. రాముడు చనిపోయాడు కదా .. కానీ ఈ ముగ్గు, నిమ్మకాయలు చూస్తే నైట్ వీరస్వామి

ఇక్కడే ఉన్నట్లున్నాడు ... అంటే వీల్లింకా ఈ పని కంటిన్యూ చేస్తున్నారా ? అన్నాడు యశ్వంత్ .

(ఇంకా ఉంది )

వి ఐ పి దేవుడా గోవిందా ..
                                                                                               గోవింద గోవింద గోవింద  2 గోవింద ...

హరి గోవిందా ..2

గోకుల బాలా గోవిందా హరి గోప కిశోర గోవిందా ..

ఏడు కొండలు ఎక్కి గోవిందా .. కాలి నడకన వచ్చి గోవిందా ..

శరణు శరణు అని గోవిందా .. ముమ్మార్లు తలిచెము గోవిందా ..

గోవిందా హరి గోవిందా హరి గోవిందా హరి గోవిందా ..


మెట్టు మెట్టు నెక్కి గోవిందా .. గట్టు పుట్ట దాటి గోవిందా ..

నీ నామ జపము చేస్తూ గోవిందా .. కష్ట మంతా మరచి గోవిందా ..

నీ వైపు నడిచేము గోవిందా .. నీ చూపు కోరాము గోవిందా .. 2

మొక్కుల్ని తీర్చంగా గోవిందా .. తల నీలాలు ఇవ్వంగ గోవిందా ..

పిల్లా పాపల తోనూ గోవిందా .. ముసలి ముతకా తోడా గోవిందా

దూర దురాల్నుంచి గోవింద .. నీ కొరకు వచ్చాము గోవిందా 2

ఆపదలు బాపేవు గోవిందా .. కోర్కెలు తీర్చేవు గోవిందా ..

కష్టాలు  కడతేర్చు గోవిందా .. మా ఇష్టాలు ఒన గూర్చు గోవిందా ..

ముడుపులు  తెచ్చాము గోవిందా .. నీ వడ్డీలు తీర్చేము గోవిందా .. 2

ఏడు కొండలు దాటి గోవింద .. నీ వైకుంట వాసానా గోవిందా ..

అడుగు పెట్టినాక గోవిందా .. మా మనసు మురిసినాక గోవిందా ..

నీ దర్సనం లేదు గోవిందా .. ధనవంతుల కేనట .. గోవిందా  2

నీకూ మాకూ నడుమ గోవిందా .. స్వార్థ రాజకీయం నడిచే  గోవిందా ..

నిన్ను కూడా మరచి గోవిందా .. నీ ధనిక భక్తుల సేవ గోవిందా ..

పేదవాడి గొడవ గోవిందా .. వినే నాథుడే లేడంత గోవిందా ..  2

మనసు లోన నువ్వు గోవిందా .. ఎంత మధన పడుతున్నవో గోవిందా ..

కలియుగం లోన గోవిందా .. అవతార పురుషుడవే గోవిందా ..

లక్ష్మినొదలి భువి న గోవిందా .. నీవు కూడా మనలేవయ్య గోవిందా 2

అసలైన భక్తి ఏది గోవిందా .. వి ఐ పి లదా గోవిందా ..

ఎర్ర దుప్పటి పరచి గోవిందా .. రాచ మర్యాదలేనయా గోవిందా ..

వి ఐ పి దేవుడా గోవిందా .. మా ఇంట్లోనే కొలిచేము గోవిందా  2

నిజమైన భక్తులు గోవిందా .. నీవు కనరాని బాధితులు గోవిందా ..

దేవాలయమున కూడా గోవిందా .. న్యాయమ్ము నసియించె గోవిందా ..

కలిప్రభావమో ఏమో గోవిందా .. నీక్కూడా తప్పదు గోవిందా ..

గోవిందా హరి గోవిందా .. 2