శివా ... నిజం గా వెళ్ళగలవా ? అన్నాడు యశ్వంత్ .
లేదురా ... వెళ్ళాలి .. మురారి ని బతికించుకోవాలి ... అన్నాడు శివ ఓ చేతితో మురారి తల నిమురుతూ ...
సత్య ... కృతజ్ఞత గా చూసింది శివ వైపు ..
జాగ్రత్త శివా ... అంది రచన ..
పోనీ నేను రానా ? అన్నాడు యశ్వంత్ ...
వద్దు యష్ ... నువ్వు వీళ్ళకి తోడుగా ఉండు ... నేను వెళ్లొస్తాను .. నా మనో బలమే నాకు తోడు ... అని గది లోంచి
బయటికి నడిచాడు శివ .. ఆంజనేయ దండకం చదువుతూనే .
ఏంటో ... నాకెందుకో శివ ని ఒంటరిగా పంపటం ... అని యశ్వంత్ తన మాట పూర్తి చేసేలోగా .. ఆఆ .... అని గట్టిగా
శివ ఆర్త నాదం వినిపించింది ...
శివా ... యష్ ... శివకేదో అయింది ... కంగారుగా అంది రచన ..
వెంటనే రచన చేయి ని విడిచి పెట్టి యశ్వంత్ ఆ గది లోంచి పరుగుతీసాడు .. ఆ అరుపు వినబడిన వైపు ...
యష్ ... నా చేయి ఎందుకు వదిలేసావ్ ... ఓహ్ గాడ్ .. ఇప్పుడేం చేయాలి ? టెన్షన్ తో రచన వొళ్ళంతా చెమటలు
పట్టేసాయి...........
రచనా .. ఇప్పుడేం చేద్దాం ... భయం గా అంది సత్య ...
అంత కంగారు లోనూ రచన కి ఓ ఆలోచన స్ఫురించింది ... తన చేతికి కట్టి ఉన్న తాయెత్తు ని చూసింది ..
ఇది తొమ్మిది పోగుల దారం .... ..
వెంటనే కొంచెం దాన్ని ముడి విప్పి కొంత దారాన్ని తెంపి ... మిగతాది మళ్ళి ముడి వేసింది ... సత్య ఆశ్చర్యం గా
చూస్తుంది ... ఆ మిగిలిన దారాన్ని మురారి చేతికి కట్టింది .. అంతే ఒక్కసారి గా అతని ఒంటిలో లక్ష ఓల్టుల విద్యుత్
ప్రవహించి నట్లయింది ..
సత్యా ... నువ్వు మురారి చేతిని విడిచి పెట్టకు .. నేను మురారి చేతికి కట్టిన ఈ రక్ష .. మీ ఇద్దరినీ కాపాడుతు0ది..
నువ్వు తన చేతిని మాత్రం విడవకు ... అంది రచన ..
ఆమె సరే నని తల ఊపింది ..
నేను వెళ్తాను ... శివా ,యశ్వంత్ ల పరిస్థితి ఏంటో .. అంది రచన ...
జాగ్రత్త ... అంది సత్య ..
సరే ... అని ఆ గది లోంచి బయటికి వచ్చింది రచన ...
చుట్టూ నిశ్శబ్దం ... శివ ,యశ్వంత్ లు కనబడలేదు .
యశ్వంత్ ఎటు వెళ్ళుంటాడు ... ? శివ కేమయిందో ... అమ్మా .. వైష్ణవీ మాతా నువ్వే రక్షించాలి వారిద్దరినీ ...
అని మనసులోనే ప్రార్థించి ... ఆలోచించింది .. శివ బయట కి వెళ్ళటానికి ప్రయత్నించాడు .. సో అరుపు కూడా
బయట నుండే వినిపించాలి .. కానీ శివ అరుపు మేడ మీద నుంచి వినిపించింది ... అంటే ... ఓహ్ గాడ్ .. యష్ ..
నువ్వు నా చేయి విడిచి పెట్టాలనే ... ఇదంతా ... నో .. నేను యష్ ని రక్షించు కోవాలి ... అని వెంటనే మెట్లు వైపు
పరుగుతీసింది రచన .
**********************************
యష్ ... విచక్షణా రహితం గా శివ అరుపు వినబడిన వైపు పరుగుతీయ గానే ... గాలి లోంచి ఓ చేయి లేచి అతడ్ని
విసురుగా తాకింది ... అంతే యశ్వంత్ మొదటి అంతస్థు లోని ఒక గది తలుపులు తోసుకుంటూ ఆ గది లోపల
పడ్డాడు ...
అతని మొహం నేలని తాకి ముక్కు నుండి రక్తం కారసాగింది ..
అమ్మా .... బాధ గా అరిచాడు ...
శరీరం లో నాలుగయిదు ఎముకలు విరిగిన భావన ..
మెల్లిగా కళ్ళు తెరచి చూసాడు యశ్వంత్ ...
ఆ గది లో ఉన్న సామగ్రి అందం గా కనబడింది యశ్వంత్ కి ...
పరదాలు గాలికి ఎగురుతున్నాయి ...
గోడ మీదున్న ఒక చిత్ర పటం గాలికి కొంచెం అటూ ఇటూ కదులు తుంది .. ఆ చిత్ర పటం లో ఓ స్త్రీ ..చూడగానే
రాకుమారి అని తెలుస్తుంది ...
అతడు మెల్లిగా లేచి అడుగు అడుగు వేసుకుంటూ ఆ చిత్ర పటాన్ని చేరుకున్నాడు ... పరీక్ష గా ఆ చిత్రపటాన్ని
చూసాడు ... అత్యంత అందమైనది ఆమె వదనం ... ఒక తల్పం మీద వయ్యారం గా కూర్చుని ఉందామె ... కింద
"రాకుమారి వైజయంతి" అని రాసి ఉంది ..
అంటే ... యీమే నన్న మాట ... వైజయంతి .. చాలా అందం గా ఉంది ... స్వగతం గానే అన్నాడతడు ..
"అవును ... నేనే .. చాలా అందగత్తె ని కదూ... " అన్న మాటలు వినబడి తుళ్ళి పడి చూసాడు యశ్వంత్ ...
అతనికి కొంత దూరం లో ఓ స్త్రీ నిలబడి ఉంది ... ఆమె మొహం కనబడ లేదు ... ఆమె అటువైపు తిరిగి ఉంది ..
ఆమె కురులు గాలికి లయబద్దం గా ఊగు తున్నాయి ..
మంత్ర ముగ్దుడిలా ఆమె వైపు నడిచాడు యశ్వంత్
(ఇంకా ఉంది )

No comments:
Post a comment