తరలోచ్చే సంక్రాంతి ... మరలొచ్చే సుఖశా0తి
అరవిచ్చె చామంతి .. మురిపించే పూ బంతి ...
ప్రతి ఇంటా తోలికాంతి ... ముగ్గేసే సిగ్గుల ఇంతి
చుట్టాల్ల మాటామంతీ ... బూరె గారెల దొంతీ ...
తెచ్చిందే సంక్రాంతీ .... పల్లెలోనా ఇది క్రాంతీ ... 2
బావా మరదళ్ళు ... అత్తింటికి కొత్త అల్లుళ్ళు ..
ఊరంతా సందళ్ళు ... సరదాల సంబరాలు ...
ముంగిళ్ళలో రంగవల్లులు ... పెదవుల పై నవ్వుల జల్లులు
హరిదాసుల జానపదాలు .. ఊరవతల కోడి పందేలు ..
ఉత్సాహపు ఉరకళ్ళు ... సంతోషపు పరవళ్ళు ..
తెచ్చిందే సంక్రాంతి ... తోడుగా శ్రీహరి పడతీ ... తరలోచ్చే
ఉదయాన్నే భోగి మంటలు .. చలిని తరిమే ఆయుధాలు ..
అదిరే కొత్త బట్టలు ... సిరి ధాన్యపు పలకరింతలు ..
నోరూరించే వంటలు .. కడుపారా కమ్మని విందులు
బసవన్న కి జేజేలు ... గుడిలోనా మోగే గంటలు ..
పసిపిల్లల బోసి నవ్వులు ... ఏరుకున్న భోగి ఫలాలు
తెచ్చిందే సంక్రాంతీ ... ప్రతి మనసున వాసంతి తరలోచ్చే

No comments:
Post a comment