రచనా ! అంటూ పరుగున ఆమె దగ్గరకి వెళ్ళాడు యశ్వంత్ . కింద పడిన ఆమె ను తన రెండు చేతులతో ఎత్తుకుని
ఆ గది లోంచి బయటికి నడిచాడు . సరాసరి సత్య మురారి ఉన్న గది లోకి ఆమె ని తీసుకువెళ్ళాడు ..
వాళ్ళిద్దరినీ అలా చూడగానే .. యష్ ! రచన కేమయింది ? కంగారు గా అడిగింది సత్య ..
ఏం కాలేదు సత్యా ! అని చెప్పి నేల పై రచన ని పడుకోబెట్టి .. రచనా .. రచనా .. అంటూ పిలిచాడు యశ్వంత్ .
యష్ .. రచన కేమయింది ? శివ ఎక్కడ ? నీరసం గా అడిగాడు మురారి .
మెల్లిగా కళ్ళు తెరచింది రచన ..
ఆమె కళ్ళు తెరవడం చూసి .. హమ్మయ్య ! అని నిట్టూర్చి .. హౌ ఆర్ యు రచనా ? అన్నాడు యశ్వంత్ ..
సత్య కూడా .. రచన చేయి పట్టుకుని .. రచనా .. ఆర్ యు ఓకే ? అంది .
ఆమె మెల్లిగా లేచి .. అసలు నాకేమయింది ? యష్ ... నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను .. కానీ మధ్యలో ...
నాకేం గుర్తు రావటం లేదు .. అయోమయం గా అంది రచన .
ఏం నష్టం లేదు ... నువ్విప్పుడు ఏం ఆలోచించకు ... అంతా తర్వాత మాట్లాడుకుందాం .. అన్నాడు యశ్వంత్ .
అలాగే నంటూ తల ఊ పింది రచన .
మరి శివ ? అంది సత్య .
నేను వెళ్లి శివ ని వెదికి వస్తాను ... అని లేచాడు యశ్వంత్ .
నో యశ్వంత్ ... నేనూ వస్తాను .. నిన్ను ఒంటరిగా పంపేది లేదు అంది రచన తటాలున లేచి .
రచనా .. ఇప్పుడెం భయపడాల్సిన అవసరం లేదు ... అమావాస్య ఘడియలు వెళ్ళిపోయాయి .. శివ కూడా క్షేమం
గా ఉండి ఉంటాడు .. అన్నాడు యశ్వంత్
ఏమైనా కానివ్వు .. నేను నీతోనే వస్తాను యశ్వంత్ .. అంది రచన
అవును .. యష్ .. తనని నీతోనే రానీ .. ఒకరికొకరు తోడుగా ఉండటం మంచిది .. అంది సత్య .
సరే పద .. అన్నాడు యశ్వంత్ .

ఇద్దరూ ఆ గది లోంచి బయటకి నడిచారు . యశ్వంత్ చేతిని
గట్టిగా పట్టుకుంది రచన . ఆమె దృష్టిలో ఇంకా
అపాయం తొలగలేదు .
**********************
యశ్వంత్ వాళ్ళు వెళ్లి పోయాక హటాత్తుగా ఆ గదిలోకి
వచ్చాడు శివ .
శివా ! నువ్వు బాగానే ఉన్నావా ? ఆశ్చర్యం గా అడిగింది సత్య ...
హా ... ఇంతకీ రచన ,యశ్వంత్ లు ఎక్కడ ? కంగారుగా అడిగాడు శివ ..
వాళ్ళు క్షేమం గానే ఉన్నారు ... కాక పొతే నీకోసమే వెళ్ళారే ...
అంది సత్య సందేహం గా ..
నేను మీకు చెప్పే వెళ్ళా కదా ... వెహికల్ తెచ్చాను ... ముందు మురారిని వెహికల్ లో ఎక్కించాలి .. పద ..
అన్నాడు శివ .
హా ... అని సత్య ... మురారిని ,శివ సహాయం తో మెల్లిగా లేపి ఇద్దరూ కలసి మహల్ నుంచి బయటకి నడిచారు ..
జాగ్రత్త గా మురారి ని వెహికల్ లోకి ఎక్కించాక ... శివా .. రచన ,యశ్వంత్ లు మనకోసం వెదుకు తారు .. అంది
సత్య.
సత్యా ... యశ్వంత్ కి తెలుస్తుంది .. ముందు మురారిని కాపాడాలి కదా .. ముందు ఇంటికి తీసుకువెళ్ళి ఫస్ట్
ఎయిడ్ చేయాలి .. అన్నాడు శివ ... సరే .. ఒకసారి హార్న్ ఇవ్వు .. వాళ్లకి వినబడుతుంది ... అంది సత్య ..
అలాగే ... అని బండి హార్న్ ఇచ్చి స్టార్ట్ చేసాడు శివ ...
*********************
బయట ఏదో వెహికల్ హార్న్ వినబడింది యశ్వంత్ ... శివ వెహికల్ కోసమే వేల్లాడెమో .. మనకి శివ అరచినట్లు
వినబడటం కూడా భ్రమే నేమో ... అంది రచన .
వెంటనే ... అక్కడున్న కిటికీ ని తెరచి చూసాడు .. యశ్వంత్ .. కొంచెం దూరం లో ఊరి వైపు ఓ వెహికల్ వెళ్తూ
కనబడింది .
హా ... నిజమే .. రచనా .. అది మన వెహికలే ... సో ... శివ సేఫ్ గానే ఉన్నాడు ... అన్నాడు మురారి ..
తను సేఫ్ గానే ఉన్నాడు లే ... కానీ నువ్వెందుకు నా చేయి విడిచి పెడుతున్నావు
? అలా నా చేయి వదలకు ..
అని చిరుకోపం గా వెళ్లి అతడి చేయిని గట్టిగా పట్టుకుంది రచన .
ఆమె వైపు చిరునవ్వుతో చూసి అటు చూడు ... తెల్లారు తోంది ... ఇంకా భయమెందుకు ? అయినా ఈ వూరి హిస్టరీ
ని మనం బ్రేక్ చేసాము ... అమావాస్య నాడు ఈ మహల్ నుండి ప్రాణాలతో బయట పడింది మనమే .. అన్నాడు
యశ్వంత్..
నిజం గానా ? కానీ మనమైతే ఇంకా ఇక్కడే ఉన్నాము ... అంది రచన ..
అఫ్ కోర్స్ ... కానీ మనం కూడా ఇక్కడనుండి క్షేమం గా వెళ్ళగలం ... అది సరే .. అసలు నువ్వెక్కడికి వెళ్లావు ?
నువ్వు మహల్ కి రాకుండా ముందు ఎక్కడకి వెళ్లావు ? అన్నాడు యస్వంత్ .
(ఇంకా ఉంది )

No comments:
Post a comment