నిజమే నేను అబద్ధం ఎందుకు చెబుతాను ? నా బాధ ని చెప్పుకోవాలని పించింది ధాత్రీ ... అన్నాడు రత్నం .
నాకేం అర్థం కావడం లేదు ... కాసేపటి వరకు మహల్ లోనే ఉన్నాం ... ఇంతలోనే ఇలా ఎలా జరుగుతుంది ? అంతా
మిస్టరీ లా ఉంది ... దీని వెనుక ఏదో ఉంది ... ఆలోచించాల్సిందే .... అని మనసులోనే అనుకుంటున్న ఆమె ధాత్రీ ...
అని మళ్ళి రత్నం పిలవగానే ... ఆలోచనలనుండి తేరుకుంది .
ఏంటి ?అంతగా ఆలోచిస్తున్నావు ? అడిగాడు రత్నం రాజు .
రాజు గారూ ... మనం అక్కడ కి వెళ్దాం .. నేనిప్పుడే తయారై వస్తాను .. అంది రచన .
అలాగే ధాత్రీ ... నేను కింద వెయిట్ చేస్తూ ఉంటాను .. అన్నాడు రత్నం .
రత్నం ,వెంగమ్మ కిందకి వెళ్ళాక తలుపులు మూసి ... ఈ విషయం యశ్వంత్ వాళ్లకి తెలిసి ఉంటుందా ? అని
ఆలోచిస్తూ కిటికీ దగ్గరకి వచ్చి యశ్వంత్ వాళ్ళు ఉండే ఇంటి వైపు చూసింది .. ఎవరూ కనబడ లేదు ఆమె కి .
ముందయితే ఫ్రెష్ అయి వెళ్ళాలి అక్కడకి .. అనుకుని బాత్రూం లోకి దూరింది .
కాసేపట్లో ఆమె రత్నం తో కలిపి శవం ఉన్న చోటికి చేరుకుంది .
జనం గుంపు గా చూస్తున్నారు .. ఆ గుంపు ని తప్పించు కుంటూ వెళ్ళిన ఆమె కి యశ్వంత్ ,శివ గ్లోవ్స్
తొడుగుకొని శవాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్ష గా చూడటం కనబడింది .
ఓహ్ ! వీల్లిక్కడే ఉన్నారన్న మాట .. అని వాళ్ళ దగ్గరికి వెళ్లి మీకేమైనా సహాయం కావాలా ? అని అడిగింది రచన .
రచన మాట తో చేస్తున్న పని ని ఆపి రచనని రత్నం ని చూసి .. ఇది హత్య ... దెయ్యం కాదు ... ఎవరో మనిషే
చేసాడు ... పోలీస్ రావాల్సిందే ... అన్నాడు యశ్వంత్ .
ఏంటి బాబూ ... అలా అంటన్నారు ? దెయ్యం కాక మనుషులు జంపారా ? కాదు బాబూ ... అమావాస్య కాడ ఈ
మహల్ కాడికి ఎందుకీడు రావాలే ? జావాలే ? అన్నాడు ఒకతను గుంపు లోంచి .
ఎవరో ఇతడ్ని చంపి మహల్ దగ్గర పడేసారు ... అంతే కానీ .. ఇది దెయ్యమో ,భూతమో చేసిన పని కాదు ...
మమ్మల్నినమ్మండి ... అన్నాడు యశ్వంత్ .
యశ్వంత్ గారూ ... వాడికి ఈ వూరు లో ఎవరు శత్రువులు లేరే ... ఐన మీరు అంత ఖచ్చితం గా ఎలా
చెబుతున్నారు? ఈ మహల్ దగ్గర ఇలా ప్రతీ అమావాస్య కి ఒక శవం పడి ఉండటం మాకు సాధారణ విషయమే ..
అన్నాడు రత్నం .
రత్నం రాజు గారూ ... సరిగ్గా ఈ విషయాన్నే హంతకుడు ఉపయోగించుకుంటున్నాడు . ఈ గ్రామ ప్రజల
అమాయకత్వాన్ని... పోలీసులు వచ్చాక వారే తేలుస్తారు ... అన్నాడు యశ్వంత్ .
పోలీసులు రారు ... అన్నాడు అప్పుడే అక్కడకి వచ్చిన భూపతి ..
రచన ,యశ్వంత్ ,శివ ... ఒక్కసారిగా అటువైపు చూశారు ...
ఈ ఊరిలో జరిగే ఈ దారుణాలు ఎవరు చేస్తున్నారో వారికి తెల్సు ? వచ్చి ఎవర్ని అరెస్ట్ చేస్తారు ? ఈ కోట లో ఉన్న
వైజయంతి నా ? అరెస్ట్ చేయాలన్నా మహల్ లోకి వెళ్లి తీరాలి కదా ...
మహల్ లోకి వెళ్ళిన వాడు తిరిగి రాలేడని వారికీ తెల్సు .. అన్నాడు భూపతి .
భూపతి గారూ ... నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి యితడు కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు ... అంటే తెల్లారాక ...
మీ వైజయంతి అమావాస్య ఘడియలలోనే ప్రాణాలు తీస్తుందని మీరే చెప్పారు .. కానీ అమావాస్య వెళ్ళాక యితడు
చనిపోయాడు... అంటే వైజయంతి ఇతడిని చంపలేదు ... మరెవరు చంపారు ? ఇతడి ఒంటి మీద గోటి గాట్లు
ఉన్నాయి ... పీక నులిపి చంపారు .. ఒకరు పీక నులిపితే ఇంకొకరు కాళ్ళని కదల కుండా పట్టుకున్నారు ...
అన్నాడు యశ్వంత్ .
ఏంటో అంతా చూసినట్టే చెబుతున్నావు .... నువ్వెలా చెప్పగలవ్ ... ఇవన్నీ నిజాలని ? అన్నాడు భూపతి ..
ఇదంతా అమాయకులైన ఈ ప్రజలకి తెలియక పోవొచ్చు ... కానీ తెలివితేటలు ఉన్న వాళ్లకి ఖచ్చితం గా అర్థ
మవుతుంది మిస్టర్ భూపతి రాయుడు ... అన్నాడు యశ్వంత్ ..
యశ్వంత్ ... నేను మన వెహికల్ లో వెళ్లి పోలీస్ కి ఫోరెన్సిక్ వాళ్లకి ఇంటిమేట్ చేసి వస్తాను .. అన్నాడు శివ .
చిన్నగా తల పంకించాడు యశ్వంత్ ..
శివ కదలగానే ... ఆగు బాబూ అన్నాడు భూపతి ..
శివ ఆగి ఏమిటన్నట్లు చూసాడు భూపతి వైపు ...
ఇది మా వూరి వ్యవహారం ... బయట నుండి వచ్చిన మీరు ఇందులో కల్పించుకోకండి ... అన్నాడు భూపతి
కటువుగా ...
వెంటనే ... శవం కంపు గొట్టక మునుపే అంత్యక్రియలకి ఏర్పాట్లు చేయండి ... అన్నాడు జనం వైపు చూసి .
జనం లోంచి కొందరు శవం వైపు రాబోతుండగా ... ఆగండి .. అన్నాడు యశ్వంత్ ..
వారంతా అయోమయం గా భూపతి వైపు యశ్వంత్ వైపు చూసారు
(ఇంకా ఉంది )

No comments:
Post a Comment