తలుపులు తీసి ఉన్నాయి కానీ లోపల ఎవరూ కనబడటం లేదు శివా ... అన్నాడు లోపలకి తొంగి చూస్తూ ...
యశ్వంత్.
కానీ యష్ .. మనం లోపలి కి వెళ్దాం .. అన్నాడు శివ ..
మెల్లిగా ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు ... భయంకరమైన నిశ్శబ్దం ... ఆ నిశ్శబ్దం లో చిన్న మూలుగు
వినబడుతుంది లీలగా ...
యష్ ... విన్నావా అది .. అక్కడ ఎవరో ఉన్నారు ... అన్నాడు శివ మూలుగు వినబడుతున్న వైపు చేయి
చూపిస్తూ .
శివా .. మళ్ళి మనం .. ఆ పిశాచి మాయ లో పడుతున్నామేమో .. అన్నాడు చుట్టూ పరిశీలన గా చూస్తూ యష్ .
అది ... మన మురారి కావొచ్చు కదా ... అన్నాడు శివ .
మెల్లిగా తల పంకించి .. ముందుకు అడుగు వేయ బోతుండగా .. కాలికి ఏదో గుచ్చుకున్నట్లని పించి .. కిందకి
చూసాడు .... అది ఒక ఇయర్ రింగ్ .. శివా ఇది చూడు ... అన్నాడు దాన్ని చేతిలోకి తీసుకొని ...
శివ దాన్ని పరీక్ష గా చూసి .. యష్ .. ఇది సత్య చెవి లో చూసాను .. మురారి రీసెంట్ గా తన birthday కి ప్రెజెంట్
చేసిన జూకాలివి ... వీటిని కొనడానికి మేమిద్దరమూ వెళ్ళాం .. అందుకే నాకు బాగా గుర్తుంది అన్నాడు శివ ..
అలా అయితే ఇది ఇక్కడ కెలా వచ్చింది .. ? సత్య ఇంట్లో ఉంది కదా ... అన్నాడు యశ్వంత్ ..
నాకూ అదే అర్థం కావడం లేదు .. కంగారు పడి సత్య వచ్చేయలేదు కదా ... ఆందోళన గా అన్నాడు శివ .
ఓహ్ గాడ్ ! ఈ ఆడ పిల్లలు చెప్పిన మాట వినరే ... ఇప్పుడు అందరం ప్రమాదం లోనే ఉన్నాం .. కంగారుగా
అన్నాడు యశ్వంత్ .
యష్ .. ఇప్పుడు ఆ మూలుగు ఎవరిదో కూడా చెప్పలేం .. ఆ అంజనీ పుత్రుడే రక్షా ... నేను దండకం చదువుతూ
ఉంటా.. ముందు అటువైపు వెళ్దాం అన్నాడు శివ ..
ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ గది లోకి వెళ్ళారు ...
అక్కడ కనిపించిన దృశ్యం .. వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది ... రక్తపు మడుగు లో ప్రాణాలతో పోరాడుతున్నాడు ..
ఒక వ్యక్తీ .
శివా .. బాగా గమనించు తను మన .. అని యష్ అనే లోపే దండకం చదవడం ఆపేసి .. మురారీ .. అంటూ
పరుగున అతని దగ్గరకి వెళ్ళాడు శివ ...
అంతే .. ఆ వ్యక్తి తన దగ్గరికి వచ్చిన శివ పీక పట్టుకున్నాడు ..
ఆ హతాత్పరిణామానికి ఏం చేయాలో అర్థం కాలేదు యశ్వంత్ కి ..
యష్ .. సేవ్ మీ .. అతి కష్టం మీద శివ నోటి వెంట ఆ మాటలు వచ్చాయి ..
తేరుకుని శివ ని విడిపించటానికి విశ్వ ప్రయత్నం చేసాడు యశ్వంత్ ..
శివ కాళ్ళు కొట్టుకుంటున్నాయి ..
రేయ్ ... మురారీ వదలరా .. వాడు మన శివ రా ... వదలరా .. చచ్చి పోతాడ్రా .. వదలరా .. గట్టిగా అరుస్తూనె శివ
ని మురారి చేతుల నుంచి విడిపించ ప్రయత్నించ సాగాడు యశ్వంత్ ...
అదే సమయం లో ..
రచనా .. కింది నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి .. అంది సత్య ..
అదంతా అబద్ధం సత్యా ... నాకూ వినిపిస్తున్నాయి .. అదంతా మనల్ని పక్కదారి పట్టించడానికి కావొచ్చు అంది
రచన.
లేదు రచనా .. బాగా విను యశ్వంత్ వాయిస్ లా ఉంది .. వాళ్ళు కింద ఉన్నట్లున్నారు .. అంతే కాదు ఏదో
ఆపద లో ఉన్నట్లు ఉన్నారు అంది సత్య ..
అవును సత్యా .. పద కిందికి వెళ్దాం ...అని ఇద్దరూ పరుగున కిందకి దిగారు ..
అరుపులు వినిపిస్తున్న గది వైపు వెళ్లి చూసారు ... ఆ దృశ్యం చూసి అవాక్కయి యష్ ... అని అరిచింది రచన .
రచన మాట వినబడగానే ఒక్కసారి గా తలతిప్పి చూసాడు యశ్వంత్ .
శివా .. మురారీ .. అని పరుగున వీరిని చేరుకున్నారు రచన ,సత్య
రచనా !మీ ఇద్దరూ బావున్నారు కదా ఎం కాలేదు కదా మీకు ? ఓ పక్క శివ ని కాపాడే ప్రయత్నం చేస్తూనే
అడిగాడు యశ్వంత్ ..
యశ్వంత్ నువ్వొదిలెయ్ శివ ని .. అని మురారి తల పై తన చేయి నుంచింది రచన ..
వెంటనే అంత బలం గా శివ మెడ ని పట్టుకున్న మురారి చేతులు పట్టు సడిలించి నీరసం గా కిందకి
వాలిపోయాయి ... వెంటనే ఒక్క ఉదుటున కింద పడ్డాడు శివ .. అతని మెడ ఎర్రగా కందిపోయింది ..
రచన చేతిని వదల కుండానే మురారీ ... మురారీ .. లే మురారీ .. ఏడుస్తూ పిలుస్తుంది సత్య ..
ఎలా ? నేనింత వరకు ప్రయత్నించాను .. నువ్వు తాకగానే శివ ని వదిలేసాడు .. ఆశ్చర్యం గా అన్నాడు యశ్వంత్ .
యష్ ... అన్ని తరువాత చెప్తాను ... నువ్వు సత్య చేయి పట్టుకో .. నువ్వు శివా .. యశ్వంత్ చేయి పట్టుకో ..
అప్పుడే ఆ శక్తి ప్రసరణ .. నానుండి మీదాక ఉంటుంది ... అంది రచన .
వెంటనే రచన చెప్పినట్లు చేసారు ..
అందరిలో ఏదో నూతన ఉత్తేజం ప్రసరించి నట్లనిపించింది ...
మెల్లిగా కళ్ళు తెరిచాడు మురారి ..
మురారీ ... ఎలా ఉన్నావు ? కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా అడిగింది రచన ..
కళ్ళు తెరవగానే రచన ని చూసాక తరువాత తన చుట్టూ ఉన్న మిగతా స్నేహితులని చూసాడు ..
మళ్ళి మీ అందరిని చూస్తాననుకోలేదు... మెల్లిగా మాటలు కూడదీసుకుంటూ అన్నాడు మురారి ..
రేయ్ ... ఎంత కంగారు పెట్టేసావు రా ? ప్రాణాలు తోడేసాయి రా .. అన్నాడు శివ ఆర్తిగా ..
సత్య మౌనం గా ఏడుస్తుంది ..
సత్యా .. నాకేం కాలేదు .. నువ్వు ఏడవకు సత్యా ... మెల్లిగా ఆమె ని ఓదార్చాడు మురారి ..
వొళ్ళంతా గాయాలు మురారీ ... ఇంత బాధ ని ఎలా అనుభవించావొ .. ముందు నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ..
అన్నాడు యష్ బాధగా .
అవును .. ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి .. కానీ ఎలా ? ముందు మనం ఈ మహల్ దాటాలే ... అంది రచన .
రచనా .. నేను వెళ్లి మన వెహికల్ తీసుకొస్తాను ... అన్నాడు శివ .
కానీ శివా .... ఇప్పుడు నువ్వు చేయి విడిచి పెట్టి వెళ్తే ప్రమాదం .. అంది రచన ..
ఫర్వాలేదు రచన .. నేను ఆంజనేయ దండకం చదువుతూ వెళ్లి వస్తాను .. దండకం చదవడం ఆపిన క్షణం నాకు
ప్రమాదం ... ఇంతకు ముందు అలాగే జరిగింది .. కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడతాను .. అన్నాడు శివ ..
(ఇంకా ఉంది )
1 comment:
interesting!!!!!!!!!
Post a Comment