Powered By Blogger

Tuesday, 7 January 2014

రుధిర సౌధం 43

నేను ... అదీ .. యశ్వంత్ ... మనం ఇక్కడే ఉండి మాట్లాడు కోవాలా ? ఇక

మనం కూడా వెళ్దాం ... తెల్లారితే అందరికి తెలిసి పోతుంది ... నేను తెల్లారే

లోపే బంగ్లా కి వెళ్లి పోవాలి ... అంది రచన .

"ఈ విషయమే కాదు ... నేను నీతో చాలా విషయాలు అడిగి తెలుసు కోవాలి ..

కానీ ఇది సమయం కాదు " అని తలంచి ... సరే .. పద వెళ్దాం .. అన్నాడు

యశ్వంత్ .

ఓకే ... అని ముందుకు నడిచింది రచన .

రచనా ... నీతో ఒక్క మాట మాత్రం ఇప్పుడే చెప్పాలి ... అన్నాడు యశ్వంత్ .

వెనక్కి తిరిగి...  ఏమిటది ? అంది రచన .

నీవల్లే అందరూ ప్రమాదం లో పడ్డారు అనుకున్నాను ... సారీ ... కాని నీవల్లే అందరం సేవ్ అయ్యాం ... థాంక్ యు ..

అండ్ నువ్వంటే నాకు ప్రాణం ... నీకేం జరిగిందో అని కంగారు పడిపోయాను అన్నాడు యశ్వంత్ కాస్త జాలిగా

మొహం పెట్టి ..

ఆమె తటాలున వచ్చి అతన్ని హత్తుకుంది .. నేను నిన్ను చాల సార్లు బాధ పెట్టాను యశ్వంత్ ... కానీ నువ్వు

నాకోసం ప్రాణాలకి కూడా తెగించావు .. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. నీకన్నా గొప్పగా ప్రేమించేవాడు నాకు

దొరుకుతాడా ? ఆర్తిగా అతన్ని హత్తుకుని అడిగింది రచన .

నిజం గానా రచనా ... ? అంతా కలలా ఉంది ... నిజం గానే నా జీవితం నుండి అమావాస్య వెళ్ళిపోయి వెన్నెల

కురిసినట్లు ఉంది ... అన్నాడు యశ్వంత్ .

అతన్ని విడిచి పెట్టి ... మొద్దూ ... చెబుతున్నాగా .. అసలు నేను ఎప్పట్నుంచో ఇష్ట పడుతున్నా నిన్ను ... కానీ

నీతో చెప్పటానికి కొంచెం ఆలోచించాను ... దానికి ఒక కారణం ఉంది .. అదంతా తర్వాత చెప్తాను .. ముందు ఇక్కడ

నుంచి వెళ్దామా ? అంది రచన .

సరే అని ఆమె ముందు మోకాలి పై కూర్చుని ... ఓ నా ప్రేమ దేవతా ... నీ చేతిని నాకు అందిస్తావా ? నేను ఇక్కడ

నుండి సురక్షితం గా తీసుకువెళ్తాను ... అన్నాడు నాటక ఫక్కి లో యశ్వంత్ ..

యశ్వంత్ ... నువ్వు .. టూ మచ్ చేస్తున్నావు .. అని విసుక్కుంటూనే అతనికి తన చేతిని చిరునవ్వుతో

అందించింది రచన .

అతడు ఆమె చేతిని చుంబించి .. లేచి నిలబడి .. లెట్స్ గో అన్నాడు ..

ఇద్దరూ కలసి మహల్ కి తాళం వేసి మహల్ నుండి బయట పడ్డారు .

వాళ్ళిద్దరూ తిరిగి వెళ్తుండగా దూరం ఎవరో ఒక వ్యక్తీ అటువైపు వస్తూ కనిపించాడు ..

యష్ .. ఎవరో ఇటువైపే వస్తున్నారు .. అప్పుడే తెల్లారి పోయింది .. మనల్ని చూ స్తే ప్రాబ్లం అయిపోతుంది ... అంది

రచన కంగారుగా .

రచనా ఇలా రా ... అని పక్కనే ఉన్న గడ్డి మోపు పక్కకి ఆమె ని తీసుకు వెళ్ళాడు .. యష్ .

ఆ వ్యక్తీ చేతి లో చెంబు తో పక్కనే ఉన్న తోట లోకి వెళ్ళాడు ...

చాటుగా చూసి రచనా .. అతడు పాపం కాలకృత్యాలు తీర్చుకోవటానికి వచ్చాడు .. నువ్వేమో భయపడ్డావు ..

సరే పద ... అన్నాడు యశ్వంత్ .

ఇద్దరూ కలసి వడివడి గా నడుచుకుంటూ బంగ్లా వెనుక భాగాన్ని చేరుకున్నారు .

ఓకే .. యష్ .. తర్వాత కలుద్దాం .. అని పైప్ పట్టుకుని పైకి ఎగబాకింది రచన .

చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక రచన కిటికీ రెక్క ని పట్టుకుని రూం లోకి చేరగానే .. యశ్వంత్ కూడా

ఇంటిదారి పట్టాడు .

                                                         **************************
ఇంటికి చేరగానే శివా ... అంటూ పిలిచాడు యశ్వంత్ .

పరుగున వచ్చి యష్ .. అంటూ హత్తుకున్నాడు శివ . ఆర్ యు ఓకే ? అడిగాడు శివ .

నేను ఓకే రా ... నువ్వు ? మురారి ,సత్య ని నువ్వే తీసుకువచ్చావ్ కదూ .. అడిగాడు యష్ .

అవున్రా .. కానీ ఆశ్చర్యం .. ఇప్పుడు మురారి లేచి కూర్చున్నాడు ... ఏక్టివ్ గానే ఉన్నాడు ... కాని గాయాలే ..

కొంచెం... అని ఆగిపోయాడు శివ .

ముందు వాడిని చూద్దాం పద ... అంటూ శివ భుజం మీద చేయి వేసి లోపలకు నడిచాడు యశ్వంత్ .

సత్య మురారి గాయాలకి బాండేజ్ వేస్తుంది .. గోడ కి ఆనుకుని కూర్చున్నాడు మురారి .

మురారీ ... అని అప్యాయం గా యష్ పిలిచేసరికి ఇద్దరూ తలెత్తి యష్ ,శివల వంక చూసారు .

ఎలా ఉన్నావ్ రా ? మురారి దగ్గరగా కూ ర్చుని అన్నాడు యశ్వంత్ .

బాగానే ఉన్నాను యష్ .. అక్కడ నుండి రాగానే బాడీ పెయిన్ అంతా హుష్ కాకి .. కొంచెం ఈ గాయాలు తగ్గాలి

అంతే... ఐనా ప్రాణాలతో బయట పడ్డాం .. అంత కన్నా గొప్ప విషయం కాదు గా అన్నాడు మురారి .

చిన్నగా తల పంకించి .. నిజం గా ఈ రాత్రి మనకి మరచిపోలేనిది ... అన్నాడు యశ్వంత్ .

యష్ .. రచన .. క్షేమం గానే ఉంది కదా .. అంది సత్య . 

(ఇంకా ఉంది )

No comments: