Powered By Blogger

Monday, 6 January 2014

రుధిర సౌధం 41బాధ తో విలవిల్లాడు తున్నాడు .... యశ్వంత్ .

ప్రాణం తన నుండి విడివడు తున్న భావన ...

సరిగ్గా అప్పుడు  గంభీరం గా అన్నదొక కంఠం ... అతన్ని విడిచి పెట్టు వైజయంతీ .... అని ..

ఆ భయంకర రూపం ఒక్కసారిగా ఆ కంఠం వినబడిన వైపు తిరిగింది ..

అంత బాధ లోనూ యశ్వంత్ అటువైపు తిరిగి చూసాడు .

అతని కళ్ళు ఆశ్చర్యం తో పెద్దవయ్యాయి ... ఆమె ... అత్యంత సౌందర్యo గా ఉంది ... రాచరికపు దుస్తుల్లో అతి

లోక  సౌందర్య రాశి  ఆమె .... కానీ ఆమె వదనం ... తనకి సుపరిచితం ... ఆమె రచన ..

నువ్వా ?  భయంకరం గా అరచింది వైజయంతి .

అతన్ని విడిచి పెట్టు ... లేదంటే ... నాతొ తల పడు ... అంది ఆమె స్థిరం గా ...

లేదు లెదు... నిన్ను ఎవరు విడిచి పెట్టారు ?? కొన్నేళ్ళు గా ఆ జాడీ లో ముగ్గిన నిన్ను బయటకి విడిచి పెట్టింది

ఎవరు  ? అంది ఆ  దుష్ట శక్తి .

ఏనాటి కయినా నిజం బయట పడక తప్పదు ... మంచి గెలవక తప్పదు ... నా శక్తి నీకు తెలుసు .. అతన్ని విడిచి

వెళ్ళు.... అందామె  మార్దవం గా ..

విధాత్రీ ........... .... గట్టిగా అరచింది వైజయంతి .

ఆమె కళ్ళ లోంచి ఒక వెలుగు ప్రసరించి వైజయంతి ని తాకింది .

అంతే .... ఆ దుష్ట శక్తి  ఒక్కసారిగా మాయమయింది ..

కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని యశ్వంత్ కళ్ళు నమ్మలేక పోతున్నాయి ...

అతని మెడ చుట్టూ ఉన్న చేతులు మాయమయ్యాయి ...

ఆశ్చర్యం గా చూస్తున్న అతడిని చూసి ఆమె చిరునవ్వు నవ్వింది ...

మీరూ ..... మెల్లిగా సంశయం గా అన్నాడు యశ్వంత్ ..

150 ఏళ్ళ క్రితం జీవించి ఉన్న ఓ రాకుమారిని ... ఇప్పుడు ప్రాణాలతో లేను .. అన్నది ఆమె .

ఇదెలా సాధ్యం ? నేను ఓ ఆత్మ ని చూడ గలుగుతున్నానా ? సంభ్రమం గా అన్నాడతను .

అవును ... ఇది పవిత్ర భారతావని ... ఆ భగవంతుడు నడయాడిన నేల ... మహోన్నత వ్యక్తులు ,మహా

సంకల్పం .. గలిగిన వారు జన్మించిన నేల .. సాధ్యాసాధ్యాలను మించిన నేల ... గొప్ప ఔ ష ద శక్తులు , ప్రాణాల

తోనే   పరమాత్మ ని చూడగల  ఋషులు జన్మించిన నేల ... అటువంటి ఈ నేల పై ఇది అసాధ్యం ఎలా అవుతుంది ?

అంది ఆమె అత్యంత సమ్మోహనం గా .

నేను నమ్మలేక  పోతున్నాను ... మీరు మా రచన లా ఉన్నారు .. అన్నాడు యశ్వంత్ .

నేను మీ రచన లా కనబడుట కాదు .. మీ రచన యే నాలా ఉంది .. పోలికలు సహజము కదా .. మా వంశస్థురాలు

కదా!  అన్నది ఆమె ..

మీరేం అంటున్నారు ? ఆశ్చర్యం గా అన్నాడు యశ్వంత్ .

ఆమె తీయగా నవ్వి ... నీ ప్రేయసి ... నీకు కూడా చెప్పని నిజం .. నేను నీకెలా విశదీకరించను? ఆమే నీకు

చెబుతుంది... భవిష్యత్తు గతం నందే నిర్ధారించ బడినది . రచన ఇక్కడికి రావటం ... ఒక గాజు జాడీ లో బంధింప

బడిన నన్ను విడుదల చేయటం ముందుగానే నిర్ణయింప బడింది . ఇన్నేళ్ళు నేను ఆమె రాక కై ఎదురు చూస్తూ

ఉన్నాను... అన్నది ఆమె .

మీరు రాకుమారి ... అయితే .. ఆమె ? అదే ... వైజయంతి ఎవరు ? అన్నాడు యశ్వంత్ కుతూహలం గా ..

ఆమె నా సహోదరి .. రాకుమారి వైజయంతి ... నేను విధాత్రి నామదేయురాలిని     అన్నదామె ... ఆమె వదనం లో

విషాదం తొంగి చూస్తుంది ...

నాకు మీ కథ తెలుసు ... మీరు రాజు గారి రెండో భార్య కుమార్తె కదూ .. ఉత్సాహం గా అన్నాడు యశ్వంత్ .

అవును .. కానీ మీకు తెలిసింది పూర్తిగా నిజం కాదు .. తెలుసుకునేందుకు సమయం ఉంది .. ఈ దుష్ట శక్తి ని ఈ

 ప్రాంతం నుండి తరమ వలసి ఉంది .. నీవు పూర్తిగా రచన కి సహకరించు ... ఆమె ద్వారా ఓ మహత్కార్యం

జరగనుంది... ఇక నేను ఈ మహల్ నందే ఉంటాను .. జగతికి నిజం తెలిసే వరకు . రచన సంకల్పం నెరవేరే వరకు .

అప్పుడప్పుడు రచన శరీరాన్ని వినియోగించక తప్పదు .. ఈ నిజం నీలోనే ఉండనీ ... అన్నది ఆమె.

అతను సరేనని తల ఊపాడు .

ఇప్పుడు నేనీ శరీరాన్ని వదిలివేల్తాను ... రచన ని క్షేమం గా తీసుకువెళ్ళు ... తూర్పు తెలవారే లోపు మీ స్థానాలను

చేరుకోండి ... అని ఒక్కసారిగా ఆమె కింద పడిపోయింది .. ఆమె సాధారణం గా మారిపోయింది .. రచన లా .

(ఇంకా ఉంది)


No comments: