ఎక్కడున్నావు యశ్వంత్ ? కనబడ్డమే లేదు ... నీకేం కాకూడదు .. మనసులో గుబులు పడుతూనే యశ్వంత్
కోసం ప్రతీ గది వెతుకుతుంది రచన .
ఒక గది తలుపులు తుప్పు పట్టి ఉన్నాయి ... ఈ గదిలో గానీ ఉన్నాడా యశ్వంత్ ? కాని ఈ తలుపులయితే
ఎప్పుడూ ఎవరూ తెరచి నట్లు లేరు ... అనుకుంటూనే ఆ గది తలుపులు తెరవడానికి ప్రయత్నించింది రచన ..
తలుపులు తెరచుకోక పోవటం తో తన బూటు కాలితో బలం గా తన్నింది ... తలుపులు కొంచెం తెరచుకున్నాయి ...
చీకటి గా ఉన్న ఆ గదిలోకి టార్చ్ సహాయం తో లోపలికి ప్రవేశించింది ... రచన
బూజు దట్టం గా ఉంది ఆ గది లో ... అన్ని మూలల లోనూ టార్చ్ వేసి చూస్తుంది రచన ...
ఒక చోట ఆమె దృష్టి అప్రయత్నం గా నిలిచి పోయింది ..
అదేదో పురాతన విగ్రహం దట్టం గా దుమ్ము ,బూజు తో మొహం కనబడటం లేదు ... అక్కడున్న మిగతా సామాన్లని
చూస్తే ఆనాటి పూజ గది అనిపించింది రచన కి .. విగ్రహం వంక పరీక్ష గా చూసి తన చేతితోనే కాస్త బూజు
తొలగించింది ... అది దేవీ విగ్రహం ... రచన ఆ విగ్రహం వైపు సంభ్రమం గా చూసింది ..
ఇది వైష్ణవీ దేవి విగ్రహం ... అమ్మా !ఎంత దురదృష్టం కాకపొతే పూజా పునస్కారాలు లేకుండా పోతాయి నీకు ..
నువ్వున్న ఈ ఇంట్లోనే దుష్ట శక్తి విన్యాసమా ? అమ్మా ! ఆశీర్వదించు తల్లీ ! నేను యష్ ని కాపాడుకొనేలా
ఆశీర్వదించు .... అని మనసార నమస్కరించింది ..
తిరిగి టార్చ్ మరో వైపు ఫోకస్ చేసింది రచన ... అక్కడ ఓ మూల గా ఇనుప మెట్లు కనబడ్డాయి ... ఈ గది లోంచి
మళ్ళి పైకి మెట్లు ఉన్నాయేంటి ? అనుకుంటూనే ఆ మెట్ల దగ్గరకి నడచి మెట్లు ఎక్కటం ప్రారంభించింది ,,,
టార్చ్ లైట్ వెలుగు లో ఆమె నీడే గోడ మీద పడి భీతి ని గొల్పుతుంది .
మెట్లు ఎక్కగానే మరో గది దగ్గర ఆ మెట్లు ఆగిపోయాయి ... ఆ గది తలుపులు ఎంత చిన్నగా ఉన్నాయంటే ..
మనిషి కూర్చుని పాకుతూ మాత్రమె లోపలికి వెళ్ళగలడు ..
రచన ఆ గది తలుపుల్ని తెరచింది ... లోపలికి లైట్ వేసి చూసింది .. ఏవేవో పాత సామాన్లు ఉన్నాయందులో ...
రచన కొంచెం లోపలికి ప్రాకి చూసిo ది . ఈ గదిలో ఎందుకుంటాడు ... నా పిచ్చి గానీ ... నేనిలా సమయాన్ని వృధా
చేయకూడదు ... అని తిరిగి వచ్చేస్తుండగా ఆమె చేయి ఏదో వస్తువు కి తగిలింది .. అది కింద పడి భళ్లున పగిలింది
.
అటువైపు టార్చ్ వేసి చూసింది రచన . అదొక గాజు జాడీ .... అయ్యో .. గాజు పెంకులు .. జాగ్రత్త గా బయటికి
వెళ్ళాలి .. అనుకుంటుండగా ఓ క్షణం ఎందుకో ఆమె శరీరం బరువెక్కి నట్లని పించింది .
**************************
యశ్వంత్ మెల్లిగా ఆ స్త్రీ దగ్గరకి చేరాడు ...
ఎవరు నువ్వు ? అతని పెదవుల నుండి మెల్లిగా ఆ మాట వెలుపలికి వచ్చింది ...
ఆమె నవ్వింది తెరలు తెరలుగా ... ఆ నవ్వు ఆ గదిలో ప్రతిధ్వనిస్తుంది .. భయంకరం గా .. ఆమె నవ్వు స్థాయి
పెరుగుతుంది ...
యశ్వంత్ ... చెవి లోంచి వెచ్చగా రక్తం కారటం మొదలయింది ...
ఎవరు నువ్వు ? అడుగుతుంది నిన్నే ..... గద్దించి అడిగాడు యశ్వంత్ ..
"వైజయంతి " గట్టిగా అరచింది ఆమె ..
ఆ మాట వినగానే ఎంతో ధైర్యస్తుడు ఐన యశ్వంత్ కి కూడా చెమటలు పట్టేసాయి ...
ఆమె మెల్లిగా తన తల తిప్పింది ...
ఓ క్షణం యశ్వంత్ కాలి కింద భూమి కదలి నట్లయింది ... అంత భయంకర రూపాన్ని అతడు ఇది వరకెన్నడు
చూసి ఉండ లేదు ...
ఆమె అతడి వైపు ఒక అడుగు వేస్తుంది .. యశ్వంత్ అడుగు వెనకకి వేస్తున్నాడు ..
అతడి మనసు చెబుతోంది .. ఈ అమావాస్య రోజు బలి అవబోయేది తానేనని ....
ఆమె వదనం ఇంకా భయంకరం గా మారుతోంది ... యశ్వంత్ అడుగు ఇంకా వెనకకి పడలేదు ... అతని వెనకాల
గోడ ఉంది... ఏం చేయాలి ? ఈ పిశాచి నుండి ఎలా తప్పించు కోవాలి ? తనకి రక్షణ ఎవరు ఇవ్వగలరు ఇప్పుడు ?
అతని మనసు ఆందోళన లోనూ ,భయం లోనూ మునిగి పోయింది ..
ఆమె అతడి వైపే వస్తోంది ...
ఇంతలో గోడ లోంచి రెండు చేతులు వచ్చి యశ్వంత్ పీక చుట్టూ పట్టు బిగించాయి ...
ఆ .... గట్టిగా అరచాడు యశ్వంత్ ...
(ఇంకా ఉంది )
No comments:
Post a comment