Thursday, 9 January 2014

రుధిర సౌధం 44

హా సత్య ... తను బంగ్లా కి వెళ్లి పోయింది .. అన్నాడు యశ్వంత్ .

యష్ .. నేను రచన కి సారీ చెప్పాలి .. నిన్న మీరు మహల్ కి వెళ్ళాకా తను కంగారుగా వచ్చింది ... మీరు

తనకోసమే మహల్ కి వెళ్ళారన్న కోపం తో నేను తనని తిట్టేసాను ... కానీ ఈరోజు అందరం ప్రాణాలతో ఉన్నామంటే

రచన వల్లే . .. అంది సత్య .

అవున్రా యష్ .. రచన దగ్గర ఏదో శక్తి ఉంది అదే నిన్న అందర్నీ కాపాడింది ... అన్నాడు శివ .

ఇదుగో యష్ .. నిన్న రచన నా చేతికి ఈ తాడు కట్టింది .. దీని వల్లే నేను కోలుకున్నానని స్పష్టం గా చెప్పగలను ...

అన్నాడు మురారి .

యశ్వంత్ చిరునవ్వుతో వాళ్ళ మాటలు వింటున్నాడు .

నిజమే యష్ అదొక తాయెత్తు ... రచన చేతికి ఉంది ... ఆ తాయెత్తు వల్లే ఈ రోజు ఒకరితో ఒకరు

మాట్లాడుకుంటున్నాం ... అంది సత్య .

"రచన గురించి మీకేవ్వరికి తెలియని విషయం మీతో చర్చించలేను " అనుకున్నాడు మనసులో యశ్వంత్ ...

ఇంతలో బయట అంతా ఏదో గొడవ గా వినిపించింది ...

యష్ ... బయట ఏదో గొడవగా ఉంది .. నేను చూసి వస్తాను ... అని శివ గుమ్మం తలుపు తీసాడు ..

జనం ఎక్కడికో పరుగులు తీస్తున్నారు ...

ఏంటి ? వీళ్ళిలా పరుగు తీస్తున్నారు ? ఏం జరిగి ఉంటుంది ? అని బయట కి నడిచి హడావుడి గా వెళ్తున్న ఓ వ్యక్తీ

ని ఆపి ఎందుకు అందరు ఇలా ? ఎక్కడకి వెళ్తున్నారు ? ఏం జరిగింది ? అడిగాడు శివ అతన్ని .

అయ్యో .. మీకు తెలవదా ? ఆ దెయ్యాల కోట కాడ మా రాముడు చచ్చి శవమై పడున్నడు .... వగరుస్తూ అన్నాడు .

అతడు

వ్వాట్ ? అదిరి పడ్డాడు శివ .

అతడు శివ ని పట్టించుకోకుండా ముందుకి పరుగు పెట్టాడు .

పరుగున ఇంట్లోకి నడిచి యశ్వంత్ ... యశ్వంత్ అని పిలుస్తూ యశ్వంత్ వాళ్ళు ఉన్న గదిలోకి నడిచాడు శివ .

ఏరా ? ఏమైంది ? అని అడిగాడు కంగారుగా శివ పాలిపోయిన మొహం చూసి .

ఒక వ్యక్తి ఎవరో .... మహల్ దగ్గర చచ్చిపోయాడట ... చెప్పాడు శివ .

ఈసారి విస్తుపోవటం వారి వంతు అయింది .

ఏం చెబుతున్నావు రా ? అసలు అదెలా సాధ్యం ... తెల్లారే వరకూ మనం మహల్ లోనే ఉన్నాం ... మరి

అతనెప్పుడు మహల్ కి వచ్చాడు ? ఎప్పుడు చచ్చాడు ? అడిగాడు యశ్వంత్ .

ఇప్పుడే ఆ హిస్టరీ ని బ్రేక్ చేసామని సంతోషిస్తున్నాం ... మరి ఇప్పుడీ వార్త ... ఆశ్చర్యం గా ఉంది అన్నాడు

మురారి .

అవును .... అసలు ఈ వూరి వాళ్ళందరూ అమావాస్యనాడు మహల్ కె వెళ్ళరు అటువంటప్పుడు ఇతనెలా

అక్కడకి వెళ్ళుంటాడు . వెళ్ళిన మనమే ప్రాణాలతో వచ్చాం ... అంది సత్య .

పద శివా .. మనము వెళ్లి చూద్దాం ... అక్కడకి వెళ్తే ఏమైనా క్లూ దొరకొచ్చు అన్నాడు యశ్వంత్ .

సరే ... అని మురారి వంక తిరిగి .. మేము వేల్లోస్తాం ... మీరు రెస్ట్ తీసుకోండి ... అని కదిలాడు శివ .

ఇద్దరూ కల్సి కాసేపట్లోనే ఆ శవం ఉన్న చోటికి చేరుకున్నారు .. మహల్ కి ఉన్న దక్షిణ గేటు వద్ద పడిఉంది అతడి

శవం .

యశ్వంత్ అతడిని పరీక్ష గా చూసాడు ... ఎందుకో అతడు రాత్రి చనిపోలేదని ... కొద్ది నిమిషాల క్రితమే

చనిపోయాడని   అని పించింది . అప్రయత్నం గా శవానికి కొంత దూరం లో పడి ఉన్న దుప్పటిని చూసాడు ...

ఎందుకో ... ఆ దుప్పటిని చూడగానే యశ్వంత్ కి గుర్తు వచ్చింది ... యితడు ఉదయం ... రచన ,నేను

వస్తున్నప్పుడు మాకు ఎదురైనా వ్యక్తి ... కానీ ఇంతలోనే ఇతడెలా చనిపోయాడు ? ఇది ఆలోచించాల్సిన విషయమే .
అనుకొన్నాడు యశ్వంత్ మనసు లో .

                    *****************************************************


    మహల్ నుంచి తన గదికి చేరాక  నిశ్చింతగా దుప్పటి ముసుగుతన్ని పడుకుంది రచన . 

తలుపులు దబదబా బాదుతున్న సవ్వడికి బద్ధకం గా కళ్ళు తెరచింది ... ఎవరు ? అని బలవంతం గా లేచి తలుపు 

తీసింది రచన . 

ఎదురుగా వెంగమ్మ ... సీరియస్ గా చూస్తూ ... 

ఏంటి ? అంది రచన . 

సమాధానం చెప్పలేదు ఆమె ... 

" నీకు మాట్లాడటం వచ్చు ... కాని మాట్లాడకుండా ఎదుటివారిని చిత్రహింస పెడతావు " అని మనసులో అనుకొని 

టిఫిన్ కేగా ... వస్తాను ... నువ్వెళ్ళు అంది రచన . 

కాదన్నట్లు గుమ్మానికి అడ్డు తొలగింది వెంగమ్మ .. 

అక్కడ రత్నం రాజు ఉన్నాడు .. 

రాజు గారు మీరా ? ఏంటి ఉదయాన్నే ? అంది రచన . 

ఉదయాన్నే చెబుతున్నందుకు క్షమించు ధాత్రీ  ... మహల్ దగ్గర ఒక తను చనిపోయాడు ... ప్రతి అమావాస్య కి ఆ 

మహల్ దగ్గర ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు ... ఈసారి కూడా అలానే జరిగింది ... కాని ఈసారి చనిపోయింది నా 

స్నేహితురాలి భర్త ... అన్నాడు రత్నం కాస్త బాధ గా  . 

మహల్ దగ్గర చనిపోయార ? మీరు చెప్పేది నిజమేనా ? ఆశ్చర్యం గా అడిగింది రచన . 

(ఇంకా ఉంది )2 comments:

Unknown said...

unexpected twist.. suspense bagaa carry chesthunnaaru.. :)

రాధిక said...

thanks for following..